IRCTCలో ఇంత మంచి ఆప్షన్ ఉందా? ఇలా చేస్తే రిజర్వేషన్ సీట్ కన్ఫర్మ్
మీరు అర్జెంట్ గా ఊరెళ్లాలా? ట్రైన్ టిక్కెట్ దొరకలేదా? IRCTC యాప్ ఉపయోగించి ఇలా చేస్తే మీకు కన్ఫర్మ్ గా టికెట్ దొరుకుతుంది. అసలు IRCTCలో ఇలాంటి ఒక ఆప్షన్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఈ సీక్రెట్ గురించి ఇప్పుడే తెలుసుకుందాం రండి.

సాధారణంగా లాంగ్ జర్నీ అంటే ఎక్కువ మంది ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తారు. ముందుగా టికెట్స్ బుక్ చేసుకుంటే పర్లేదు కాని అప్పటికప్పుడు రిజర్వేషన్ చేయించాలంటే కష్టమే కదా. మరి రిజర్వేషన్ టికెట్ లభించకపోతే కన్ఫర్మ్ గా టికెట్ ఎలా సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
IRCTC యాప్ లో ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. కాని ఎక్కువ మంది రిజర్వేషన్ చేసేటప్పుడు ఉపయోగించే ఆప్షన్స్ తెలుసుకొని వాటినే ఉపయోగిస్తుంటారు. కొత్త వాటి గురించి పెద్దగా తెలుసుకోరు. అలాంటి సీక్రెట్ ఆప్షన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీని ద్వారా మీరు రిజర్వేషన్ లేకపోయినా టికెట్ కన్ఫర్మ్ చేసుకొని హ్యాపీగా ప్రయాణించొచ్చు.
IRCTC యాప్ ఓపెన్ చేయండి.
chat vacancy సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత మీరు వెళ్లాల్సిన ట్రైన్ నంబర్, డేట్, మీరు ఎక్కే స్టేషన్ పేరు సెలెక్ట్ చేసి, get train chart ఆప్షన్ పై క్లిక్ చేయండి.
అప్పుడు ఆ టైమ్ లో ఖాళీగా ఉన్న సీట్లు, కోచ్ ల వివరాలు కూడా క్లియర్ గా కనిపిస్తాయి.
అవి గుర్తు పెట్టుకొని స్టేషన్ లోని రిజర్వేషన్ కౌంటర్ దగ్గరకు వెళ్లి ఖాళీగా ఉన్న సీట్ వివరాలు చెప్పి రిజర్వేషన్ చేస్తారేమో అడగండి.
అక్కడ కుదరకపోతే జనరల్ టికెట్ తీసుకొని, ట్రైన్ లో ఖాళీగా ఉన్న సీట్ దగ్గరకు వెళ్లి కూర్చోండి.
టీసీ వచ్చాక ఆయన్ను రిక్వెస్ట్ చేసి డబ్బులు కట్టి టికెట్ కన్ఫర్మ్ చేసుకోండి.
ట్రైన్ లో రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మ్ కావాలంటే మరో టెక్నిక్ ఉంది. అదేంటంటే.. టికెట్ బుక్ చేసిన ప్రతిసారీ Consider for Auto Upgradation ఆప్షన్ ని టిక్ చేయడం మర్చిపోకండి. దీని వల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Consider for Auto Upgradation ఆప్షన్ వల్ల మీరు స్లీపర్ లో టికెట్ బుక్ చేసుకుంటే 3-ఏసీలో బెర్త్ ఖాళీగా ఉంటే ఫ్రీగా మిమ్మల్ని ఆ కోచ్ లోకి పంపిస్తారు. ఇకపై అద్భుతమైన ఈ టెక్నిక్స్ ని ఉపయోగించుకొని కన్ఫర్మ్ టికెట్స్ సంపాదించి ప్రశాంతంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి.