- Home
- Travel
- Indian Railways: మహిళలకు గుడ్ న్యూస్! ఇకపై రైళ్లలో లోయర్ బెర్త్ ఈజీగా పొందొచ్చు! ఎలాగంటే..
Indian Railways: మహిళలకు గుడ్ న్యూస్! ఇకపై రైళ్లలో లోయర్ బెర్త్ ఈజీగా పొందొచ్చు! ఎలాగంటే..
Indian Railways: రైళ్లలో లోయర్ బెర్త్ కోరుకునే వారికి ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఇకపై అడగకుండానే లోయర్ బెర్త్ లు ఇస్తుంది. ఈజీగా లోయర్ బెర్త్ లు పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశంలో ముఖ్యమైన ప్రజా రవాణా వ్యవస్థ అయిన రైల్వే ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు కల్పిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తోంది. రైల్వే శాఖ కూడా రోజురోజుకూ అభివఈద్ధి చెందుతోంది. కొత్త రకమైన రైళ్లు తయారు చేసి నడుపుతోంది. వేగంగా నడిచే వందేభారత్ వంటి రైళ్లు ప్రయాణికులకు మొదటి, ఫేవరేట్ ఆప్షన్ గా మారాయి. అందుకే వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంది.
ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే ఎక్కువ మందికి రిజర్వేషన్లు కన్ఫర్మ్ కాకపోడటంతో ఐఆర్‌సీటీసీ లాంటి మరో కొత్త యాప్ ను కూడా రైల్వే తీసుకొచ్చింది. రైల్వే టికెట్ల విషయంలోనే కాకుండా ఫుడ్, బెర్త్ ల విషయంలోనూ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. రిజర్వేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరూ వారికి కావాల్సిన బెర్త్ ల కోసం ప్రయత్నిస్తారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, దివ్యాంగులు లోయర్ బెర్త్ రిజర్వ్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. అవి దొరక్కపోతే చాలా ఇబ్బందులు పడుతుంటారు.
సీనియర్ సిటిజన్లు, గర్భిణులు, దివ్యాంగులు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లోయర్ బెర్త్ కావాలని కోరుకుంటారు. అయితే రిజర్వేషన్లలో పోటీ వల్ల కొన్నిసార్లు లోయర్ బెర్త్ వారికి దొరకదు. ఇప్పుడు రైల్వే శాఖ కొత్తగా మహిళలకు లోయర్ బెర్త్ సౌకర్యాన్ని పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. దీని ద్వారా ఇకపై మహిళలు, గర్భిణులు కోరుకున్నా లేకున్నా వారికి ఫస్ట్ లోయర్ బెర్త్ ఇస్తారు. ఈ మేరకు ప్రతి బోగీలో లోయర్ బెర్త్ ల కేటాయింపును పెంచుతోంది.
ప్రత్యేకంగా మహిళలకే కాకుండా సీనియర్ సిటిజన్లు, గర్భిణీ స్త్రీలు, దివ్యాంగులకు లోయర్ బెర్త్‌లు కచ్చితంగా దక్కేలా రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. ప్రతి బోగీలోనూ లోయర్ బెర్త్ లు వారికి అందేలా రిజర్వేషన్ విధానంలోనే మార్పులు చేస్తోంది. అందువల్ల ఇకపై 45 ఏళ్లు పై బడిన మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ప్రత్యేకంగా అడగకపోయినా లోయర్ బెర్త్ లభించే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి 9 రాష్ట్రాలు.. 4,189 కి.మీ.. 74 గంటల ప్రయాణం.. ఇండియాలో లాంగెస్ట్ ట్రైన్ ఇదే