MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Tips
  • కిచెన్ సింక్ క్లీన్ గా, స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ 6 ఫాలో అయితే చాలు!

కిచెన్ సింక్ క్లీన్ గా, స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ 6 ఫాలో అయితే చాలు!

కిచెన్ క్లీన్ గా, నీట్ గా ఉంటేనే అక్కడ తయారు చేసే ఫుడ్ బాగుంటుంది. కానీ కిచెన్ లో ఎక్కువశాతం సింక్ నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, ఇతర కారణాల వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. 

2 Min read
Author : Kavitha G
Published : Aug 29 2025, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sink Smell Removal Tips:
Image Credit : Getty

Sink Smell Removal Tips:

కిచెన్ సింక్ ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. మురికి, ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల సింక్ నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో సింక్ ని మెరిసేలా చేయవచ్చు. దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కిచెన్ సింక్‌ దుర్వాసన నివారించే చిట్కాలు
Image Credit : Getty

కిచెన్ సింక్‌ దుర్వాసన నివారించే చిట్కాలు

బేకింగ్ సోడా, వెనిగర్

సింక్ లో పేరుకుపోయిన మురికిని తొలగించడానికి బేకింగ్ సోడా, వెనిగర్ చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. ఒక కప్పు బేకింగ్ సోడాను సింక్ డ్రెయిన్‌లో పోయాలి. తర్వాత ఒక కప్పు వెనిగర్ జల్లాలి. 15–20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేయాలి. సింక్ శుభ్రం అవుతుంది. మంచి వాసన కూడా వస్తుంది.

35
వేడి నీటిని పోయడం
Image Credit : Getty

వేడి నీటిని పోయడం

సింక్ లో మనం వంటపాత్రలను రోజూ కడుగుతూనే ఉంటాం. వాటి నుంచే వచ్చే మురికి, జిడ్డు సింక్ లో పేరుకుపోతుంటాయి. కాబట్టి ప్రతిరోజు పాత్రలు శుభ్రం చేశాక.. సింక్ లో వేడి నీటిని పోయడం మంచిది. దీనివల్ల బ్యాక్టీరియా పెరగదు. సింక్ నీట్ గా ఉంటుంది. వాసన కూడా రాదు.  

నిమ్మరసం లేదా నిమ్మ తొక్కలు 

నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. వాడిన నిమ్మ తొక్కలను సింక్ డ్రెయిన్‌లో వేసి వేడి నీటితో రుద్దితే మంచి ఫలితం కనిపిస్తుంది. లేదా నిమ్మరసం వేసి కొంతసేపు అలాగే వదిలేసినా సరిపోతుంది.

45
ఉప్పు, వేడి నీళ్లు
Image Credit : Getty

ఉప్పు, వేడి నీళ్లు

చిటికెడు ఉప్పును డ్రెయిన్‌లో వేసి తర్వాత వేడి నీరు పోస్తే మురికి తొలగిపోతుంది. వేడినీటిలో కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి... ఆ తర్వాత డ్రైన్‌లో పోయాలి. కొంత సేపు అలాగే ఉంచి నీళ్లతో శుభ్రం చేసినా మంచి ఫలితం ఉంటుంది.

సింక్ ట్రాప్ 

సింక్ కింద ఉన్న పైపులో నీరు నిల్వ ఉంటుంది. ఇది కూడా దుర్వాసనకు కారణం కావచ్చు. కాబట్టి వారానికి ఒకసారి దాన్ని తీసి శుభ్రం చేయాలి. వాడిన కాఫీ పొడిని డ్రెయిన్ లో వేసి.. కొన్ని వేడి నీళ్లు పోసినా దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. 

55
ఆహార వ్యర్థాలను ముందే తొలగించండి
Image Credit : Getty

ఆహార వ్యర్థాలను ముందే తొలగించండి

ఆహార వ్యర్థాలను ప్లేటులో ఉంచి.. అలాగే సింక్‌లో వేయడం ద్వారా కూడా దుర్వాసన వస్తుంది. కాబట్టి ప్లేటు కడిగే ముందే ఆ మిగిలిన ఫుడ్ ని డస్ట్ బిన్ లో వేయండి. ప్రతిరోజు రాత్రి సింక్ ని శుభ్రం చేసి ఖాళీగా వదిలేయండి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Recommended image2
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Recommended image3
Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Related Stories
Recommended image1
ఈ చిట్కాలతో ఇంటిని ఈజీగా శుభ్రం చేయవచ్చు? ఓసారి ట్రై చేయండి!
Recommended image2
బాత్రూమ్ లో ఎప్పుడూ మంచి వాసన రావాలంటే ఈ 4 ఫాలో అయితే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved