బాత్రూమ్ లో ఎప్పుడూ మంచి వాసన రావాలంటే ఈ 4 ఫాలో అయితే చాలు!
బాత్రూమ్ నుంచి దుర్వాసన రావడం సహజమే. కానీ ఎంత శుభ్రం చేసినా దుర్వాసన పోకపోతే మాత్రం ఇంటిల్లిపాది ఇబ్బందిపడాల్సి వస్తుంది. కాబట్టి బాత్రూమ్ క్లీన్ గా నీట్ గా ఉండటం అవసరం. కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ దుర్వాసనను ఈజీగా పోగొట్టవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.

Bathroom Cleaning Tips
ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా బాత్రూమ్. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు బాత్రూమ్‌ను మనం తరచుగా ఉపయోగిస్తుంటాం. దానివల్ల అక్కడ ఒక రకమైన వాసన వస్తుంది. కొన్ని సందర్భాల్లో భరించలేని దుర్వాసన వస్తుంది. అయితే ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
బాత్రూమ్ లో దుర్వాసన ఎందుకు వస్తుంది?
బాత్రూమ్ ఎప్పుడూ తేమగా ఉండటం వల్ల అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ త్వరగా పెరుగుతాయి. ఇవి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం. బాత్రూమ్ మాత్రమే కాదు.. వాష్ బేసిన్ వంటి వాటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే అక్కడ నుంచి కూడా దుర్వాసన వస్తుంది. అయితే కొన్ని చిట్కాలతో దుర్వాసనను నివారించవచ్చు. అవేంటో చూద్దాం.
బేకింగ్ సోడా, వెనిగర్
బాత్రూమ్ శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, వెనిగర్ చక్కగా పనిచేస్తాయి. ముందుగా బేకింగ్ సోడాను బాత్రూమ్ లో చల్లి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత వెనిగర్ చల్లి బాగా రుద్ది శుభ్రం చేయాలి. దానివల్ల దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా నశిస్తుంది.
ఉప్పు, నిమ్మకాయ
నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి, దానిలో కొంచెం ఉప్పు చల్లి బాత్రూంలో ఒక మూలన ఉంచండి. అవి దుర్వాసనను పీల్చుకొని మంచి వాసనను వెదజల్లుతాయి. ఇంకో మార్గం ఏమిటంటే.. నిమ్మ తొక్కలను చెత్తకుండీలో వేయకుండా బాత్రూంలో ఉంచితే అది కూడా సువానసను వెదజల్లుతుంది.
ఎసెన్షియల్ ఆయిల్
ఎసెన్షియల్ ఆయిల్ బాత్రూమ్‌కి ఒక స్ప్రే లాంటిది. దీనికోసం చిన్న క్లాత్ ని లేదా కాటన్‌ని ఆయిల్ లో ముంచి.. దాన్ని ఒక గిన్నెలో పెట్టి బాత్రూమ్ మూలన ఉంచండి. బాత్రూమ్ అంతా మంచి వాసన వస్తుంది. లేదా ఒక స్ప్రే బాటిల్‌లో నీళ్లు పోసి, దానిలో ఈ ఆయిల్ కలిపి బాత్రూమ్ అంతా స్ప్రే చేస్తే చాలు.. సువాసన వస్తుంది.
వెంటిలేషన్
బాత్రూమ్ దుర్వాసన రాకుండా ఉండాలంటే వెంటిలేషన్ బాగుండాలి. అందుకోసం బాత్రూంలో చిన్న కిటికీ పెట్టుకోవచ్చు. లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ సెట్ చేసుకోవచ్చు. ఇది తేమను పీల్చుకొని, దుర్వాసనను బయటకు పంపుతుంది.