Ink Stains Remove Tips: పిల్లల యూనిఫామ్‌పై ఇంక్ మరకలా? ఇలా తొలగించండి!
పిల్లల స్కూల్ డ్రెస్ పై ఇంక్ మరకలు పడటం సహజం. అవి డ్రెస్ పై అలాగే ఉంటే చూడటానికి అస్సలు బాగుండదు. పిల్లలు కూడా ఆ దుస్తులను వేసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వాటిని తొలగించడం ముఖ్యం. ఇంక్ మరకలను ఈజీగా ఎలా తొలగించాలో ఇక్కడ చూద్దాం.

Removing Ink Stains from School Uniforms
పిల్లల స్కూల్ యూనిఫామ్‌పై పడిన మరకలను తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంత రుద్దినా కొన్నిసార్లు ఆ మరకలు పోవు. అయితే కొన్ని పదార్థాలతో వాటిని సులభంగా తొలగించవచ్చు. అవేంటో ఎలా ఉపయోగించాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నిమ్మకాయ, ఉప్పు
యూనిఫామ్‌పై ఇంక్ మరకలను పూర్తిగా తొలగించడానికి నిమ్మకాయ, ఉప్పు సహాయపడతాయి. నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి మరకలపై రాసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత తేలికగా రుద్ది, ఉతకాలి. ఇలా చేస్తే ఇంక్ మరకలు పూర్తిగా పోతాయి. నిమ్మరసంలో సహజంగా బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వల్ల అవి మరకలను సులభంగా శుభ్రం చేస్తాయి.
బేకింగ్ సోడా
సాధారణంగా చాలామంది బట్టలపై మరకలను తొలగించడానికి బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. యూనిఫామ్‌పై ఇంక్ మరకలను తొలగించడానికి కూడా బేకింగ్ సోడాను వాడవచ్చు. మరకలపై బేకింగ్ సోడా రాసి 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత మెత్తటి బ్రష్‌తో రుద్ది ఉతకాలి. యూనిఫామ్‌పై ఇంక్ మరకలు పోతాయి.
వైట్ వెనిగర్
వైట్ వెనిగర్‌లో ఆమ్ల గుణం ఉండటం వల్ల మరకలను తొలగించడానికి ఉపయోగించవచ్చు. యూనిఫామ్‌పై ఇంక్ మరకలను తొలగించడానికి 2 స్పూన్ల వెనిగర్‌ను 2 స్పూన్ల నీటిలో కలిపి మరకలపై బాగా రుద్దాలి. 15 నిమిషాల తర్వాత మెత్తటి బ్రష్‌తో రుద్ది ఉతకాలి. మరకలు పోతాయి.
టూత్ పేస్ట్
టూత్ పేస్ట్ కేవలం పళ్లు శుభ్రం చేయడానికే కాదు.. మరకలను తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. యూనిఫామ్‌పై ఇంక్ మరకలను తొలగించడానికి వాటిపై కొద్దిగా టూత్ పేస్ట్ రాసి, 15 నిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్ది ఉతకితే సరిపోతుంది.
నెయిల్ పాలిష్ రిమూవర్
గోళ్లపై ఉన్న నెయిల్ పాలిష్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్ ఎలా తొలగిస్తుందో, అదే విధంగా ఇంక్ మరకలను కూడా తొలగిస్తుంది. కాటన్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచి మరకలపై అప్లై చేస్తే సరిపోతుంది.
పిల్లల యూనిఫామ్‌పై ఇంక్ మరకలను తొలగించడానికి సానిటైజర్‌ను నేరుగా వాడవచ్చు. సానిటైజర్ ని మరకలపై పోసి బాగా ఆ తర్వాత బ్రష్‌తో మెల్లగా రుద్ది శుభ్రం చేయాలి.