Telugu

వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి!

Telugu

బట్టల్లో నీరు లేకుండా..

బట్టలు ఉతికిన తర్వాత వాటిలో నీరు లేకుండా బాగా పిండాలి. వాషింగ్ మెషిన్‌లో అయితే 'స్పిన్ మోడ్' ఉపయోగిస్తే సరిపోతుంది.  

Image credits: freepik
Telugu

గాలి తగిలే చోట..

వర్షాకాలంలో బట్టలను బయట ఆరవేయడం కుదరదు. కాబట్టి ఇంట్లోనే గాలి వచ్చే ప్రదేశంలో లేదా ఫ్యాన్ కింద ఆరవేయడం మంచిది.

Image credits: Getty
Telugu

బట్టల మధ్య ఖాళీ ప్లేస్..

బట్టలు ఒకదానికొకటి అతుక్కుని ఉంటే, వాటి మధ్య గాలి ప్రసరణ ఉండదు. ఆరడానికి ఆలస్యం అవుతుంది. కాబట్టి బట్టల మధ్య కొంత ఖాళీ ఉంచాలి.

Image credits: our own
Telugu

హెయిర్ డ్రైయర్

హెయిర్ డ్రైయర్‌ లేదా ఐరన్ బాక్స్ ఉపయోగించి బట్టలను ఆరబెట్టుకోవచ్చు. కానీ ఈ పద్ధతిని అత్యవసరమైనప్పుడు వాడటం మంచిది.  

Image credits: Getty
Telugu

దుర్వాసన రాకుండా..

బట్టలు సరిగ్గా ఆరకపోతే వాటినుంచి దుర్వాసన వస్తుంది. కాబట్టి వాటిపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లుకోవాలి. లేదా ఉతికేటప్పుడు కొద్దిగా సువాసన కలిగిన డిటర్జెంట్ వాడవచ్చు.

Image credits: freepik

Skin Care: పుదీనాతో వీటిని కలిపి రాస్తే ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు!

Kitchen Tips: కిచెన్ శుభ్రంగా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు..!

Gas Stove Cleaning Tips: వీటితో గ్యాస్ స్టవ్ ని ఈజీగా శుభ్రం చేయవచ్చు!

Bed Bugs Control Tips: ఇలా చేస్తే మంచాలు, సోఫాల్లో ఒక్క నల్లి ఉండదు!