పాత కారు కూడా కొత్త దానిలా పనిచేయాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
ప్రస్తుత రోజుల్లో ప్రతి కుటుంబానికి కారు అవసరంగా మారిపోయింది. ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కొందరు కొత్త కారు, మరికొందరు సెంకడ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసి వాడుతుంటారు. ఏ కారైనా సరే ఎక్కువ కాలం పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం.

Car Maintenance Tips
సాధారణంగా కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పేద, మధ్య తరగతి వారు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తుంటారు. ఆర్థికంగా కాస్త ఇబ్బంది లేనివారు కొత్త కారు కొంటుంటారు. అయితే ఏ కారు కొన్నా.. దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడం ముఖ్యం. అప్పుడే కారు లైఫ్ టైం పెరుగుతుంది. కొన్ని సింపుల్ చిట్కాలతో కారు లైఫ్ టైమ్ పెంచుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఫ్ల్యూయిడ్స్ చెక్ చేయడం..
పాత కారు కూడా కొత్తదానిలా పరుగులు తీయాలంటే ఫ్ల్యూయిడ్స్ ని రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండాలి. ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్‌లు సరిగ్గా ఉన్నాయో చూసుకోవాలి. అవసరమైతే మార్చుకోవాలి. లేదంటే కారు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
టైర్ల నిర్వహణ
కారు నిర్వహణలో టైర్లు కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా టైర్లలో గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే టైర్ లో గాలి ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా ఇబ్బందే. అంతేకాదు అవి తిరిగిన దూరాన్ని బట్టి వాటిని మార్చుకోవడం కూడా అవసరం. లేకపోతే టైర్ల కు పగుళ్లు ఏర్పడి కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరగవచ్చు.
బ్రేక్ సిస్టమ్..
ఏ వాహనానికైనా బ్రేకులు చాలా ముఖ్యం. బ్రేక్ సిస్టమ్ బాగుంటేనే జర్నీ సాఫీగా, స్మూత్ గా సాగిపోతుంది. అవి సరిగ్గా లేకపోతే మనం సేఫ్ గా డ్రైవ్ చేయలేము. ప్రమాదాలు కూడా జరగవచ్చు. కాబట్టి బ్రేక్ ప్యాడ్‌లు, రోటర్‌లను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి. అవసరమైతే వెంటనే మార్చేయాలి.
బ్యాటరీ మెయింటనెన్స్
కారుకు బ్యాటరీ కూడా చాలా ముఖ్యం. బ్యాటరీలో కొన్ని సమస్యలు మనకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి మెకానిక్ సహాయం తీసుకోవడం మంచిది. తుప్పు, లీకేజీ వంటి సమస్యలుంటే వెంటనే రిపేర్ చేయించాలి. దానివల్ల కారు లైఫ్ పెరుగుతుంది. బ్యాటరీతో పాటు వైపర్ బ్లేడ్లను కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. వైపర్ బ్లేడ్‌లు సరిగ్గా పనిచేయాలంటే వాటిని రెగ్యులర్ గా క్లీన్ చేయాలి. ఒకవేళ వైపర్ పాడైతే.. వెంటనే మార్చేయడం మంచిది. లేకపోతే గ్లాస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.