PV Sindhu: జపాన్ ఓపెన్ హిస్టరీలో ఫస్ట్ ఇండియన్.. పీవీ సింధు మైండ్ బ్లోయింగ్ విక్టరీ
PV Sindhu Japan Open 2026: జపాన్ ఓపెన్ ఫైనల్లో లోకల్ స్టార్ అకానె యమగుచిని చిత్తు చేసి, ఈ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది.

హోమ్ గ్రౌండ్‌లో యమగుచికి చుక్కలు చూపించిన పీవీ సింధు
చాలా కాలంగా ఒక్క పెద్ద టైటిల్ లేక అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డ మాట నిజమే. ఇంజ్యూరీలు, ఫామ్ కోల్పోవడం, వయసు పెరగడం.. ఇలా ఎన్నో కామెంట్స్. కానీ వాటన్నింటికీ మన ఇండియన్ బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు టోక్యో కోర్టులోనే అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌లో పీవీ సింధు హిస్టరీ క్రియేట్ చేసింది.
హోమ్ ఫేవరెట్, జపాన్ స్టార్ ప్లేయర్ అకానె యమగుచిని ఆమె సొంత గడ్డపైనే చిత్తు చేసి, జపాన్ ఓపెన్ గెలిచిన మొట్టమొదటి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. 2024 లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ గెలిచిన తర్వాత సింధు సాధించిన అతిపెద్ద సక్సెస్ ఇదే. 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ వింటేజ్ సింధును అభిమానులు ఈ మ్యాచ్‌లో చూశారు.
So happy to see @Pvsindhu1 smiling and on top of the podium at the Japan Open Super 750. She has worked so hard for this. Really deserves this title pic.twitter.com/x8Xv65HON4
— Viren Rasquinha (@virenrasquinha) July 19, 2026
యమగుచికి చెక్.. ఫుల్ ప్లానింగ్‌తో సింధు అటాక్
ఈ మ్యాచ్‌కు ముందు రికార్డులు చూస్తే యమగుచి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆమెకు ఇది ఆరో జపాన్ ఓపెన్ ఫైనల్. అంతేకాదు, గత నాలుగేళ్లుగా యమగుచిని ఒక పూర్తి మ్యాచ్‌లో సింధు ఓడించలేకపోయింది. ఈ ఏడాది మలేషియా ఓపెన్‌లో మ్యాచ్ జరిగినా.. యమగుచి ఫస్ట్ గేమ్ తర్వాత రిటైర్ అవ్వడంతో సింధు గెలిచింది.
కానీ ఈ సారి మాత్రం సింధు పక్కా ప్లానింగ్‌తో కోర్టులోకి దిగింది. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే ఫుల్ అగ్రెసివ్ మూడ్‌లో కనిపించింది. నెట్ ప్లేతో యమగుచిని తెగ ఇబ్బంది పెట్టింది. షటిల్‌ను నెట్‌కు క్లోజ్‌గా ఉంచుతూ, యమగుచి దాన్ని లిఫ్ట్ చేసేలా ఫోర్స్ చేసింది. ఆ గ్యాప్‌లో దొరికిందే ఛాన్స్ అంటూ తన మార్క్ క్రాస్ కోర్ట్, బాడీ స్మాష్‌లతో పాయింట్లు కొల్లగొట్టింది.
38 షాట్ల ర్యాలీ.. ఫస్ట్ గేమ్ మనదే
ఫస్ట్ గేమ్ స్టార్టింగ్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. 11-11 స్కోరు వరకు ఇద్దరూ తగ్గేదే లే అన్నట్లు ఆడారు. ఆ తర్వాతే అసలు ఆట మొదలైంది. సింధు సూపర్ స్పీడ్‌తో 16-12 తో లీడ్ సాధించింది. అయితే స్కోరు 17-15 వద్ద ఉన్నప్పుడు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచేలా ఒక భారీ 38-షాట్ల ర్యాలీ జరిగింది.
యమగుచి డిఫెన్స్ సూపర్బ్ గా ఉన్నా, సింధు క్రాస్-కోర్ట్ స్మాష్‌తో ఆ ర్యాలీని నెగ్గింది. ఆ ప్రెజర్‌లో యమగుచి చేసిన తప్పుల వల్ల సింధుకు గేమ్ పాయింట్స్ వచ్చాయి. చివరకు యమగుచి షటిల్‌ను నెట్‌కు కొట్టడంతో 21-17 తో ఫస్ట్ గేమ్‌ను సింధు ఖాతాలో వేసుకుంది.
తగ్గేదే లే.. సెకండ్ గేమ్‌లోనూ అదే జోరు
ఫస్ట్ గేమ్ గెలిచిన జోష్‌తో సెకండ్ గేమ్‌లో సింధు మరింత రెచ్చిపోయింది. ఇంటర్వెల్ సమయానికి 11-7 తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత స్కోరును 14-7 కు తీసుకెళ్లి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసింది. కానీ లోకల్ క్రౌడ్ సపోర్ట్‌తో యమగుచి అంత ఈజీగా వదల్లేదు. కొన్ని సూపర్ నెట్ షాట్లతో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేసింది.
ఇదే టైమ్‌లో సింధు కూడా కొన్ని అన్‌ఫోర్స్డ్ ఎర్రర్స్ చేయడంతో స్కోరు 14-12 కు, ఆ తర్వాత 19-17 కు చేరింది. మ్యాచ్ ఉత్కంఠగా మారుతున్న టైమ్‌లో 31 ఏళ్ల సింధు తన ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని వాడి ప్రెజర్‌ను హ్యాండిల్ చేసింది. యమగుచి చేసిన తప్పుతో సింధుకు మూడు ఛాంపియన్‌షిప్ పాయింట్లు దక్కాయి.
రివ్యూతో తేలింది.. హిస్టరీ క్రియేట్ అయింది
చివరి పాయింట్ కోసం జరిగిన పోరులో యమగుచి కొట్టిన రిటర్న్ లైన్ అవతల పడింది. దాంతో యమగుచి వీడియో రివ్యూ తీసుకుంది. ఆ రివ్యూలో షటిల్ బయట పడినట్లు క్లియర్‌గా తేలడంతో అంపైర్ సింధును విజేతగా ప్రకటించారు. దీంతో 21-17, 21-17 తో వరుస గేముల్లో యమగుచికి షాకిస్తూ జపాన్ ఓపెన్ ట్రోఫీని సింధు ముద్దాడింది. టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో మన జాతీయ గీతం మారుమోగుతుంటే అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ హిస్టారిక్ విక్టరీతో బ్యాడ్మింటన్ వరల్డ్‌కు తనేంటో సింధు మరోసారి గట్టిగా నిరూపించింది.

