MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma: రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ ఏమన్నారో తెలుసా?

Rohit Sharma: రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ ఏమన్నారో తెలుసా?

Rohit Sharma Retirement: వన్డే క్రికెట్ రిటైర్మెంట్ రూమర్లపై టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చారు. బయట జరిగే చర్చలు తనను ఏమాత్రం ప్రభావితం చేయవని తేల్చి చెప్పారు. తన రిటైర్మెంట్ పై హిట్ మ్యాన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 19 2026, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గంభీర్, రోహిత్ మధ్య గొడవలు నిజమేనా? రిటైర్మెంట్ హిట్ మ్యాన్ కామెంట్స్
Image Credit : Getty

గంభీర్, రోహిత్ మధ్య గొడవలు నిజమేనా? రిటైర్మెంట్ హిట్ మ్యాన్ కామెంట్స్

వన్డే క్రికెట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్ అవుతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ రూమర్స్ నడుస్తున్నాయి. ఈ రూమర్స్ పై టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. బయట ఏం మాట్లాడుకుంటున్నారనేది తనకు అస్సలు మేటర్ కాదని తేల్చి చెప్పారు. ఇంగ్లండ్‌తో జరగబోయే కీలకమైన మూడో వన్డే కోసం లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేయడానికి వచ్చినప్పుడు రోహిత్ ఈ కామెంట్స్ చేశారు.

ఇండియన్ బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటాక్‌తో రోహిత్ శర్మ మాట్లాడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో రోహిత్.. "బయట ఏం జరుగుతుందనేది మనల్ని అస్సలు ప్రభావితం చేయదు" అని అనడం స్పష్టంగా వినిపించింది. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డే తర్వాత, లార్డ్స్ మ్యాచ్‌ రోహిత్‌కు చివరి వన్డే కాబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ రోహిత్ మాత్రం ఈ రూమర్లను లైట్ తీసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బీసీసీఐ క్లారిటీ ఇదే
Image Credit : Getty

బీసీసీఐ క్లారిటీ ఇదే

ఈ రిటైర్మెంట్ వార్తలను బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా పూర్తిగా కొట్టిపారేశారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ బేస్‌లెస్ అని ఆయన స్పష్టం చేశారు. రోహిత్ వన్డే టీమ్‌లో అత్యంత కీలక భాగమని చెప్పారు.

అయితే, గత నెల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ముందు సెలక్షన్ కమిటీలోని కొందరు సభ్యులు రోహిత్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ డిస్కషన్స్‌లో ఉన్నారట. కానీ బీసీసీఐ టాప్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ సిరీస్‌లకు రోహిత్‌ను జట్టులోనే కొనసాగించారు. వన్డేల్లో 11,700 కంటే ఎక్కువ రన్స్ చేసిన రోహిత్, 2023 వరల్డ్ కప్ ఫైనల్ చేరడంలో, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ వన్డే కెప్టెన్ అయినప్పటికీ, సీనియర్ ప్లేయర్ గా రోహిత్ రోల్ టీమ్‌కు చాలా ముఖ్యం.

35
గంభీర్ తో చిల్ మోడ్
Image Credit : ANI

గంభీర్ తో చిల్ మోడ్

గతంలో రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య అస్సలు పడటం లేదంటూ కొన్ని వార్తలు వచ్చాయి. 2024-25 ఆస్ట్రేలియా టూర్ టైంలో సిడ్నీ టెస్ట్ ప్రాక్టీస్‌కు రోహిత్ లేట్‌గా రావడం, ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రోహిత్ కాకుండా గంభీర్ వెళ్లడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని అనుకున్నారు. కానీ లార్డ్స్ మైదానంలో సీన్ పూర్తిగా మారిపోయింది.

శనివారం జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మ చాలా యాక్టివ్‌గా కనిపించారు. ప్రాక్టీస్‌కు ముందు లార్డ్స్ బాల్కనీలో కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటాక్‌లతో రోహిత్ సుదీర్ఘంగా చర్చించారు. గంభీర్, రోహిత్ ఇద్దరూ నవ్వుతూ జోకులు వేసుకుంటూ చాలా ఫ్రెండ్లీగా కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది.

45
రోహిత్ శర్మకు బౌలింగ్ కోచ్ సపోర్ట్
Image Credit : AFP

రోహిత్ శర్మకు బౌలింగ్ కోచ్ సపోర్ట్

ప్రస్తుతం రోహిత్ శర్మ ఫామ్ కోసం కాస్త ఇబ్బంది పడుతున్నారు. కొత్త బంతితో రన్స్ చేయడం అతనికి కొంచెం కష్టంగా మారుతోంది. దీనిపై ఇండియన్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందిస్తూ రోహిత్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.

"కొత్త బాల్ బాగా స్వింగ్ అవుతుండటం వల్ల రోహిత్ రన్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్న మాట నిజమే. కానీ రోహిత్ ఇలాంటి సిట్యుయేషన్స్ ని గతంలో చాలాసార్లు చూశాడు. ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలో అతనికి బాగా తెలుసు. రోహిత్‌కు బోలెడంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. కచ్చితంగా అతను ఈ బ్యాడ్ ఫామ్ నుంచి స్ట్రాంగ్‌గా కంబ్యాక్ ఇస్తాడు" అని మోర్నీ మోర్కెల్ మీడియాతో చెప్పారు.

55
2027 వరల్డ్ కప్ ప్లాన్స్ లో రోహిత్ శర్మ
Image Credit : social media

2027 వరల్డ్ కప్ ప్లాన్స్ లో రోహిత్ శర్మ

రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలను బీసీసీఐ ప్రస్తుతానికి కొట్టేసినప్పటికీ, 2027 వన్డే వరల్డ్ కప్‌లో అతను ఉంటాడా లేదా అనే దానిపై బోర్డు ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు.

టీమ్‌లోకి వచ్చేందుకు యశస్వి జైస్వాల్ లాంటి యంగ్ జనరేషన్ ప్లేయర్స్ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. సౌతాఫ్రికాలో జరగబోయే 2027 వరల్డ్ కప్ ప్లాన్స్ లో రోహిత్ శర్మ ఉంటాడా లేదా అనే ఫైనల్ డెసిషన్ మాత్రం సెలక్టర్లే తీసుకుంటారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రోహిత్ మాత్రం తన ఆటపైనే పూర్తి ఫోకస్ పెట్టాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రోహిత్ శర్మ
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IND vs ENG: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ నిజమేనా? లార్డ్స్ పోరుకు టీమిండియాలో 2 మార్పులు !
Recommended image2
Rohit Sharma Net Worth: రూ.50 కోచింగ్ ఫీజ్ నుండి వందల కోట్ల సామ్రాజ్యం వరకు.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రేంజ్ ఇదీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved