MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • YouTuber Vaishnavi : ఎవరీ యూట్యూబర్ వైష్ణవి..?

YouTuber Vaishnavi : ఎవరీ యూట్యూబర్ వైష్ణవి..?

తెలుగు యూట్యూబర్ వైష్ణవి ఘటన ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఇంతకు ఆమె ఎవరు… లవ్ స్టోరీ ఏమిటి.. యూట్యూబ్ జర్నీ ఎలా ప్రారంభమయ్యింది.. ఎందుకు హత్యకు గురయ్యింది..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 20 2026, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యూట్యూబర్ వైష్ణవి మృతి
Image Credit : Screenshot to Vaishnavi Amma youtube channel

యూట్యూబర్ వైష్ణవి మృతి

YouTuber Vaishnavi : పాపం... అభం శుభం తెలియని ఆడబిడ్డను కట్టుకున్నవాడే కడతేర్చాడు. ప్రేమించానని వెంటపడ్డాడు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు... దీంతో అతడిని నమ్మిన ఈ పిచ్చితల్లి జీవితాంతం హాయిగా జీవించవచ్చని కలలు కనింది. కానీ ఆ కిరాతకుడు నమ్మివచ్చిన అమ్మాయికి నరకం చూపించి పొట్టనబెట్టుకున్నాడు. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ, యూట్యూబ్ వీడియోలతో అలరిస్తున్న వైష్ణవి మరణం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎవరీ వైష్ణవి..?
Image Credit : AI Meta

ఎవరీ వైష్ణవి..?

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, రాణి దంపతులు కూతురు వైష్ణవి (19). ఈమె అయ్యప్పగుట్టకు చెందిన హరిబాబును ప్రేమించింది... ఇద్దరూ ఇష్టపడే తమ ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోకున్నా ఎదిరించి మరీ పెళ్లిచేసుకున్నారు.

హరిబాబు హాస్పిటల్లో పనిచేసేవాడు. పెళ్ళి తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండే వైష్ణవి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. తాను రోజూ చేసే పనులు, వేడుకలు, కుటుంబసభ్యులతో సంభాషణలను యూట్యూబ్ ఛానల్లో పెట్టేది. ఇలా 'వైష్ణవి అమ్మ' పేరుతో రన్ చేసే యూట్యూబ్ ఛానల్ కు అభిమానులు కూడా పెరిగారు... ఏకంగా 50 వేలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Related Articles

Related image1
Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ కు దిమ్మతిరిగే షాక్.. ఇన్‌స్టాగ్రామ్ ఏం చేసిందంటే?
Related image2
Ali Khamenei: నడి రోడ్డుపై 16 ఏళ్ల యువతి ఉరితీత.. ఖమేనీ మరణం ఆ కర్మ ఫలితమేనా.?
34
వైష్ణవి మరణానికి కారణమేంటి..?
Image Credit : Getty

వైష్ణవి మరణానికి కారణమేంటి..?

వైష్ణవి, హరిబాబు ఏడాది క్రితమే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు... పేరెంట్స్ కు దూరంగా ఉన్నంతకాలం వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. ఎప్పుడయితే హరిబాబు కుటుంబసభ్యులు వీరి జీవితంలో ఎంటరయ్యారో అలజడి రేగింది. కట్నం కోసం తల్లిదండ్రులు ఒత్తిడిచేయడంతో హరిబాబు కూడా భార్య వైష్ణవిని వేధించడం ప్రారంభించాడు. ఇలా కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

కూతురు జీవితం బాగుండేందకు వైష్ణవి తల్లిదండ్రులు కట్నంగా రూ.5 లక్షలతో కొంత భూమిని కొనిచ్చారు. అంతేకాదు బంగారం కూడా పెట్టారు. దీంతో హరిబాబు కుటుంబం సంతృప్తి చెందలేదు.. గర్బిణి అనికూడా చూడకండా అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. ఈ కట్నం విషయంలోనే తాజాగా వైష్ణవి, హరిబాబుకు గొడవ జరిగినట్లు... ఆగ్రహంతో ఊగిపోయిన అతడు వైష్ణవిని కత్తితో పొడిచి హతమార్చాడు.

44
హరిబాబు తల్లి, సోదరులు అరెస్ట్...
Image Credit : X/Telangana Police

హరిబాబు తల్లి, సోదరులు అరెస్ట్...

యూట్యూబర్ వైష్ణవి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది... దీంతో ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. వైష్ణవి పేరెంట్స్ ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కోరుట్ల శివారులో నిందితుడు హరిబాబును అరెస్ట్ చేశారు. వైష్ణవి మరణంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు భర్తతో పాటు అతడి తల్లి, సోదరుల ప్రమేయం ఉందని గుర్తించారు. తాజాగా ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వైష్ణ‌వి భ‌ర్త హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి, ఇద్ద‌రు అన్న‌లు చిత్తారి అశోక్, చిత్తారి ఆనంద్ ల అరెస్ట్ చేశారు. నిందితుల‌ను రిమాండ్‌కు త‌ర‌లించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వైరల్ న్యూస్
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
రెండు రోజులుగా ఒకే చోట పార్కింగ్ చేసిన కారులోంచి దుర్వాస‌న‌.. ఏంటా చూడ‌గా షాకింగ్ సీన్
Recommended image2
కొండా ఫ్యామిలీ వర్సెస్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ పాలిటిక్స్‌లో అస‌లేం జరుగుతోంది.?
Recommended image3
ఆగ‌స్టు 21న స్కూళ్ల‌కు సెల‌వు.. ప్రిన్సిప‌ల్ హ‌త్య‌ను ఖండిస్తూ. అస‌లేం జ‌రిగిందంటే.?
Related Stories
Recommended image1
Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ కు దిమ్మతిరిగే షాక్.. ఇన్‌స్టాగ్రామ్ ఏం చేసిందంటే?
Recommended image2
Ali Khamenei: నడి రోడ్డుపై 16 ఏళ్ల యువతి ఉరితీత.. ఖమేనీ మరణం ఆ కర్మ ఫలితమేనా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved