MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Worlds Most Expensive Streets: ప్రపంచ టాప్ షాపింగ్ స్ట్రీట్స్‌లో హైదరాబాద్ 3 ప్రాంతాలకు చోటు

Worlds Most Expensive Streets: ప్రపంచ టాప్ షాపింగ్ స్ట్రీట్స్‌లో హైదరాబాద్ 3 ప్రాంతాలకు చోటు

Worlds Most Expensive Streets: హైదరాబాద్ రేంజ్ మరింత పెరుగుతోంది. ప్రపంచంలోని ఖరీదైన వీధుల లిస్ట్‌లో మన 3 ఏరియాలు నిలిచాయి. కష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ 2026 రిపోర్ట్‌లో హైదరాబాద్‌లోని 3 స్ట్రీట్స్‌ ఆసియా-పసిఫిక్ టాప్ రిటైల్ వీధుల లిస్టులో చేరాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 19 2026, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచ రిటైల్ మ్యాప్‌లో మెరిసిన హైదరాబాద్ షాపింగ్ అడ్డాలు ఇవే
Image Credit : Chatgpt తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ రిటైల్ మ్యాప్‌లో మెరిసిన హైదరాబాద్ షాపింగ్ అడ్డాలు ఇవే

హైదరాబాద్ ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. గ్లోబల్ మ్యాప్‌లో మన నగరం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఫుడ్ కల్చర్ నుంచి బిజినెస్, లైఫ్‌స్టైల్, లగ్జరీ వరకు నిజాం నగరం తన రేంజ్ పెంచుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.

కష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ విడుదల చేసిన మెయిన్ స్ట్రీట్స్ అక్రాస్ ది వరల్డ్ 2026 రిపోర్ట్‌లో హైదరాబాద్‌లోని మూడు ప్రముఖ షాపింగ్ ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయి. ఆసియా-పసిఫిక్ (APAC) అత్యంత ఖరీదైన, ప్రముఖ రిటైల్ వీధుల జాబితాలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హిమాయత్‌నగర్ నిలిచాయి. ముఖ్యంగా ఈ ఏడాది జూబ్లీహిల్స్ కొత్తగా ఈ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ టాప్
Image Credit : venkatahanuma's vagary/Youtube

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ టాప్

తాజా రిపోర్టుల ప్రకారం.. ఆసియా-పసిఫిక్ జాబితాలో జూబ్లీహిల్స్ 51వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రైమ్ రిటైల్ అద్దెలు నెలకు చదరపు అడుగుకు రూ. 250గా ఉన్నాయి. ఇక బంజారాహిల్స్, హిమాయత్‌నగర్ సంయుక్తంగా 52వ స్థానాన్ని పంచుకున్నాయి. బంజారాహిల్స్‌లో నెలకు చదరపు అడుగుకు అద్దె రూ. 230 కాగా, హిమాయత్‌నగర్‌లో రూ. 225గా ఉంది. గత ఎడిషన్‌లో కేవలం బంజారాహిల్స్, హిమాయత్‌నగర్ మాత్రమే ఈ లిస్ట్‌లో ఉండేవి. ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా వీటితో జతకట్టడంతో హైదరాబాద్‌కు ప్రీమియం షాపింగ్ డెస్టినేషన్‌గా ఉన్న క్రేజ్ మరింత పెరిగింది.

35
ఈ మూడు ఏరియాల స్పెషాలిటీ ఏంటి?
Image Credit : Chatgpt తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

ఈ మూడు ఏరియాల స్పెషాలిటీ ఏంటి?

బంజారాహిల్స్ ఎప్పటి నుంచో హైదరాబాద్‌లో ఖరీదైన షాపింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ముఖ్యంగా రోడ్ నంబర్ 1, రోడ్ నంబర్ 2, రోడ్ నంబర్ 12లలో డిజైనర్ బోటిక్‌లు, ప్రీమియం ఫ్యాషన్ లేబుల్స్, జ్యువెలరీ షోరూమ్‌లు, లైఫ్‌స్టైల్ స్టోర్స్ ఎక్కువగా ఉన్నాయి. లగ్జరీ అవుట్‌లెట్స్, కేఫ్‌లు, రెస్టారెంట్లతో ఈ ప్రాంతం ఒక పెద్ద లైఫ్‌స్టైల్ హబ్‌గా మారింది.

మరోవైపు జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 36, రోడ్ నంబర్ 45 ప్రాంతాలు మోడ్రన్ రిటైల్ షాపింగ్‌కు అడ్డాగా మారాయి. డిజైనర్ స్టూడియోలు, బ్యూటీ, వెల్‌నెస్, హోమ్ డెకర్ అవుట్‌లెట్స్, ఖరీదైన బ్రాండ్లు, కేఫ్‌లు ఇక్కడ యూత్‌ను, షాపింగ్ ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక హిమాయత్‌నగర్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా భిన్నమైన షాపింగ్ అనుభూతిని ఇస్తుంది. వెస్ట్ హైదరాబాద్‌లోని లగ్జరీ ఏరియాలకు భిన్నంగా, హిమాయత్‌నగర్ ఒక సందడిగా ఉండే హై స్ట్రీట్. ఇక్కడ బట్టలు, నగలు, చెప్పులు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్స్ షాపులతో పాటు ఫుడ్ స్పాట్స్ కూడా ఎక్కువే. అన్ని రకాల బడ్జెట్లలో షాపింగ్ చేసే ఫ్యామిలీలకు ఇది ఎప్పటి నుంచో ఫేవరెట్ హబ్‌గా కొనసాగుతోంది.

45
దేశంలోని ఇతర నగరాల పరిస్థితి ఏంటి?
Image Credit : Getty

దేశంలోని ఇతర నగరాల పరిస్థితి ఏంటి?

భారతదేశంలో అత్యంత ఖరీదైన హై స్ట్రీట్‌గా ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 24వ స్థానంలో, ఆసియా-పసిఫిక్ జాబితాలో 25వ స్థానంలో ఖాన్ మార్కెట్ నిలిచింది. ప్రపంచంలోని టాప్ 30 అత్యంత ఖరీదైన రిటైల్ వీధుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ ప్రాంతం ఇదే.

ఇక్కడ నెలకు చదరపు అడుగు అద్దె రూ. 1,875గా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇక్కడ అద్దెలు 14 శాతం పెరిగాయి. ముంబైలోని లింకింగ్ రోడ్ ఏపీఏసీ లిస్ట్‌లో 33వ స్థానంలో ఉండగా, అక్కడ నెలకు చదరపు అడుగు అద్దె రూ. 1,175గా ఉంది. వీటితో పాటు బెంగళూరు, పూణే, కోల్‌కతా, చెన్నై నగరాల్లోని హై స్ట్రీట్స్ కూడా ఆసియా-పసిఫిక్ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించాయి.

55
హైదరాబాద్ రిటైల్ మార్కెట్ జోరు
Image Credit : our own

హైదరాబాద్ రిటైల్ మార్కెట్ జోరు

దేశంలోని అత్యంత ఖరీదైన షాపింగ్ ప్రాంతాలైన ఢిల్లీ, ముంబైలతో పోలిస్తే హైదరాబాద్‌లో రిటైల్ అద్దెలు చాలా తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ, ఒకే నగరం నుంచి మూడు ప్రాంతాలు ఆసియా-పసిఫిక్ జాబితాలో చోటు సంపాదించడం విశేషం. హైదరాబాద్‌లో రిటైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లకు మన నగరం ఒక ప్రధాన కేంద్రంగా మారుతోందని ఈ ర్యాంకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
325
SLSL
(22.0 ov) 98 & 74/3
Day 2
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : నవంబర్ 22, 23, 24 మూడ్రోజులూ సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?
Recommended image2
Housing Scheme: ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Recommended image3
Adilabad Airport: ఆదిలాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయ్.. ఎయిర్‌పోర్ట్ కోసం రూ.324 కోట్ల మాస్టర్ ప్లాన్
Related Stories
Recommended image1
IRCTC Jyotirlinga Yatra: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకే ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం
Recommended image2
IPL Top 5 Captains: ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్లుగా అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved