MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Tallest Building in Hyderabad : హైదరాబాద్ లో అతిపెద్ద హైరైజ్ టవర్ ఏది? అత్యంత ఎత్తైన టాప్ 10 భవనాలివే

Tallest Building in Hyderabad : హైదరాబాద్ లో అతిపెద్ద హైరైజ్ టవర్ ఏది? అత్యంత ఎత్తైన టాప్ 10 భవనాలివే

మీరు పశ్చిమ హైదరాబాద్ వైపు వెళితే ఆకాశాన్ని తాకే అద్భుతమైన భవనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నియోపోలిస్, కోకాపేట, పుప్పాలగూడ ప్రాంతాలు హైరైజ్ టవర్స్ కి నిలయంగా మారాయి. మరి నగరంలో అత్యంత ఎత్తయిన భవనం ఏదో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 24 2026, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఆకాశహర్మ్యాలకు అడ్డాగా హైదరాబాద్
Image Credit : Gemini AI

ఆకాశహర్మ్యాలకు అడ్డాగా హైదరాబాద్

ఒకప్పుడు చార్మినార్, గోల్కొండ కోటల చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్.. ఇప్పుడు సరికొత్త గ్లోబల్ రూపాన్ని సంతరించుకుంది. పాతబస్తీ నవాబుల కాలం నాటి వారసత్వం నుండి, ఐటీ హబ్‌ల ఆధునికతను దాటుకుని, నేడు అంతర్జాతీయ నగరాలైన దుబాయ్, న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాల (Skyscrapers) నగరంగా శరవేగంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఐటీ హబ్ గా మారిన పశ్చిమ హైదరాబాద్ లోని కోకాపేట, పుప్పాలగూడ, గచ్చిబౌలి, నియోపోలిస్ ప్రాంతాలు హైదరాబాద్‌ను నిలువుగా విస్తరింపజేస్తున్నాయి. ఈ ప్రాంతాల గుండా వెళ్తుంటే మేఘాలను తాకుతున్నట్లుగా నిర్మిస్తున్న భారీ భవనాలు చూసేవారిని అబ్బురపరుస్తాయి.

ఇప్పటికే హైదరాబాద్ లో ఎత్తైన భవానాలు అనేకం ఉన్నాయి... 10, 20, 30 అంతస్తుల భవనాలకు లెక్కేలేదు. కానీ వీటన్నింటిని తలదన్నేలా నగరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్ ఐడెంటిటీని మార్చేస్తూ, ఆకాశమే హద్దుగా నిలుస్తున్న టాప్ 10 అత్యంత ఎత్తైన భవనాలు ఏవో, వాటిని ఏ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హైదరాబాద్ లో టాప్ 3 భవనాలివే
Image Credit : Getty

హైదరాబాద్ లో టాప్ 3 భవనాలివే

1. కాండ్యూర్ స్కైలైన్ (Candeur Skyline)

ఇది పుప్పాలగూడలో ఉంది. 243.7 మీటర్లు ఎత్తులో 59 అంతస్తుల్లో కాండ్యూర్ కన్‌స్ట్రక్షన్స్ (Candeur) దీన్ని నిర్మిస్తోంది. మొత్తం 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 282 ప్లాట్స్ తో ఉంటుంది.

2. ఇ-ఇన్ఫ్రా స్కైవెన్ (Skyven)

నియోపాలిస్ ప్రాతంలో 239.9 మీటర్లు ఎత్తులో ఈ భారీ అపార్ట్ మెంట్ నిర్మిస్తున్నారు... మొత్తం 63 అంతస్తులు ఉటుంది. ఇ-ఇన్‌ఫ్రా & పివిఆర్ గ్రూప్ (e-infra & PVR) దీన్ని నిర్మిస్తోంది.

3. ఎస్ఏఎస్ క్రౌన్ (SAS Crown) :

కోకాపేటలో 235.3 మీటర్ల ఎత్తు, 58 అంతస్తుల్లో ఎస్ఏఎస్ ఇన్‌ఫ్రా (SAS Infra) నిర్మిస్తోంది. ఇది కూడా 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 248 వరకు ప్లాట్స్ ఉండే అవకాశాలున్నాయి.

Related Articles

Related image1
Now Playing
Hyderabad Heavy Rains: అమరావతి సంగతి దేవుడెరుగు ముందు హైదరాబాద్ మునిగిపోతుంది | Asianet News Telugu
Related image2
IRCTC Hyderabad to Ooty Tour: హైదరాబాద్ టూ ఊటీ మస్త్ ట్రిప్.. బడ్జెట్ లోనే ఐఆర్‌సీటీసీ క్రేజీ ప్యాకేజీ డీటెయిల్స్ ఇవే
33
హైదరాబాద్ లో అద్భుత భవంతులు
Image Credit : Gemini AI

హైదరాబాద్ లో అద్భుత భవంతులు

4. వన్ బై ఎంఎస్ఎన్ (ONE by MSN)

నియోపాలిస్ లో 220.83 మీటర్లు ఎత్తు 57 అంతస్తులల్లో ఎంఎస్ఎన్ గ్రూప్ (MSN) ఈ వన్ బై ఎంఎస్ఎన్ నిర్మిస్తోంది. ఈ అపార్ట్మెంట్ లో 655 ప్లాట్స్ ఉంటాయి.

5. ది క్యాస్కేడ్స్ నియోపోలిస్ (The Cascades Neopolis)

ఇది కూడా నియోపాలిస్ లో ఉంది... 218 మీటర్ల ఎత్తులో 59 అంతస్తుల్లో ఉంటుంది. GHR, లక్ష్మీ ఆండ్ అర్బన్ సంస్థ నిర్మిస్తోంది. 7 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వెయ్యికి పైగా ప్లాట్స్ తో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యం ఇది.

ఇక నియోపాలిస్ లో మై హోమ్ 99 (My Home 99) 213.4 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బ్రిగేడ్ గేట్‌వే రెసిడెన్సెస్ (Brigade Gateway), మై హోమ్ గ్రావా (My Home Grave), రాజపుష్ప కాసా లగ్జూరా (Rajapushpa Casa Luxura), సుమధుర పలైస్ రాయల్ (Palais Royale) వంటి ఎన్నో ఆకాశాన్ని తాకే భవనాలు హైదరాబాద్ లో నిర్మితమవుతున్నాయి. ఈ భవనాలే హైదరాబాద్ అభివృద్ధికి అద్దం పడుతున్నాయి… జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ నవాబుల నగరానికి గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Health: ఉచితంగా కంటి ప‌రీక్షల శిబిరం.. నెల‌రోజుల పాటు అవ‌కాశం, ఎక్క‌డంటే.?
Recommended image2
పెళ్లి చేసుకోరు కానీ ఒకే రూమ్‌లో క‌లిసి ఉంటారు.. ఫుడ్డు, బెడ్డు అంతా వాళ్ల‌దే. హైద‌రాబాద్‌లో కొత్త క‌ల్చ‌ర్
Recommended image3
KCR Grandson Himanshu : కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో ఏం చదువుకుంటున్నాడో తెలుసా?
Related Stories
Recommended image1
Now Playing
Hyderabad Heavy Rains: అమరావతి సంగతి దేవుడెరుగు ముందు హైదరాబాద్ మునిగిపోతుంది | Asianet News Telugu
Recommended image2
IRCTC Hyderabad to Ooty Tour: హైదరాబాద్ టూ ఊటీ మస్త్ ట్రిప్.. బడ్జెట్ లోనే ఐఆర్‌సీటీసీ క్రేజీ ప్యాకేజీ డీటెయిల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved