MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Rain Alert : ఆ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు... 33 జిల్లాలకు బిగ్ వార్నింగ్

Rain Alert : ఆ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు... 33 జిల్లాలకు బిగ్ వార్నింగ్

ఇవాళ (ఏప్రిల్ 26, ఆదివారం) ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఎండల తీవ్రత ఎలా ఉంటుంది..? ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి..? రాాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది..? ఇలాంటి పూర్తి సమాచాారం ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 26 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో ఎండావాన వెదర్...
Image Credit : X/metcentrehyd

తెలుగు రాష్ట్రాల్లో ఎండావాన వెదర్...

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి... ఓ వైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఆసక్తికమైన విషయం ఏంటంటే రానురాను ఎండలతో పాటు వర్షాలు కూడా పెరిగే అవకాశాలున్నాయట. 

ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్) హయ్యెస్ట్ టెంపరేచర్స్ 45 డిగ్రీలకు చేరుకున్నాయి... రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో వానలు కూడా కొనసాగుతాయని... నెల చివర్లో మరింత ఊపందుకుంటాయని ప్రకటించింది. ఇలా ఎండావానలు తెలుగు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే ఛాన్సెస్ ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణ వర్షాలు..
Image Credit : Gemini AI

తెలంగాణ వర్షాలు..

తెలంగాణలో ఇవాళ (ఏప్రిల్ 26, ఆదివారం) అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయిని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం యధావిధిగా ఎండలు కొనసాగుతాయని... సాయంత్రం వర్షాలు మొదలవుతాయని ప్రకటించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ వర్షాలకు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు తోడవుతాయని... దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Related Articles

Related image1
IMD Weather Update : సూరీడితో వరుణుడి పోటీ.. మధ్యలో తెలుగు ప్రజలకు ఈ అవస్థలేంటి..?
Related image2
IMD Rain Alert : ఈ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వానలు... ఆరెంజ్ అలర్ట్.. అంటే అల్లకల్లోలమేనా..!
35
ఈ రెండ్రోజులు తెలంగాణవ్యాప్తంగా వానలు...
Image Credit : Getty

ఈ రెండ్రోజులు తెలంగాణవ్యాప్తంగా వానలు...

రెండుమూడు రోజులు ఎండలు మండిపోతాయని... కొన్నిచోట్ల అత్యధికంగా 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటాయట. అయితే ఏప్రిల్ 28, 29 రెండ్రోజులు తెలంగాణవ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ప్రారంభమయ్యే వానలు రాష్ట్రం మొత్తానికి వ్యాపిస్తాయని... దీంతో వాతావరణం చల్లబడుతుందని వెదర్ మ్యాన్ వెల్లడించారు.

45
తెలంగాణలో మండిపోతున్న ఎండలు
Image Credit : Asianet News

తెలంగాణలో మండిపోతున్న ఎండలు

ఇక నిన్న (ఏప్రిల్ 25న) అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ 42.8 డిగ్రీలు నమోదయ్యాయి... అత్యల్పంగా హైదరాబాద్ శివారు పటాన్ చెరులో 21.4 డిగ్రీలు నమోదయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 26, ఆదివారం) కూడా అత్యధిక జిల్లాల్లో 41 నుండి 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట... ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

55
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం..
Image Credit : ANI

ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం..

ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే... ఇవాళ (ఏప్రిల్ 26) రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. నేడు 23 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయంటోంది... అవి విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర... పార్వతీపురంమన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం... అల్లూరి జిల్లాలోని జికే వీధి... పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాలు. ఈ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని APSDMA సూచించింది.

నిన్న (శనివారం) కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 44.8°C, కడపలో44.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 18 జిల్లాల్లోని 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవాళ కూడా ఇదేస్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని... కొన్నిచోట్ల తారాస్థాయికి చేరే అవకాశాలున్నాయని APSDMA హెచ్చరిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
Now Playing
CM Revanth Reddy Interview: ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu
Recommended image3
Rain Alert: వేగంగా విస్త‌రిస్తున్న రుతుప‌వ‌నాలు..ఈ ప్రాంతాల్లో వ‌చ్చే 2 రోజులు వ‌ర్షాలు
Related Stories
Recommended image1
IMD Weather Update : సూరీడితో వరుణుడి పోటీ.. మధ్యలో తెలుగు ప్రజలకు ఈ అవస్థలేంటి..?
Recommended image2
IMD Rain Alert : ఈ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వానలు... ఆరెంజ్ అలర్ట్.. అంటే అల్లకల్లోలమేనా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved