MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IMD Rain Alert : ఈ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వానలు... ఆరెంజ్ అలర్ట్.. అంటే అల్లకల్లోలమేనా..!

IMD Rain Alert : ఈ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వానలు... ఆరెంజ్ అలర్ట్.. అంటే అల్లకల్లోలమేనా..!

తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి… మరోవైపు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (ఏప్రిల్ 21న) అయితే అల్లకల్లోలం తప్పేలా లేదు.. అందుకే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.  

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 21 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు...
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు...

IMD Rain Alert : తెలుగు ప్రజలారా... ఈ నాలుగైదు రోజులు తస్మాత్ జాగ్రత్త. ఓవైపు మండుటెండలు... మరోవైపు ఈదురుగాలులు, వడగళ్ల వానలు... ఇలా వాతావరణం అల్లకల్లోలం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వాతావరణ శాఖల ప్రకారం... తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు (ఏప్రిల్ 21, మంగళవారం) వెదర్ ఎలా ఉంటుందో చూద్దాం.

25
తెలంగాణలో వర్షాలు..
Image Credit : X/APSDMA

తెలంగాణలో వర్షాలు..

ముందుగా తెలంగాణ విషయానికి వస్తే... ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎండావాన పరిస్థితులు ఉన్నాయి. మరికొన్నిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యాహ్నమంతా ఎండలు ఇరగదీస్తాయి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి... ఇక సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది... మేఘాలు కమ్మేసి చల్లగా మారుతుంది, వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

Related Articles

Related image1
IMD Rain Alert : ఒకేసారి 5 అల్పపీడనాల అటాక్.. ఈ ప్రాంతాల్లో తుపానులు, భారీ వర్షాలతో అల్లకల్లోలమే..!
Related image2
IMD Rain Alert : తెలంగాణలో అత్యధిక వర్షం కురిసిన టాప్ 10 ప్రాంతాలివే.. ఈ జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ యాక్టివ్
35
నేడు హైదరాబాద్ వాతావరణం...
Image Credit : Getty

నేడు హైదరాబాద్ వాతావరణం...

హైదరాబాద్ లో ఇవాళ ఉదయం నుండే వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటోంది వాతావరణ శాఖ. కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, ఆల్వాల్, కుత్బుల్లాపూర్, కాప్రా, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయట. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయంటోంది. ఇలా వర్షాలతో ఉదయం చల్లగా ఉన్నా మధ్యాహ్నానికి ఎండలు ముదురుతాయని తెలిపింది. అత్యధికంగా 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

సాయంత్రానికి మళ్లీ హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని... రాత్రి సమయంలో ఈదురుగాలులతో (గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇలా ఉదయం, సాయంత్రం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Light rain or thundershowers very likely to occur at Contonment, Malkajgiri,Alwal, Qutbullapur,Kapra, Secundrabad, OU , UPPAL , LB NAGAR ,Serilingampally and surrounding areas in GHMC during next couple of hours. pic.twitter.com/gumTK5d7Ye

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) April 21, 2026

45
ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్..
Image Credit : X

ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్..

హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి... అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వానలు కురిసే అవకాశాలున్నాయట... ఈదురుగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ వాతావరణ శాఖ.

Rainfall Intensity forecast of Telangana for the next 5 days dated 20.04.2026 pic.twitter.com/aHsIQ3EirL

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) April 20, 2026

55
ఆంధ్ర ప్రదేశ్ లో ఎండావాన..
Image Credit : Gemini

ఆంధ్ర ప్రదేశ్ లో ఎండావాన..

ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండావాన పరిస్థితులు ఉంటాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ (ఏప్రిల్ 21) కొన్నిచోట్ల ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 46మండలాల్లో తీవ్ర, 29 మండలాల్లో వడగాలులు వీస్తాయని... 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌హిళ‌ల‌కు, పురుషుల‌కు అంద‌రికీ ఉచిత రైలు ప్ర‌యాణం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం
Recommended image2
Now Playing
ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పవర్ ఫుల్ స్పీచ్ | KCR Powerful Speech at Praja Ashirvada Sabha
Recommended image3
KCR: నా కొడకా.. నా చావు కోరుకుంటావా? వెయ్యి జన్మలెత్తినా నన్ను ఏమీ చేయలేరు ! కేసీఆర్ మాస్ కౌంటర్
Related Stories
Recommended image1
IMD Rain Alert : ఒకేసారి 5 అల్పపీడనాల అటాక్.. ఈ ప్రాంతాల్లో తుపానులు, భారీ వర్షాలతో అల్లకల్లోలమే..!
Recommended image2
IMD Rain Alert : తెలంగాణలో అత్యధిక వర్షం కురిసిన టాప్ 10 ప్రాంతాలివే.. ఈ జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ యాక్టివ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved