MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Telangana
  • Weather Report: ఇంకా రెండో రోజులే.. ఏప్రిల్ 10 త‌ర్వాత చుక్క‌లు ఖాయం. హెచ్చ‌రిస్తోన్న వాతావార‌ణ శాఖ

Weather Report: ఇంకా రెండో రోజులే.. ఏప్రిల్ 10 త‌ర్వాత చుక్క‌లు ఖాయం. హెచ్చ‌రిస్తోన్న వాతావార‌ణ శాఖ

Weather Report: తెలంగాణలో విచిత్ర వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఓవైపు ఎండలు తీవ్రంగా ఉండగా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ మారుతున్న పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా ప్రకటన విడుదల చేసింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 08 2026, 06:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెండు రోజుల పాటు వర్షాల సూచన
Image Credit : Gemini AI

రెండు రోజుల పాటు వర్షాల సూచన

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తెలంగాణలో వ‌చ్చే రెండు రోజులు ప‌లు చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎండ‌ల నుంచి ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించవచ్చని భావిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
Image Credit : X

పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు

వాతావరణ శాఖ వివరాల ప్రకారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో మంగళవారం నుంచి వర్షాలు కురిసే అవకాశముందని అంచనా. కొన్ని ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని అధికారులు తెలిపారు.

Related Articles

Related image1
Motivational story: ప‌క్క‌వారితో పోల్చుకుంటున్నారా.? పులిని చూసి న‌క్క వాత పెట్టుకున్న‌ట్లే అవుతుంది
Related image2
రూ. 1.3 ల‌క్ష‌ల కోట్ల‌తో నిర్మాణం, ఈనెల 28న శంకుస్థాప‌న‌.. ఏపీలో ఈ ప్రాంతం మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం
35
ఈదురు గాలులు, వడగళ్ల వానకు అవకాశం
Image Credit : Gemini AI

ఈదురు గాలులు, వడగళ్ల వానకు అవకాశం

కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సమయంలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో పాటు కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే ప్రమాదం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

45
వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : X

వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉరుములు, మెరుపులు కనిపించినప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. రైతులు పొలాల్లో పని చేస్తున్నప్పుడు పిడుగుల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే భారీ గాలుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.

55
ఏప్రిల్ 10 తర్వాత ఎండలు పెరుగుతాయి
Image Credit : Getty

ఏప్రిల్ 10 తర్వాత ఎండలు పెరుగుతాయి

రెండు రోజుల వర్షాల తరువాత రాష్ట్రంలో మళ్లీ ఎండలు పెరిగే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 10 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. అందువల్ల వృద్ధులు, చిన్నారులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు. ముఖ్యంగా మ‌ధ్యాహ్నం ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వారు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెబుతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ... తెలుగు రాష్ట్రాలపై స్ట్రాంగ్ ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే
Recommended image2
80s AI: ట్రెండ్ ఫాలో అవుతోన్న సీఎం సాబ్‌.. రేవంత్ రెడ్డి రెట్రో లుక్ చూశారా.?
Recommended image3
School Holidays : ఈ శని, ఆది, సోమవారం సెలవులు కన్ఫర్మ్... వచ్చే గురువారం మరో హాలిడే రెడీ
Related Stories
Recommended image1
Motivational story: ప‌క్క‌వారితో పోల్చుకుంటున్నారా.? పులిని చూసి న‌క్క వాత పెట్టుకున్న‌ట్లే అవుతుంది
Recommended image2
రూ. 1.3 ల‌క్ష‌ల కోట్ల‌తో నిర్మాణం, ఈనెల 28న శంకుస్థాప‌న‌.. ఏపీలో ఈ ప్రాంతం మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved