Weather: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజులు వర్షాలు.. మరోవైపు పెరుగుతున్న ఎండలు !
Weather Report : తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ వారంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతవారణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది.

Weather update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే అకాల వర్షాలు దంచికొట్టాయి. మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. అయితే, మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వానలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
UP Rain Alert
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 10 జిల్లాల్లో వర్షం కురుస్తుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర నుండి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందనీ, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
సోమవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, ఉరుములు మెరుపులతో వర్షాలు కురవడంతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
UP Rain Alert
ఏప్రిల్ 8న సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జయశంకర్ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో వానలు పడతాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీస్తాయని పేర్కొంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ కు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో కొనసాగుతోంది. దీని కారణంగా ఆంధ్ర ప్రదేశ్ మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. సోమ, మంగళ వారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఒకవైపు వర్షాలు పడుతుంటే మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రానున్న మూడు నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతారణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఈ వారంలో 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
ఈ వారం ప్రారంభంలో కురిసిన భారీ వర్షాల తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (TSDPS) విడుదల చేసిన డేటా ప్రకారం, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఏడు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C మార్కును దాటాయి.