- Home
- Telangana
- Viral Photo: ఈ జన్మలో ఇలాంటి బోర్డు చూస్తామనుకోలేదు భయ్యా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో
Viral Photo: ఈ జన్మలో ఇలాంటి బోర్డు చూస్తామనుకోలేదు భయ్యా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో
Viral Photo: ఓ బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా మహిళలకు కేటాయించిన సీట్ల వద్ద కనిపించే సందేశానికి భిన్నంగా, "పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం" అన్న ఫొటో వైరల్ అవుతోంది.

అసలు బోర్డును మార్చేశారా.?
ఈ ఫొటో సూర్యాపేట రూట్‌లో నడిచే బస్సులో తీసిందంటూ పలువురు షేర్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రిజర్వ్ చేసిన సీట్ల వద్ద సాధారణంగా "స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం" అనే బోర్డులు ఉంటాయి. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న చిత్రంలో అదే సందేశాన్ని మార్చి "పురుషులను" అనే పదాన్ని చేర్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఇది నిజంగా బస్సులో ఏర్పాటు చేసిన బోర్డేనా? లేక గ్రాఫిక్స్ లేదా కృత్రిమ మేథస్సు (AI) సహాయంతో రూపొందించిన మార్ఫింగ్ చిత్రమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెటిజన్లలో భిన్న స్పందనలు
ఈ ఫొటో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. "ఇన్నాళ్లకు పురుషులకు కూడా గౌరవం దక్కింది", "ఇక బస్సులో మాకూ సీటు దొరుకుతుందేమో", "ఈ బోర్డు నిజమైతే బాగుండేది" అంటూ కొందరు, ఈ జన్మలో ఇలాంటి బోర్డు చూస్తామనుకోలేదు భయ్యా అంటూ మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. మరోవైపు ఇది కేవలం ఎడిట్ చేసిన చిత్రం మాత్రమేనని, దీనిని నిజమని నమ్మవద్దని మరికొందరు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ ఫొటోపై చర్చ మరింత పెరిగింది.
అధికారిక ప్రకటన మాత్రం లేదు
ఇప్పటి వరకు ఈ వైరల్ చిత్రంపై తెలంగాణ ఆర్టీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ ఫొటో ప్రామాణికతపై స్పష్టత ఇంకా రాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి ఫొటో నిజమనే భావనతో షేర్ చేయకుండా, అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాలని పలువురు సూచిస్తున్నారు.
మార్ఫింగ్ ఫొటోలతో జాగ్రత్త సుమా.!
ప్రభుత్వ శాఖలు, సంస్థలకు సంబంధించిన బోర్డులు, సూచనలు లేదా అధికారిక సమాచారాన్ని డిజిటల్‌గా మార్చి తప్పుడు రూపంలో ప్రచారం చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. ఇలాంటి మార్ఫింగ్ చిత్రాలను సృష్టించడం లేదా అవి నిజమని భావించి సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకోవడం వల్ల కూడా చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల వైరల్ అవుతున్న ఫొటోలు లేదా పోస్టులను షేర్ చేసే ముందు వాటి నిజానిజాలు నిర్ధారించుకోవడం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

