MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Viral News: అస‌లేంటీ కోవా బ‌న్ వివాదం.? ఎందుకు ఇంత‌లా వైర‌ల్ అవుతోంది

Viral News: అస‌లేంటీ కోవా బ‌న్ వివాదం.? ఎందుకు ఇంత‌లా వైర‌ల్ అవుతోంది

Viral News: ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో కోవా బ‌న్ వివాదం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మేడారం జాత‌ర‌లో కోవా బ‌న్ విక్ర‌యిస్తున్న ఓ సాధార‌ణ వ్యాపారి చుట్టూ తిరిగిన సంఘటన స‌మాజానికి ఎన్నో ప్ర‌శ్న‌లను సంధిస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 13 2026, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అస‌లేంటీ కోవా బ‌న్ వివాదం
Image Credit : ՏHᗅDᝪᗯ SalEeM/YT

అస‌లేంటీ కోవా బ‌న్ వివాదం

ఆంధ్రప్రదేశ్‌లోని క‌ర్నూలుకు చెందిన ఓ చిరు వ్యాపారి మేడారం జాతరలో కేవలం పది రూపాయలకే కోవా బన్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు తీర్చుకోవడం అతని లక్ష్యం. పెద్ద మూలధనం లేదు, పెద్ద వ్యాపారం లేదు. ఒక చిన్న స్టాల్, కొంత సరుకు ఇదే ఆయ‌న ప‌ని.

24
యూట్యూబ్‌లో వీడియో
Image Credit : ՏHᗅDᝪᗯ SalEeM/YT

యూట్యూబ్‌లో వీడియో

ఒక యూట్యూబ్ చానెల్ నిర్వాహకుడు ఆ వ్యాపారి వద్దకు వెళ్లి కోవా బన్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశాడు. తక్కువ ధరకు అమ్ముతున్నావంటే ఏదో కల్తీ చేసివుంటావన్న ఆరోపణలతో ప్రశ్నలు సంధించాడు. ఆధార్ కార్డు చూపించాలని ఒత్తిడి చేయడం, గుంపుగా నిలబడి ప్రశ్నించడం వంటి చర్యలు వ్యాపారిని భయబ్రాంతులకు గురి చేశాయి. ఆ చిన్న వ్యాపారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జరిగిన ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related Articles

Related image1
RGV: పిచ్చోడు అనుకుంటాం కానీ మాములోడు కాదు భ‌య్యో.. వ‌ర్మ కొటేష‌న్స్ చ‌దివితే మైండ్ బ్లాంకే
Related image2
Real estate: ఏపీలోని ఈ ప్రాంతం మ‌రో సైబ‌ర్ సిటీ కావ‌డం ఖాయం.. ఇవే సాక్ష్యాలు
34
ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు
Image Credit : ՏHᗅDᝪᗯ SalEeM/YT

ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు

వీడియో బయటకు వచ్చిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా స్పందించారు. పెద్ద పెద్ద బ్రాండ్లు డిస్కౌంట్లు ఇస్తే ప్రశ్నించని వారు, ఒక సామాన్యుడు తక్కువ ధరకే అమ్మితే ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తారని ప్ర‌శ్నిస్తున్నారు. ఆహార నాణ్యతపై సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి. దేశంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నప్పుడు, వీధుల్లో విచారణ పేరుతో ఒక పేదవ్యాపారిని అవమానించడం సరైన పద్ధతి కాదని పలువురు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వేలాది మంది ఆ వ్యాపారికి మద్ధతు తెలిపారు.

44
ఆర్థిక సహాయం, నైతిక బలం
Image Credit : ՏHᗅDᝪᗯ SalEeM/YT

ఆర్థిక సహాయం, నైతిక బలం

సంఘటన తర్వాత అనేక మంది ముందుకు వచ్చి ఆ వ్యాపారికి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. కొంత‌మంది సోష‌ల్ మీడియాలో మ‌ద్ధ‌తు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అదే విధంగా ఆయ‌న‌కు అండ‌గా ఉంటూ ఫోన్ పే నెంబ‌ర్ ఇస్తూ ఆర్థికంగా సాయం చేయాల‌ని పిలుపునిస్తున్నారు. మొత్తం మీద ఈ సంఘ‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో వైర‌ల్‌గా మారింది. ఇక ఆ చిరు వ్యాపారి సొంతూరులో కూడా ఆయనకు మద్ధతు లభిస్తోంది. గ్రామంలోని ప్రజలు అండగా నిలుస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana: తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్న‌ల్‌.? జ‌న‌సేన తొలి విజ‌యం
Recommended image2
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కవిత మ్యాజిక్ .. ఎక్కడెక్కడ, ఎన్నెన్ని వార్డులు గెలిచారో తెలుసా?
Recommended image3
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పలితాలు .. ఈ నాలుగు చోట్ల హంగ్
Related Stories
Recommended image1
RGV: పిచ్చోడు అనుకుంటాం కానీ మాములోడు కాదు భ‌య్యో.. వ‌ర్మ కొటేష‌న్స్ చ‌దివితే మైండ్ బ్లాంకే
Recommended image2
Real estate: ఏపీలోని ఈ ప్రాంతం మ‌రో సైబ‌ర్ సిటీ కావ‌డం ఖాయం.. ఇవే సాక్ష్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved