MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాదీలకు సరికొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌.. ఫుడ్ ల‌వ‌ర్స్ కోసం రూఫ్‌టాప్ రెస్టో బార్‌. ఎక్క‌డంటే.?

హైదరాబాదీలకు సరికొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌.. ఫుడ్ ల‌వ‌ర్స్ కోసం రూఫ్‌టాప్ రెస్టో బార్‌. ఎక్క‌డంటే.?

Hyderabad: హైదరాబాద్‌లో ఫుడ్ లవర్స్‌కు మరో కొత్త డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మారియట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో 'వాయు (Vayu)' పేరుతో కొత్త రూఫ్‌టాప్ రెస్టో-బార్‌ను ప్రారంభించారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 02 2026, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
'వాయు' పేరులోని ప్రత్యేకత ఏంటి?
Image Credit : destinywithfood/Instagram

'వాయు' పేరులోని ప్రత్యేకత ఏంటి?

'వాయు' అనే పేరు "గాలి" అనే అర్థాన్ని సూచిస్తుంది. భారతదేశంలోని తీర ప్రాంతాలు, కొండలు, మైదానాలు, ఎడారుల మీదుగా ప్రయాణిస్తూ అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, రుచులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయాణికుడిగా గాలిని భావించి ఈ కాన్సెప్ట్‌ను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఉన్న వైవిధ్యమైన వంటకాల అనుభూతిని ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ఈ పేరును ఎంపిక చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆకట్టుకునే రూఫ్‌టాప్ డిజైన్.. సందర్శకులకు ప్రత్యేక అనుభూతి
Image Credit : destinywithfood/Instagram

ఆకట్టుకునే రూఫ్‌టాప్ డిజైన్.. సందర్శకులకు ప్రత్యేక అనుభూతి

నగరాన్ని ఎత్తు నుంచి వీక్షించేలా ఓపెన్-ఎయిర్ రూఫ్‌టాప్‌గా 'వాయు'ను తీర్చిదిద్దారు. ఆధునిక శైలిలో రూపొందించిన ఇంటీరియర్, ఆహ్లాదకరమైన లైటింగ్, చిన్న గ్రూపుల కోసం ప్రత్యేక సీటింగ్‌తో పాటు పెద్ద గ్రూపులు కలిసి కూర్చునే ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేక బార్ సెక్షన్ కూడా ఇందులో ఉంది. ఆఫీస్‌ ముగిసిన తర్వాత రిలాక్స్ కావాలనుకునే వారు, వీకెండ్ వేడుకలు జరుపుకునే కుటుంబాలు, స్నేహితుల సమావేశాలకు ఇది అనువైన ప్రదేశంగా రూపొందించారు.

Related Articles

Related image1
AIతో మోటు-పత్లు వైరల్ వీడియోలు ఎలా తయారు చేయాలి..? స్టెప్ బై స్టెప్ పూర్తి వివ‌రాలు
Related image2
Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న స‌న్న‌బియ్యం పాట‌.. నెల రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్
34
మెనూలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వంటకాలు
Image Credit : destinywithfood/Instagram

మెనూలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వంటకాలు

వాయు మెనూలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రసిద్ధ వంటకాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా శ్రింప్ పికిల్ విత్ మసాలా బ్రియోష్, చికెన్ వింగ్స్ వెపుడు, స్టీమ్డ్ కలింపాంగ్ మొమోస్, జీడిపప్పు పకోడీ వంటి స్టార్టర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రధాన వంటకాలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోంగూర చికెన్‌, కర్ణాటకలోని కుండాపూర్ ఘీ రోస్ట్, కేరళ మీన్ పొల్లిచట్టు, కొల్హాపురి మటన్ సుక్కా, ఓల్డ్ ఢిల్లీ బటర్ చికెన్ వంటి ప్రసిద్ధ రుచులను అందిస్తున్నారు. దీంతో ఒకే చోట దేశంలోని పలు ప్రాంతాల ప్రత్యేక వంటకాలను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Garima & Mahima Nahata (@destinywithfood)

44
ప్రత్యేక కాక్‌టెయిల్స్‌తో కొత్త అనుభవం
Image Credit : destinywithfood/Instagram

ప్రత్యేక కాక్‌టెయిల్స్‌తో కొత్త అనుభవం

ఆహారంతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన కాక్‌టెయిల్ మెనూ కూడా వాయు ప్రత్యేకతగా నిలుస్తోంది. 'ది పేపర్ ప్లేన్ లాగ్‌బుక్' పేరుతో రూపొందించిన ఈ కాక్‌టెయిల్ కాన్సెప్ట్‌లో భారతదేశంలోని వివిధ ప్రాంతాల రుచులను ప్రతిబింబించే పదార్థాలను ఉపయోగిస్తున్నారు. క్రిమ్సన్ విండ్, కోకమ్ క్లౌడ్, ఫైర్‌స్టార్మ్ ఎంబర్ వంటి ప్రత్యేక కాక్‌టెయిల్స్‌లో గోంగూర, కోకమ్, ప్యాషన్ ఫ్రూట్, అల్లం, ఫెర్మెంటెడ్ మిరపకాయ వంటి ప్రాంతీయ పదార్థాలను వినియోగించి వినూత్న రుచులను అందిస్తున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ మారియట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్, కోర్ట్‌యార్డ్ బై మారియట్ హైదరాబాద్ మల్టీ ప్రాపర్టీ జనరల్ మేనేజర్ అమర్‌దీప్ సింగ్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగర ఉత్సాహాన్ని ప్రతిబింబించే సామాజిక ప్లాట్ ఫామ్ గా 'వాయు'ను రూపొందించామని తెలిపారు. భారతీయ ప్రాంతీయ రుచులు, వినూత్న కాక్‌టెయిల్స్, ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శకులకు మరపురాని అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
ఆహారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి CM రేవంత్ రెడ్డి బోనాలు | Secunderabad Ujjaini Mahankali Bonalu 2026
Recommended image2
Now Playing
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026
Recommended image3
Weather Update: రాబోయే 3 రోజులు వానలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక
Related Stories
Recommended image1
AIతో మోటు-పత్లు వైరల్ వీడియోలు ఎలా తయారు చేయాలి..? స్టెప్ బై స్టెప్ పూర్తి వివ‌రాలు
Recommended image2
Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తున్న స‌న్న‌బియ్యం పాట‌.. నెల రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved