MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • అయ్యో పాపం.. హైదరాబాద్ యాక్సిడెంట్ లో మృతిచెందిన ముగ్గురూ ఒకేకుటుంబం, ఒక్కగానొక్క కొడుకులే

అయ్యో పాపం.. హైదరాబాద్ యాక్సిడెంట్ లో మృతిచెందిన ముగ్గురూ ఒకేకుటుంబం, ఒక్కగానొక్క కొడుకులే

తెలంగాణలో బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ శివారుుప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు యువకులు ఒకే కుటుంబానికి చెందినవారు… ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకులే.  

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 21 2025, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
Image Credit : our own

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

Hyderabad Accident : వేసవికాలంలో మధ్యాహ్నం ఎండలు మండిపోతాయి కాబట్టి చాలామంది రాత్రుళ్లు ప్రయాణం చేస్తుంటారు. ఇదే ఇప్పుడు ప్రమాదాలకు దారితీస్తోంది. రాత్రుళ్లు రోడ్లపైకి లారీలు, డిసిఎం, ట్రావెల్ బస్సులు వంటి పెద్ద వాహనాలు ఎక్కువగా వస్తుంటాయి.. ఇదే సమయంలో ఇతర వాహనాలు కూడా రోడ్డెక్కడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా తాజాగా హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నుజ్జునుజ్జయిన కారు
Image Credit : our own

నుజ్జునుజ్జయిన కారు

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరుకు చెందిన యువకులు ఓ శుభకార్యానికి కారులో వెళ్లారు. పెద్ద అంబర్ పేటలో వేడుకకు హాజరై రాత్రి నారపల్లిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బస చేసారు. ఉదయం తమ నివాసానికి వెళుతుండగా ఘోరం జరిగింది... మరికొద్దిసేపట్లో ఇంటికి చేరతారనగా రోడ్డు ప్రమాదం జరిగింది. వీరు వెళుతున్న కారు వేగంగా దూసుకువస్తున్న డిసిఎంకు ఎదురెళ్లి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయి అందులోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు... మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.

35
హైదరాబాద్ రోడ్డు ప్రమాద మృతుల వివరాలు
Image Credit : unsplash

హైదరాబాద్ రోడ్డు ప్రమాద మృతుల వివరాలు

ఈ ప్రమాదంలో పిన్నింగటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రినాథ్ రెడ్డి (24), చుంచు వర్షిత్ రెడ్డి (23) ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే హయత్ నగర్ లోని సన్ రైజ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు... అతడి పరిస్ధితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది.

45
అతివేగమే ప్రమాదానికి కారణమా?
Image Credit : our own

అతివేగమే ప్రమాదానికి కారణమా?

 ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

55
తల్లిదండ్రులకు కడుపుకోత
Image Credit : Asianet News

తల్లిదండ్రులకు కడుపుకోత

ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకులంతా చదువుకునేవారు.. ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకులే. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకులు ఇలా కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కడుపుశోకానికి గురయిన ఆ పేరెంట్స్ వేదన చూసేవారికి కన్నీరు తెప్పిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
తెలంగాణ
నేరాలు, మోసాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సోను నిగమ్
Recommended image2
రోడ్డు ప్రమాద బాధితులకు ఊరట: దేశవ్యాప్తంగా క్యాష్‌లెస్ చికిత్స ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved