MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Inspirational Story: రూ. 2.9 కోట్ల యూఎస్ జాబ్ వద్దనుకుని కిరాణా దుకాణం.. ఐఐటీ బాంబే గోల్డ్ మెడలిస్ట్ వైరల్ స్టోరీ !

Inspirational Story: రూ. 2.9 కోట్ల యూఎస్ జాబ్ వద్దనుకుని కిరాణా దుకాణం.. ఐఐటీ బాంబే గోల్డ్ మెడలిస్ట్ వైరల్ స్టోరీ !

Inspirational Story: రూ. 2.9 కోట్ల అమెరికా ఉద్యోగాన్ని కాదనుకుని, కాన్పూర్‌లో కిరాణా షాప్ పెట్టుకున్నాడు ఓ ఐఐటీ బాంబే గోల్డ్ మెడలిస్ట్. అతనే వివేక్ శర్మ. తను తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 07 2026, 08:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ. 2.9 కోట్ల అమెరికా జాబ్ రిజెక్ట్ చేశాడు.. సక్సెస్ అంటే ఇదేనా?
Image Credit : Asianet News

రూ. 2.9 కోట్ల అమెరికా జాబ్ రిజెక్ట్ చేశాడు.. సక్సెస్ అంటే ఇదేనా?

ప్రతి సంవత్సరం వేలాది మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఐఐటీలో సీటు సాధించాలని, విదేశాల్లో కోట్ల రూపాయల ప్యాకేజీతో సెటిల్ అవ్వాలని కలలు కంటారు. చాలా మందికి ఇదే అసలైన సక్సెస్. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక రియల్ స్టోరీ లైఫ్ అంటే కేవలం బోర్డ్‌రూమ్స్, డాలర్లు మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువే అని నిరూపిస్తోంది.

ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్ వివేక్ శర్మ కథే దీనికి నిదర్శనం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఇచ్చిన 240,000 డాలర్ల (సుమారు రూ. 2.9 కోట్లు) వార్షిక ప్యాకేజీ ఆఫర్‌ను అతను సున్నితంగా తిరస్కరించాడు. దీనికి కారణం మరేదో పెద్ద ఉద్యోగం కాదు, కేవలం తన తల్లిదండ్రులు మాత్రమే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
త్యాగాలతోనే ఐఐటీ కల నిజం
Image Credit : Asianet News

త్యాగాలతోనే ఐఐటీ కల నిజం

కాన్పూర్‌కు చెందిన ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో వివేక్ జర్నీ మొదలైంది. తండ్రి రైల్వే క్లర్క్‌గా పని చేసేవారు, తల్లి ట్యూషన్లు చెబుతూ ఇంటి ఖర్చులకు సాయపడేది. కొడుకు చదువు కోసం ఆ తల్లిదండ్రులు తమ సర్వస్వాన్ని ధారపోశారు. వివేక్‌ను కోటాలో కోచింగ్‌కు పంపడం కోసం ఉన్న పొదుపు మొత్తాన్ని ఖర్చు చేశారు, నగలు కూడా అమ్మేశారు.

మొత్తానికి వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. వివేక్ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేయడమే కాకుండా గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. ఇక ఫైనల్ ఇయర్‌లో ఉండగానే శాన్ ఫ్రాన్సిస్కో స్టార్టప్ నుండి వీసా స్పాన్సర్‌షిప్, రీలోకేషన్ బెనిఫిట్స్‌తో కూడిన భారీ ఆఫర్ అతడిని వరించింది. కానీ, అంతలోనే సీన్ రివర్స్ అయింది.

35
అమెరికా వీసా క్యాన్సిల్.. ఎందుకంటే?
Image Credit : Asianet News

అమెరికా వీసా క్యాన్సిల్.. ఎందుకంటే?

వివేక్ అమెరికాకు బయలుదేరడానికి కొద్ది రోజుల ముందే అతని తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అదే సమయంలో వాళ్ల అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. ఒక్కసారిగా ఆ కుటుంబంలో గ్లోబల్ కెరీర్ సంతోషం మాయమై, హాస్పిటల్స్, సర్జరీలు, కెమోథెరపీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు చేతికి వచ్చిన కోట్ల రూపాయల ఉద్యోగం, మరోవైపు ప్రాణ సమానమైన తల్లిదండ్రులు. కాలేజీ ప్లేస్‌మెంట్స్ నేర్పించని ఒక కఠినమైన పరీక్షను లైఫ్ అతనికి పెట్టింది.

వివేక్ ఏమాత్రం ఆలోచించకుండా ఇండియాలోనే ఉండిపోవాలని డిసైడ్ అయ్యాడు. తన వీసా ఇంటర్వ్యూను క్యాన్సిల్ చేసుకుని, ఆ భారీ ఆఫర్‌ను తిరస్కరించాడు. ఈ నిర్ణయం చూసి చాలా మంది విమర్శించారు, ఎమోషనల్ అయి లైఫ్ పాడు చేసుకుంటున్నావు అన్నారు. కానీ, వివేక్‌కు మాత్రం కంపెనీ కంటే పేరెంట్స్ ముఖ్యం అనిపించింది.

45
వివేక్ శర్మ జనరల్ స్టోర్ టూ కోడింగ్ క్లాసెస్
Image Credit : our own

వివేక్ శర్మ జనరల్ స్టోర్ టూ కోడింగ్ క్లాసెస్

ఇండియాలో ఉండిపోయిన వివేక్, మొదట్లో కాన్పూర్‌లో ఒక లోకల్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాడు. అయితే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరగడంతో, తన ఇంటి కిందనే శర్మ జనరల్ స్టోర్ పేరుతో ఒక చిన్న కిరాణా దుకాణాన్ని స్టార్ట్ చేశాడు. ఐఐటీ బాంబే గోల్డ్ మెడలిస్ట్ కిరాణా కొట్టు నడపడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోయారు.

కానీ ఆ కష్టకాలంలో ఆ స్టోరే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచింది. మెల్లగా వాళ్ల అమ్మ హెల్త్ ఇంప్రూవ్ అయింది, తండ్రి ఆరోగ్యం కూడా కుదుటపడింది. కిరాణా షాప్ చూసుకుంటూనే, వివేక్ పేద పిల్లలకు కోడింగ్ నేర్పించడం మొదలుపెట్టాడు. రాత్రి వేళల్లో ఫ్రీలాన్స్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ చేసేవాడు.

55
తిరిగి వెతుక్కుంటూ వచ్చిన కంపెనీ
Image Credit : Asianet News

తిరిగి వెతుక్కుంటూ వచ్చిన కంపెనీ

కొన్నేళ్ల తర్వాత, వివేక్ స్టోరీ అతను గతంలో రిజెక్ట్ చేసిన అదే ఇంటర్నేషనల్ కంపెనీకి తెలిసింది. ఈసారి ఆ కంపెనీ అతడిని అమెరికా రమ్మనకుండా, కాన్పూర్ నుంచే రిమోట్ పద్ధతిలో ఒక ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం పని చేయాలని కోరింది. అలా వివేక్ తన ఊరు వదలకుండానే టెక్నాలజీ, టీచింగ్, ఫ్యామిలీ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సక్సెస్ అంటే కేవలం జీతాలు, హోదాలు, ఫారిన్ లైఫ్ మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఫ్యామిలీ పక్కన నిలబడటమే నిజమైన విజయం అని వివేక్ నిరూపించాడు. "మా పేరెంట్సే నా బిగ్గెస్ట్ కంపెనీ" అంటూ అతను చెప్పిన మాటలు ఇప్పుడు లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంటున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Land of Horses : ఇక్కడ మనుషుల కంటే గుర్రాలే ఎక్కువ.. ల్యాండ్ ఆఫ్ హార్సెస్ గా పిలిచే దేశమేదో తెలుసా?
Recommended image2
DMart : డీమార్ట్‌లో సరుకులు కొంటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే, లేదంటే నష్టపోతారు
Recommended image3
ఎవరో ఏదో అంటున్నార‌ని మనసు పాడు చేసుకుంటున్నారా.? ఈ కథ చదివితే భారం తగ్గడం ఖాయం
Related Stories
Recommended image1
Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
Recommended image2
Tata EV Discounts: టాటా ఈవీ కొనాలనుకునే వారికి పండగే.. ఏకంగా రూ. 3.35 లక్షల వరకు తగ్గింపు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved