MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Weather : మే ఫస్ట్ వీక్ లో వానలే వానలు... తెలుగు రాష్ట్రాల్లోని ఏఏ జిల్లాలకు వర్షసూచన?

Weather : మే ఫస్ట్ వీక్ లో వానలే వానలు... తెలుగు రాష్ట్రాల్లోని ఏఏ జిల్లాలకు వర్షసూచన?

Rain Alert : మే నెల ప్రారంభమయ్యింది... సాధారణంగా ఈ నెలలో ఎండలు మండిపోతాయి. కానీ ఈసారి ఎండలకు తోడు వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలను బట్టి అర్థమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటే.. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 01 2025, 07:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Telugu States Weather

Telugu States Weather

Weather : తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా మధ్యాహ్నం ఎండలు మండిపోతుండగా సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి.  మరో నాలుగైదురోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని IMD (ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్ మెంట్) హెచ్చరించింది.

 ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లుల, కొన్నిచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలా మే నెల మొదటివారమంతా ఎండావాన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Andhra Pradesh Rains

Andhra Pradesh Rains

ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు :  

ప్రస్తుతం ఉత్తర కోస్తాంద్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. ముఖ్యంగా కోస్తాంధ్రలో వాతావరణం చల్లబడి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. రాయలసీమలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. 

ఇక మధ్యాహ్నం సమయంలో ఎండలు మండిపోతాయని... గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. సాధారణంగానే మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 40 డిగ్రీలకు పైగా ఎండలుంటాయి కాబట్టి మధ్యాహ్నం సయమంలో బయటకు రావద్దని... ఈ వేడి నుండి ఉపశమనం కోసం చల్లటి ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. 
 

34
Andhra Pradesh Rains

Andhra Pradesh Rains

ఏపీలోని ఏఏ జిల్లాల్లో వర్షాలు?

ఇవాళ (మే 1 గురువారం) శ్రీకాకుళం,  పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల, బిపట్ల, కర్నూల్, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. వేసవికాలం వర్షాల సమయంలో పిడుగుపాట్లు ఎక్కువగా ఉంటాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 
 

44
Telangana Weather

Telangana Weather

తెలంగాణలో వర్షాలు  : 

తెలంగాణలో కూడా ఇవాళ (మే 1 గురువారం) వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.  ఉపరితలం ఆవర్తనం ప్రభావంతో సాయంత్రం సమయంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.  హైదరాబాద్ తో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం,  నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

ఈ మూడ్రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఎండలు మండిపోయి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... సాయంత్రం ఆకాశంలో మేఘాలు ప్రత్యక్షమై వాతావరణ చల్లబడి వర్షం కురుస్తుందని తెలిపారు. అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved