- Home
- Telangana
- IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Telangana Rains : మరికొద్దిసేపట్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక బార్డర్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు.

మరో గంటలో తెలంగాణలో వర్షం
Telangana Rains : సంక్రాంతి సంబరాల్లో మునిగిన తెలుగు ప్రజలకు వర్షాలు కంగారుపెడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తుండగా ఇవి తెలంగాణకు కూడా పాకాయి. మరికొద్దిసేపట్లో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఇప్పటికే ఈ జిల్లాల్లో ఆకాశం మేఘాలతో కమ్మేసిందని… ఇంకో గంటలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
ఈ ప్రాంతాల్లో వర్షం
పశ్చిమ తెలంగాణ జిల్లాలు మరీముఖ్యంగా కర్ణాటకలోకి బీదర్ కు దగ్గరగల ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వెదర్ మ్యాన్ చెబుతున్నారు. అంటే జహీరాబాద్, నారాయణఖేడ్ వంటి ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందన్నమాట. వెదర్ మ్యాన్ చెప్పినట్లు వర్షం కురిస్తే 2026 లో రాష్ట్రంలో తొలిసారి వాన పడినట్లు అవుతుంది.
FIRST RAINS OF 2026 🌧️
ISOLATED RAINS ahead in Sangareddy, Kamareddy districts especially close to Bidar side in next 2hrs
Other parts of Telangana including Hyderabad will be dry, hazy 👍 pic.twitter.com/yHxwsHLCWQ— Telangana Weatherman (@balaji25_t) January 14, 2026
హైదరాబాద్ వెదర్ సంగతేంటి..?
సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు మినహా మిగతా జిల్లాలకు వర్షసూచనలు లేవని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. గత రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదై చలి తీవ్రత తక్కువగా ఉంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం బలపడి తీరందాటినా దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తోంది... తాజా వర్షాలకు ఇదే కారణం.
తెలంగాణలో మళ్లీ చలి పెరుగుతోందా..?
తెలంగాణలో మెల్లిగా చలి పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో జనవరి 14, 15 (బుధ, గురువారం) న 11 నుండి 15 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. మిగతా తెలంగాణ జిల్లాల్లో 15 డిగ్రీల కంటే ఎక్కువగా అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయిని ప్రకటించింది వాతావరణ విభాగం.
0900 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (शाम) 1730 बजे IST पर जारी किया गया/7-day forecast(EVENING) of TELANGANA based on 0900 UTC issued at 1730 hours IST Dated : 14/01/2026 pic.twitter.com/zYwaYjKCWi
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) January 14, 2026
ఇవాళ నమోదైన ఉష్ణోగ్రతలు
ఇక ఇవాళ (జనవరి 14) ఉదయం ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... అత్యల్పంగా ఆదిలాబాద్ లో 13.2 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక రామగుండంలో 14.4, హన్మకొండలో 14.5, మెదక్ లో 15, నల్గొండలొ 16, నిజామాబాద్ లో 16.8, భద్రాచలంలో 18.2. ఖమ్మంలో 18.6, మహబూబ్ నగర్ లో 19.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ విషయానికి వస్తే పటాన్ చెరులో 14.4, రాజేంద్ర నగర్ లో 15, హయత్ నగర్ లో 15, బేగంపేటలో 18.1, దుండిగల్ లో 18.2, హకీంపేటలో 18.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

