- Home
- Telangana
- IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు
Sankranti Weather Update : సంక్రాంతి పండగపూట అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో వర్షాలు కురుసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనవరి 14న ఇరు రాష్ట్రాల వాతావరణ సమాచారం..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
IMD Rain Alert : సరిగ్గా సంక్రాంతి సమయంలో తెలుగు ప్రజలను వర్షాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి... దీంతో ఎక్కడ సంక్రాంతి వేడుకలకు ఈ వర్షాలు ఆటంకం కలిగిస్తాయోనని ప్రజలు కంగారుపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాదుగానీ కొన్ని ప్రాంతాలకు వర్షాల ముప్పు పొంచివుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆ వర్ష భయం ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలయ్యింది.
సంక్రాంతి పండగపూట తెలంగాణ వర్షం
సంక్రాంతి పండగ మొదలయ్యే జనవరి 14న తెలంగాణలో వర్షాలు కూడా మొదలవుతాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. పశ్చిమ, సెంట్రల్ తెలంగాణ జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ వర్షాలేమీ భారీగా ఉండవని... చెదురుమదురు జల్లులకే పరిమితం అవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనంతో పాటు ఉష్ణమండల ప్రాంతాలనుండి వీస్తున్న వేగవంతమైన గాలుల ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట.
FIRST RAINS OF 2026 LIKELY ON JAN 14
The weakened depression and interaction with sub tropical jet stream can cause ISOLATED LIGHT - MODERATE RAIN on January 14
Note that these activities will be very Isolated, few places can even remain dry
However few places mainly West,…— Telangana Weatherman (@balaji25_t) January 12, 2026
తెలంగాణలో తగ్గిన చలి
ఇదిలాఉంటే తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి... దీంతో చలితీవ్రత క్రమక్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ వంటి జిల్లాల్లోనే కనిష్ఠంగా 17 డిగ్రీలకు పైగా లోయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మిగతా జిల్లాల్లో అయితే 20 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. సంక్రాంతి ముగిసేవరకు తెలంగాణవ్యాప్తంగా 15 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది... అంటే పండగ సమయంలో చలితీవ్రత తక్కువగా ఉంటుందన్నమాట... ఇది ప్రజలకు కాస్త ఊరటనిచ్చే అంశం.
ఏపీలో కూడా వర్షాలు
ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న(జనవరి 12, సోమవారం) చిత్తూరు, తిరుపతి, కృష్ణా,బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. అయితే ఈ వర్షాల కారణంగా గాలితో తేమ పెరగడంతో చలితీవ్రత తగ్గింది... సంక్రాంతి పండగ వేళ కూడా చలి తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.
తమిళనాడులో జోరువానలు
రాబోయే మూడురోజుల్లో ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ తో పాటు దక్షిణ భారత ప్రాంతాల నుంచి వైదొలిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే సమయంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్, దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణ ఆవర్తనం కొనసాగుతోందట. దీంతో దక్షిణ తమిళనాడులో కొన్నిచోట్ల, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు సంక్రాంతి పండగ సమయంలో పడే అవకాశాలున్నాయని చెన్నై వాతావరణ కేంద్రం చెబుతోంది.

