MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Telangana Weather : ఈ జిల్లావాసులు కొంచెం జాగ్రత్త .. ఎల్లో అలర్ట్ జారీచేసారు

Telangana Weather : ఈ జిల్లావాసులు కొంచెం జాగ్రత్త .. ఎల్లో అలర్ట్ జారీచేసారు

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు… ఈ జిల్లాలేవో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 21 2025, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలంగాణలో భారీ వర్షాలు
Image Credit : social media

తెలంగాణలో భారీ వర్షాలు

Telangana Rain Alert : వేసవికాలం ఇంకా ముగియనేలేదు అప్పుడే వర్షాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తగ్గి వాతావరణం పూర్తిగా చల్లబడింది... సాయంత్రం అయ్యిందంటే చాలు వర్షకాలంలో మాదిరిగా వానలు దంచికొడుతున్నాయి. అయితే ఈ వానలు మరికొన్నిరోజులు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాల తీవ్రత పెరిగింది... ఎంతలా అంటే వాగులు వంకలు, చెరువుల్లో వరదనీరు చేరి ప్రమాదకరంగా మారుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తెలంగాణలో మరో ఐద్రోజులు వర్షాలు
Image Credit : social media

తెలంగాణలో మరో ఐద్రోజులు వర్షాలు

తెలంగాణలో ప్రస్తుతం ఆకాశమంతా మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. పలు జల్లాల్లో రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం మరో నాలుగైదు రోజులు కొనసాగుతుందని... కొన్నిచోట్ల భారీనుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలోనే వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

36
హైదరాబాద్ లో వానలే వానలు
Image Credit : social media

హైదరాబాద్ లో వానలే వానలు

రాజధాని నగరం హైదరాబాద్ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. ప్రతిరోజూ నగరంలో ఏదోచోట వర్షం కురుస్తోంది... అప్పుడప్పుడు మోస్తరు వానలు ఒక్కోసారి మోకాల్లోతు వరదనీరు రోడ్డుపైకి చేరేస్ధాయిలో వానలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో చెట్లు, హోర్డింగ్ లు కూలి నానా భీభత్సం జరుగతోంది. అయితే హైదరాబాద్ లో మరో ఐదురోజులు ఇదే పరిస్థితి ఉంటుందని... వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

46
తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Image Credit : pixal

తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ శివారుజిల్లాలైన ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మల్కాజ్ గిరి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో మరో ఐద్రోజులు వర్షాలు కొనసాగుతాయి. అలాగే మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయట. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.

56
తెలంగాణను కమ్మేసిన మేఘాలు
Image Credit : Social Media

తెలంగాణను కమ్మేసిన మేఘాలు

ఇవాళ(బుధవారం) తెలంగాణవ్యాప్తంగా ఆకాశం మేఘాలతో కమ్మేసివుండి చల్లని వాతావరణం ఉంటుందట. మధ్యాహ్నం నుండి వర్షాలు కురవడం ప్రారంభం అవుతుంది... సాయంత్రానికి ఇవి మరింత ముదిరి భారీ వానలుగా మారతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

66
తెలంగాణలో ఆకాశం మేఘావృతం
Image Credit : social media

తెలంగాణలో ఆకాశం మేఘావృతం

ఈ వర్షాలకు తోడు పిడుగులు పడే అవకాశాలున్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం అయితేనే వర్షాలు కురిసే సమయంలో ఇళ్లనుండి బయటకు రావాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రైతులు మధ్యాహ్నం లోపే వ్యవసాయ పనులేమైనా ఉంటే పూర్తిచేసుకోవాలి... సాయంత్రం సమయంలో పొలంలో, చెట్లకింద ఉండకూడదని సూచిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది కూడా అప్రమత్తం అయ్యారు... వర్షతీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలకు అవసరం అయితే సాయం చేసేందుకు సిద్దమయ్యారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
వాతావరణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Andhra Pradesh: ఏపీలో నేడు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు...!
Recommended image2
weather: తెలంగాణలో మ‌రో నాలుగు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్ ప్రకటించిన వాతావ‌ర‌ణ శాఖ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved