MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • తెలంగాణలో ట్రాఫిక్ ఫైన్స్ పై బిగ్‌ అప్‌డేట్.. నెల రోజుల్లోగా ఇలా చేయ‌క‌పోతే కుదరదు

తెలంగాణలో ట్రాఫిక్ ఫైన్స్ పై బిగ్‌ అప్‌డేట్.. నెల రోజుల్లోగా ఇలా చేయ‌క‌పోతే కుదరదు

Telangana: తెలంగాణలో ట్రాఫిక్ ఫైన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ ఉల్లంఘనల సమాచారం ప్రతి వాహన యజమానికి సకాలంలో చేరేలా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. లేకపోతే ఇబ్బందులు తప్పవని సూచించింది.  

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jun 16 2026, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
 కీలక మార్పు
Image Credit : Asianet News

కీలక మార్పు

తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ ఫైన్లకు సంబంధించి కీలక మార్పులను ప్రకటించింది. ట్రాఫిక్ ఉల్లంఘనల సమాచారం ప్రతి వాహన యజమానికి సకాలంలో చేరేలా కొత్త నిబంధనలను ట్రాఫిక్ ఫైన్లకు వ్యవస్థలో అమలులోకి తెచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం, వాహనదారులు తమ ప్రస్తుత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ (http://vahan.parivahan.gov.in) లో నెల రోజులలోపు తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని ఆదేశించింది.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫైన్లకు సమాచారం అందక, పెండింగ్‌లో ఉన్న జరిమానాలు పేరుకుపోయి వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పారదర్శకతను పెంచడం, బకాయిల వసూళ్లను వేగవంతం చేయడం కూడా ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశ్యాలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కొత్త నిబంధనలు ఏమిటి?
Image Credit : Asianet News

కొత్త నిబంధనలు ఏమిటి?

తెలంగాణ రవాణా శాఖ కొత్త నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ఫైన్ల సమాచారం ఇకపై నేరుగా SMS, వాట్సాప్ లేదా వారి అధికారిక ఈ-మెయిల్ అడ్రస్‌లకు డిజిటల్ రూపంలో అందుతుంది. వాహనదారులు తమ వివరాలను నెల రోజుల్లోపు వాహన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవాలి. ఈ గడువు ముగిసిన తర్వాత, వాహన్ పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌కు పంపిన SMS, వాట్సాప్ సందేశాలు లేదా మెయిల్‌లను వాహనదారుడికి అధికారికంగా చేరినట్లుగానే రవాణా శాఖ పరిగణిస్తుంది. 'మాకు ఫైన్ సమాచారం రాలేదు' వంటి సాకులను ఇకపై అంగీకరించరు.

33
తప్పుడు ఫైన్లపై ఎలా ఫిర్యాదు చేయాలి.?
Image Credit : Twitter

తప్పుడు ఫైన్లపై ఎలా ఫిర్యాదు చేయాలి.?

ఒకవేళ వాహనదారుడికి తప్పుగా ఫైన్ జారీ అయితే, దాన్ని సవాల్ చేయడానికి ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. వాహనదారులు నిర్దేశిత పోర్టల్ ద్వారా తగిన ఆధారాలతో ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఈ ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారి లిఖితపూర్వక ఉత్తర్వులను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ సమాచారం వాహనదారుడికి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందుతుంది. ట్రాఫిక్ ఫైన్ల పై  వచ్చే అభ్యంతరాలను పరిష్కరించడానికి పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులను ప్రభుత్వం నియమించింది.

ఫైన్ జారీ అయిన 45 రోజుల్లోపు దాన్ని చెల్లించాలి. ఒకవేళ అభ్యంతరం తిరస్కరణకు గురైతే, ఆ ఆర్డర్ వచ్చిన 30 రోజుల్లోపు ఫైన్ మొత్తం చెల్లించాలి లేదా 50% డిపాజిట్ చేసి కోర్టును ఆశ్రయించవచ్చు. ఫైన్ క్లియర్ చేయకపోతే, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఎలాంటి అప్లికేషన్‌లను రవాణా శాఖ ప్రాసెస్ చేయదు. రాబోయే 6 నెలల్లో ప్రస్తుత ఫైన్ల జారీ విధానం పూర్తిగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన సారథి, వాహన్ ఈ-ఫైన్ సిస్టమ్‌లోకి మారనుంది.

ఈ కొత్త నిబంధనలు వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల మరింత అప్రమత్తంగా ఉండేందుకు సహాయపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. వాహనదారులు ఎలాంటి జరిమానాలు, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే వెంటనే తమ వివరాలను వాహన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌కు దూరంగా కొత్త రియ‌ల్ హ‌బ్‌.. ఐటీ ఉద్యోగుల చూపంతా అటు వైపే ఎందుకు.?
Recommended image2
Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి, 20 మందికి గాయాలు
Recommended image3
IMD Weather Update : బంగాళాఖాతంలో తుపాను.. ఆంధ్ర ప్రదేశ్ తీరాన్ని తాకుతుందా? భారీ నుండి అతిభారీ వర్షాలు తప్పవా?
Related Stories
Recommended image1
Blinkit: బ్లింకిట్‌లో ఎలా చేరాలి.? ఎవ‌రు అర్హులు.? నెల‌కు ఎంత సంపాదించొచ్చు.? పూర్తి వివ‌రాలు
Recommended image2
రైల్వే ట్రాక్ పక్కన వేలాడే ఈ సిల్వర్ సిలిండర్ల ఉప‌యోగం ఏంటో తెలుసా.? ఇవి లేక‌పోతే ఏమ‌వుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved