MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Telangana Rains : ఈ భారీ వర్షాలను రేవంత్ రెడ్డి ముందే ఊహించారా? అందుకే వారిని సిద్దం చేసి ఇప్పుడిలా రంగంలోకి దింపారా?

Telangana Rains : ఈ భారీ వర్షాలను రేవంత్ రెడ్డి ముందే ఊహించారా? అందుకే వారిని సిద్దం చేసి ఇప్పుడిలా రంగంలోకి దింపారా?

ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే ఊహించారా? అంటే ఆయన చర్యలు అవుననే చెబుతున్నాయి. ఎప్పుడో ఐదారు నెలలకిందే ఈ భారీ వర్షాలకు గుర్తించిన సీఎం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అవేంటో చూద్దాం. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 22 2025, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణలో ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ రెడీ
Image Credit : ANI

తెలంగాణలో ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ రెడీ

Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజులుగా సూర్యుడి జాడే లేదు... ఆకాశం మబ్బులతో కమ్మేసి ఉంది. హైదరాబాద్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి... దీంతో ఎండాకాలంలోనే వరదలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది... ఈ వర్షాలు, వరదల నుండి ప్రజలను కాపాడేందుకు ప్రత్యేకంగా 12 స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డిఆర్ఎఫ్) టీమ్స్ ను రెడీ చేసింది.

ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు ఈ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (SDRF) ను ప్రారంభించింది. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 2 వేల మందితో దీన్ని ఏర్పాటుచేసారు. ప్రకృతి విపత్తులు, ప్రమాదాల సమయంలో సహాయక చర్యల కోసం వీరిని ఉపయోగిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణలో భారీ వర్షాలు
Image Credit : Google

తెలంగాణలో భారీ వర్షాలు

అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం, అరేబియా సముద్రంలో ఆవర్తనం, నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నారు. మరో నాలుగైదు రోజులు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే నదులు, రిజర్వాయర్లు, వాగులు వంకలు, చెరువులకు వరదనీరు చేరి ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బంది పడవచ్చు. అందుకే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్ సర్కార్ ఎస్డిఆర్ఎఫ్ ను రంగంలోకి దింపింది.

35
ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రెడీ
Image Credit : Twitter

ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రెడీ

ఇప్పటికే హైదరాబాద్ లో మూడు ఎన్డిఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) టీమ్స్ రెడీగా ఉన్నాయి. వీరికి మరో 12 ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ జత కానున్నాయి. ఒక్కో ఎస్డిఆర్ఎఫ్ టీమ్ లో 100 మంది పోలీసులు ఉంటారు... అంటే మొత్తం 1200 మందికి పైగా పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొననున్నారు. ముంపు ప్రాంతాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించారు.. ఈ ప్రాంతాల్లో అనుకోకుండా ఏదయినా విపత్తు వస్తే ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగేందుకు రెడీగా ఉంటారు.

45
తెలంగాణలో పిడుగుపాట్లకు నలుగురు బలి
Image Credit : social media

తెలంగాణలో పిడుగుపాట్లకు నలుగురు బలి

ఇక ఇప్పటికే అకాల వర్షాల దాటికి తెలంగాణలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. గూడూరు మండలం గుండెంగలో ప్రవీణ్ కుమార్ (27). ఓటాయి గ్రామంలో గొర్రెల కాపరి చేరాలు(55) మృతి చెందారు. ఇక నల్గొండ జిల్లాలో మహిళా రైతు భిక్షమమ్మ(46), వనపర్తి జిల్లాలో గోపాల బాలరాజు(20) పిడుగుపాటుకు గురయి చనిపోయారు. మరికొద్దిరోజులు ఇలాగే పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.

55
ఏపీలో భారీ వర్షాలు... సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు
Image Credit : I&PR AP

ఏపీలో భారీ వర్షాలు... సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు

ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, పిడగులు పడతాయని తెలిపారు. దీంతో విపత్తుల నిర్వహణ సంస్థలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేసింది. అత్యవసర సమయంలో సహాయం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్లు 1070,112, 18004250101 ఫోన్ చేయాలని సూచించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
Weather : తెలుగోళ్లు బిఅలర్ట్ ... మీకు ఏ సాయం కావాలన్నా ఈ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయండి
Recommended image2
Heavy rains: దంచికొడుతున్న వాన‌లు.. హైద‌రాబాద్ జ‌ల‌మ‌యం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved