MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Liquor Price: పండగ ముందు మందుబాబులకు షాక్.. పెరిగిన మద్యం ధరలు

Liquor Price: పండగ ముందు మందుబాబులకు షాక్.. పెరిగిన మద్యం ధరలు

Liquor Price: దసరా, దీపావళి పండగల ముందు మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో విదేశీ మద్యం ధరలు సగటున 6 శాతం వరకు పెరిగాయి. 352 బ్రాండ్లపై ప్రభావం పడనుండగా, కొత్త ధరలు ఈ నెల 12 నుంచి అమల్లోకి వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 14 2026, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దసరా వేళ మందుబాబులకు ఊహించని షాక్
Image Credit : chatgpt

దసరా వేళ మందుబాబులకు ఊహించని షాక్

తెలంగాణలోని మద్యం ప్రియులకు, ముఖ్యంగా ఫారిన్ లిక్కర్ ఇష్టపడే వారికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. దసరా పండుగ వేళ విదేశీ మద్యం ధరలను సగటున 6 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైన్ షాపులు, బార్లు, పబ్బుల్లో విక్రయించే వివిధ రకాల విదేశీ బ్రాండ్ల ధరలకు సంబంధించి తెలంగాణ బెవరేజెస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్‌) అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. ఈ సవరించిన కొత్త ధరలు ఈ నెల 12వ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని అధికారులు స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
352 బ్రాండ్లపై ప్రభావం.. ఫుల్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 పెంపు
Image Credit : our own

352 బ్రాండ్లపై ప్రభావం.. ఫుల్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 పెంపు

రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం 352 విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించింది. టెండర్ కమిటీ సమర్పించిన రిపోర్టు, సిఫారసులు, అసెస్సబుల్‌ వ్యాల్యూస్‌ను (ఏవీఎస్‌) పరిశీలించిన అనంతరం ఈ ధరల సవరణకు ఆమోదం తెలిపింది. అన్ని బ్రాండ్లకు ఒకే రకంగా కాకుండా, బ్రాండ్‌ను బట్టి వినియోగదారులపై భారం పడనుంది. ఫుల్ బాటిల్‌పై కనిష్ఠంగా రూ.30 నుంచి గరిష్ఠంగా రూ.100 వరకు అదనపు భారం పడనుంది. సగటున 6 శాతం ధరలు పెరగడంతో మందుబాబులు ఇకపై జేబు నుంచి ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది.

35
ప్రధాన బ్రాండ్ల కొత్త ధరలు ఇలా..
Image Credit : Gemini AI

ప్రధాన బ్రాండ్ల కొత్త ధరలు ఇలా..

విదేశాల నుంచి దిగుమతి అయ్యే ప్రముఖ బ్రాండ్ల స్కాచ్, సింగిల్ మాల్ట్ విస్కీలు, వోడ్కా, జిన్, వైన్ రకాల గరిష్ఠ రిటైల్ ధరలు భారీగా పెరిగాయి. గ్లెన్‌మోరంగీ సిగ్నెట్ (750ml) ధర రూ.50,660కి చేరగా, రాయల్ సెల్యూట్ 21 ఇయర్స్ (700ml) రూ.27,220గా ఉంది. అలాగే జానీ వాకర్ బ్లాక్ లేబుల్ (750ml) రూ.5,140, గ్లెన్‌ఫిడిచ్ 12 ఇయర్స్ (700ml) రూ.7,910, అబ్సల్యూట్ వోడ్కా (750ml) రూ.2,680 చొప్పున సవరించిన ధరలు అమలవుతున్నాయి. వైన్స్ విషయానికి వస్తే, మోయెట్ అండ్ చాన్డన్ బ్రూట్ (750ml) ధర రూ.14,270గా నిర్ణయించారు.

45
కఠిన నిబంధనలు.. స్టిక్కర్లు తప్పనిసరి
Image Credit : Getty

కఠిన నిబంధనలు.. స్టిక్కర్లు తప్పనిసరి

డిపోల్లో ప్రస్తుతం ఉన్న నిల్వలతో పాటు, ఇకపై రవాణా చేసే ప్రతి విదేశీ మద్యం బాటిల్‌పై తప్పనిసరిగా సవరించిన కొత్త ఎమ్మార్పీతో కూడిన స్టిక్కర్లను అతికించాలని నమోదిత సరఫరాదారులను అధికారులు ఆదేశించారు. వైన్ షాపులు, బార్లు, డిస్ట్రిబ్యూటర్లు కేవలం సవరించిన ధరలకే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే షాపుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

55
కొత్త బార్ల దరఖాస్తులకు భారీ స్పందన
Image Credit : freepik

కొత్త బార్ల దరఖాస్తులకు భారీ స్పందన

మరోవైపు, రాష్ట్రంలో కొత్తగా 41 బార్ల ఏర్పాటుకు అబ్కారీ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌కు అపూర్వ స్పందన లభించింది. మొత్తం 8,771 దరఖాస్తులు రాగా, ఒక్కో దరఖాస్తుకు తిరిగి చెల్లించని రుసుము రూ.లక్ష ఉండటంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. క్యూర్ పరిధిలో ఒక బార్‌కు సగటున 303 దరఖాస్తులు రాగా, కొన్ని ప్రాంతాల్లో పోటీ మరింత తీవ్రంగా ఉంది. ఈ నెల 16న లాటరీ ద్వారా బార్ల నిర్వాహకులను ఎంపిక చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌కు 50 కి.మీల దూరంలో ఉన్న ఈ ప్రాంతం.. మ‌రో అల్వాల్ కావ‌డం ఖాయం
Recommended image2
Cold Free Winter: ఈసారి చలి లేనట్టే.. శీతాకాలంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా?
Recommended image3
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలోకి ఎప్పుడంటే?
Related Stories
Recommended image1
Bird’s Paradise Lake: ప్రపంచంలో ఎన్నో సరస్సులు ఉన్నా కొల్లేరు మాత్రం చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?
Recommended image2
Mutual Funds: రూ.5 లక్షలు ఉంటే చాలు.. రూ.80 లక్షల జాక్‌పాట్ కొట్టే సింపుల్ ట్రిక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved