MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana : తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది? అత్యంత చిన్నది ఏది?

Telangana : తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది? అత్యంత చిన్నది ఏది?

ఇండియాలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏదంటే టక్కున రాజస్థాన్, జనాభా పరంగా అంటే ఉత్తర ప్రదేశ్, ఆదాయం పరంగా అంటే మహారాష్ట్ర పేర్లు వినిపిస్తాయి. మరి తెలంగాణలో విస్తీర్ణం, జనాభా, ఆదాయం పరంగా అతిపెద్ద, అతి చిన్న జిల్లాలేవి?

4 Min read
Author : Arun Kumar P
Published : Oct 06 2026, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ జిల్లాల గురించి ఆసక్తికర విషయాలు
Image Credit : Gemini AI

తెలంగాణ జిల్లాల గురించి ఆసక్తికర విషయాలు

తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. అయితే ఈ జిల్లాలన్నీ ఒకే పరిమాణంలో ఉండవు... కొన్ని జిల్లాలు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటే మరికొన్ని జిల్లాలు కొన్ని వందల చదరపు కిలోమీటర్లకే పరిమితమయ్యాయి. అదే విధంగా జనాభాను పరిశీలిస్తే హైదరాబాద్ వంటి జిల్లాల్లో లక్షలాది మంది నివసిస్తుండగా.. కొన్ని జిల్లాల్లో జనాభా చాలా తక్కువగా ఉంది. ఇక ఆర్థిక పరంగా చూసినా అన్ని జిల్లాల పరిస్థితి ఒకేలా లేదు... కొన్ని అత్యధిక ఆదాయం, మరికొన్ని అత్యల్ప ఆదాయం కలిగివున్నాయి.

అందుకే తెలంగాణలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది? జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? ఆర్థికంగా అత్యధిక ఆదాయం కలిగిన జిల్లా ఏది? అనే ప్రశ్నలకు సమాధానం ఒకటే ఉండదు. ఒక్కో ప్రమాణం ప్రకారం ఒక్కో జిల్లా ముందంజ, వెనకంజలో ఉంటాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విస్తీర్ణం పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది?
Image Credit : Gemini AI

విస్తీర్ణం పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది?

విస్తీర్ణం పరంగా చూస్తే… భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలో అతిపెద్ద జిల్లాల్లో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ జిల్లా భౌగోళిక విస్తీర్ణం సుమారు 7,483 చదరపు కిలోమీటర్లు. విస్తారమైన భూభాగం, అనేక మండలాలు, గ్రామీణ ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం తర్వాతిస్థానంలో నల్గొండ జిల్లా ఉంది... దీని విస్తీర్ణం సుమారు 7,122 చదరపు కిలోమీటర్లు ఉంది. నాగర్‌కర్నూల్ 6,395.95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మరో పెద్ద జిల్లాగా నిలుస్తోంది. ఈ జిల్లాలన్నీ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే గణనీయమైన భూభాగాన్ని కలిగి ఉన్నాయి.

తెలంగాణలో అతి చిన్న జిల్లా ఏది?

విస్తీర్ణం పరంగా చూస్తే హైదరాబాద్ జిల్లా తెలంగాణలోనే అతి చిన్న జిల్లా. దీని భౌగోళిక విస్తీర్ణం కేవలం 217.13 చదరపు కిలోమీటర్లు. హైదరాబాద్ తర్వాత తక్కువ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో హనుమకొండ సుమారు 1,653.58 చదరపు కిలోమీటర్లు, వరంగల్ సుమారు 1,784.80 చదరపు కిలోమీటర్లతో ఉన్నాయి. అంటే హైదరాబాద్ జిల్లాతో పోలిస్తే ఇవి పెద్దవే అయినప్పటికీ.. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాలతో పోలిస్తే విస్తీర్ణం చాలా తక్కువ.

35
జనాభా పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది?
Image Credit : stockPhoto

జనాభా పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది?

ఇక జనాభా విషయానికి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. హైదరాబాద్ జిల్లా జనాభా పరంగా తెలంగాణలో అగ్రస్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం... హైదరాబాద్ జిల్లా జనాభా 39,43,323. అంటే దాదాపు 39.4 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విస్తీర్ణంలో తెలంగాణలోనే అతి చిన్న జిల్లాగా ఉన్న హైదరాబాద్, జనాభా పరంగా మాత్రం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. తక్కువ భూభాగంలో భారీ జనాభా నివసించడం వల్ల హైదరాబాద్‌ జనసాంద్రత కూడా అత్యధికంగా ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లో చదరపు కిలోమీటరుకు 18,161 మంది జనాభా ఉంది.

జనాభా పరంగా అతి చిన్న జిల్లా ఏది?

జనాభా పరంగా చూస్తే ములుగు జిల్లా తెలంగాణలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 2,94,671 మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 2.95 లక్షల జనాభాతో ములుగు రాష్ట్రంలో జనాభా పరంగా చివరి స్థానంలో ఉంది.

ములుగు తర్వాత తక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో కుమురం భీమ్ ఆసిఫాబాద్ 5,15,812 మందితో, జయశంకర్ భూపాలపల్లి 4,16,763 మందితో ఉన్నాయి. జనాభా పరంగా హైదరాబాద్‌కు, ములుగుకు మధ్య ఎంతటి తేడా ఉందో ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతుంది.

45
ఆదాయం పరంగా తెలంగాణలో టాప్ జిల్లా ఏది?
Image Credit : Gemini AI

ఆదాయం పరంగా తెలంగాణలో టాప్ జిల్లా ఏది?

జిల్లాల ఆర్థిక పరిస్థితిని పోల్చేటప్పుడు Gross District Domestic Product (GDDP) ని ముఖ్యమైన కొలమానంగా తీసుకుంటారు. ఒక జిల్లాలో ఒక నిర్దిష్ట కాలంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం ఆర్థిక విలువను ఇది ప్రతిబింబిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక గణాంకాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా GDDP పరంగా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల వద్ద రంగారెడ్డి జిల్లా GDDP సుమారు రూ.2,83,419 గా నమోదైంది. అదే సమయంలో హైదరాబాద్ జిల్లా రూ.2,28,623 తో రెండో స్థానంలో ఉంది.

రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్‌ చుట్టుపక్కల విస్తరిస్తున్న ఐటీ, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, సేవా రంగం, వాణిజ్య కార్యకలాపాలు జిల్లా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల విస్తీర్ణం లేదా జనాభా మాత్రమే కాకుండా ఆర్థిక కార్యకలాపాల పరంగా కూడా ఈ జిల్లా తెలంగాణలో అత్యంత కీలకంగా మారింది.

ఆదాయం పరంగా అతి చిన్న జిల్లా ఏది?

GDDP పరంగా చూస్తే ములుగు జిల్లా రాష్ట్రంలో అత్యల్ప స్థాయిలో ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వ గణాంకాల్లో ములుగు జిల్లా GDDP సుమారు రూ.6,914 గా నమోదైంది. అంటే రంగారెడ్డి జిల్లా GDDPతో పోలిస్తే ములుగు ఆర్థిక పరిమాణం చాలా తక్కువగా ఉంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. జనాభా పరంగా కూడా ములుగు రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉంది. అయితే ఒక జిల్లాలో జనాభా తక్కువగా ఉండటం అంటే అక్కడి ప్రజల వ్యక్తిగత ఆదాయం కూడా తప్పనిసరిగా తక్కువగా ఉంటుందని అర్థం కాదు. GDDP మొత్తం జిల్లా ఆర్థిక పరిమాణాన్ని సూచిస్తుంది. తలసరి ఆదాయం మాత్రం ఒక్కో వ్యక్తికి సగటున వచ్చే ఆదాయ స్థాయిని సూచిస్తుంది. ఈ రెండింటినీ ఒకటిగా చూడకూడదు.

55
తలసరి ఆదాయం విషయంలో ఎవరు ముందున్నారు?
Image Credit : Asianet News

తలసరి ఆదాయం విషయంలో ఎవరు ముందున్నారు?

జిల్లాల ఆర్థిక స్థాయిని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే తలసరి ఆదాయాన్ని కూడా చూడాలి. తెలంగాణ ప్రభుత్వం 2024–25 బడ్జెట్ సందర్భంగా వెల్లడించిన 2023–24 గణాంకాల ప్రకారం రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.9,46,862గా ఉంది. అదే సమయంలో వికారాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం రూ.1,80,241గా నమోదైంది. అంటే జిల్లాల మధ్య ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన తేడాలు ఉన్నాయని ప్రభుత్వమే పేర్కొంది.

తెలంగాణ జిల్లాలను ఈ మూడు ప్రధాన ప్రమాణాల ఆధారంగా చూస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. విస్తీర్ణంలో భద్రాద్రి కొత్తగూడెం ముందుండగా, జనాభాలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఇక GDDP పరంగా రంగారెడ్డి రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జిల్లా ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. మరోవైపు విస్తీర్ణంలో హైదరాబాద్, జనాభాలో ములుగు, GDDPలో ములుగు దిగువన ఉన్నాయి.

అంటే తెలంగాణలో ఒక జిల్లా భౌగోళికంగా పెద్దదిగా ఉన్నంత మాత్రాన జనాభా లేదా ఆర్థిక పరంగా కూడా మొదటి స్థానంలో ఉంటుందని చెప్పలేం. హైదరాబాద్ ఇందుకు మంచి ఉదాహరణ. రాష్ట్రంలో అతి చిన్న విస్తీర్ణం ఉన్నప్పటికీ అత్యధిక జనాభాను కలిగి ఉంది. మరోవైపు రంగారెడ్డి ఆర్థిక కార్యకలాపాల కారణంగా GDDPలో ముందంజలో ఉంది. ఈ విధంగా తెలంగాణ జిల్లాల ప్రత్యేకతను అర్థం చేసుకోవాలంటే విస్తీర్ణం, జనాభా, ఆర్థిక స్థితి అనే మూడు అంశాలను విడివిడిగా పరిశీలించాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Prices: బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మరింత పెరుగుతాయా?
Recommended image2
Now Playing
పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu
Recommended image3
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
Related Stories
Recommended image1
Telangana: తెలంగాణ‌లోని ఈ ప‌ట్ట‌ణంలో.. రూ. 54 కోట్ల‌తో అత్యాధునిక బ‌స్టాండ్ నిర్మాణం
Recommended image2
Telangana: క‌నీస‌వేత‌నం రూ. 16 వేల‌కు పెంపు.. 1.10 కోటి మందికి ప్ర‌యోజ‌నం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved