MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Teachers: బడికి డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్లే.. టీచర్లకు విద్యాశాఖ షాక్

Teachers: బడికి డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్లే.. టీచర్లకు విద్యాశాఖ షాక్

Telangana Govt: టీచర్లకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. అనుమతి లేకుండా ఏడాదంతా బడికి రాకపోతే టీచర్లను ఉద్యోగం నుంచి తీసేస్తామని తెలంగాణ విద్యాశాఖ హెచ్చరించింది. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపైనా వేటు తప్పదని పేర్కొంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 13 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్కూల్‌కి రాకపోతే పర్మనెంట్‌గా ఇంటికే.. తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం
Image Credit : Chatgpt

స్కూల్‌కి రాకపోతే పర్మనెంట్‌గా ఇంటికే.. తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ, ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులకు తెలంగాణ విద్యాశాఖ గట్టి షాక్ ఇచ్చింది. ముందస్తు అనుమతి లేకుండా బడులకు రాకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై ఇకపై ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపకూడదని తేల్చిచెప్పేసింది.

ముందస్తు పర్మిషన్ లేకుండా వరుసగా ఏడాది పాటు విధులకు దూరంగా ఉంటే, నిబంధనల ప్రకారం వారిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచడం, పిల్లలకు క్రమం తప్పకుండా పాఠాలు అందేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐదేళ్లు బడికి రాకపోతే రీసైన్ చేసినట్లే
Image Credit : chatgpt

ఐదేళ్లు బడికి రాకపోతే రీసైన్ చేసినట్లే

కొత్త మార్గదర్శకాల ప్రకారం.. అనుమతి లేని గైర్హాజరుపై విద్యాశాఖ అధికారులు సీసీఏ రూల్స్ ప్రకారం వెంటనే చర్యలు ప్రారంభించనున్నారు. వరుసగా ఐదేళ్ల పాటు విధులకు హాజరుకాకపోతే సదరు టీచర్ లేదా సిబ్బంది తమ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగానే భావిస్తారు.

విదేశీ సర్వీసుల్లో ఉంటూ గడువు ముగిసినా తిరిగి రాని వారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇక నుంచి గైర్హాజరైన వారిని గుర్తించిన వెంటనే కాలయాపన చేయకుండా షోకాజ్ నోటీసులు జారీ చేసి, తక్షణమే విచారణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.

35
హెచ్‌ఎంలు, ఎంఈఓలు దాచిపెడితే మీకే ముప్పు
Image Credit : Revanth Reddy Twitter

హెచ్‌ఎంలు, ఎంఈఓలు దాచిపెడితే మీకే ముప్పు

ఉపాధ్యాయులు బడికి రాకపోయినా పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉండే ఉన్నతాధికారులపై కూడా ప్రభుత్వం కంటిన్యూగా కన్నేసింది. డుమ్మా కొట్టే టీచర్ల వివరాలను దాచిపెట్టినా లేదా వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసినా హెడ్‌మాస్టర్లు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ హెచ్చరించారు. గైర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుకోకుండా అలసత్వం వహిస్తే సదరు అధికారులనే బాధ్యులను చేస్తూ వేటు వేస్తామని స్పష్టం చేశారు.

45
ప్రత్యేక రిజిస్టర్.. ఎప్పటికప్పుడు అప్‌డేట్
Image Credit : Asianet News

ప్రత్యేక రిజిస్టర్.. ఎప్పటికప్పుడు అప్‌డేట్

ఈ క్రమంలో ప్రతి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గైర్హాజరయ్యే టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ నిర్వహించనున్నారు. అందులో ఆబ్సెంట్ అయిన వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఎవరు బడికి సరిగ్గా వస్తున్నారు, ఎవరు ఎగనామం పెడుతున్నారనేది రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈఓల నిఘాలో ఉండనుంది.

55
జీతాలు కట్.. పెన్షన్, ఇంక్రిమెంట్లలోనూ కోత
Image Credit : Getty

జీతాలు కట్.. పెన్షన్, ఇంక్రిమెంట్లలోనూ కోత

అనుమతి లేకుండా స్కూళ్లకు రాని కాలాన్ని డైస్ నన్ అంటే పనిచేయని కాలంగా పరిగణిస్తారు. ఇలాంటి సమయంలో ఉపాధ్యాయులకు ఎలాంటి జీతభత్యాలు చెల్లించరు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వచ్చే సీనియారిటీ ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ తర్వాత వచ్చే పింఛన్ వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా భారీగా కోత విధించనున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి, బడుల్లో క్రమశిక్షణను పునరుద్ధరించడానికే విద్యాశాఖ ఈ కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Recommended image2
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Recommended image3
Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు
Related Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో ఒక్కసారిగా మారిన సీన్.. ఏపీ, తెలంగాణకు తుపాను ముప్పు.. భారీ వర్షాలు
Recommended image2
Anupama Parameswaran: ఆ రెండేళ్లూ నరకం చూశా.. ప్రియుడి మానసిక వేధింపులపై ఓపెన్ అయిన అనుపమ.. ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved