MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Anupama Parameswaran: ఆ రెండేళ్లూ నరకం చూశా.. ప్రియుడి మానసిక వేధింపులపై ఓపెన్ అయిన అనుపమ.. ఎవరో తెలుసా?

Anupama Parameswaran: ఆ రెండేళ్లూ నరకం చూశా.. ప్రియుడి మానసిక వేధింపులపై ఓపెన్ అయిన అనుపమ.. ఎవరో తెలుసా?

Anupama Parameswaran: ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితం, గతంలో సాగించిన ఒక బ్రేకప్ స్టోరీపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తన రెండేళ్ల టాక్సిక్ రిలేషన్‌షిప్, నార్సిసిస్టిక్ మానసిక వేధింపుల గురించి ఓపెన్ అయ్యారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 13 2026, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అనుపమ జీవితాన్ని నరకంగా మార్చిన ఆ హీరో కొడుకు ఎవరు?
Image Credit : X/anupamahere

అనుపమ జీవితాన్ని నరకంగా మార్చిన ఆ హీరో కొడుకు ఎవరు?

సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. పదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా కేవలం నటనపైనే దృష్టి పెట్టిన ఈ మలయాళ బ్యూటీ, గత కొంతకాలంగా లవ్ అండ్ బ్రేకప్ రూమర్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

ఒక ప్రముఖ యువ హీరోతో ఆమె ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారంటూ సినీ వర్గాల్లో అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రూమర్స్‌పై సైలెంట్‌గా ఉన్న అనుపమ, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన గత రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చేదు అనుభవాలను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అపరిచితుడిలా మారిన ప్రియుడు.. నార్సిసిస్టిక్ వేధింపులు
Image Credit : Instagram/ Anupama Parameswaran

అపరిచితుడిలా మారిన ప్రియుడు.. నార్సిసిస్టిక్ వేధింపులు

తన జీవితంలో ఎదురైన ఆ చేదు జ్ఞాపకాల గురించి మాట్లాడిన అనుపమ, గత రెండేళ్ల కాలంలో తాను అనుభవించిన నరకాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. తాను ఒక తీవ్రమైన నార్సిసిస్టిక్ అబ్యూజ్ కు గురయ్యానని, ఒక విషపూరితమైన బంధంలో బందీ అయ్యానని వెల్లడించింది.

తన మాజీ ప్రియుడు ఒక రోజు 'రెమో'లా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉంటూ ప్రపంచంలోనే ఉత్తమ వ్యక్తిగా కనిపించేవాడని, కానీ మరుసటి రోజే విక్రమ్ 'అపరిచితుడు' సినిమాలోని క్యారెక్టర్ లాగా అత్యంత దారుణంగా, క్రూరంగా ప్రవర్తించేవాడని గుర్తుచేసుకుంది. మళ్లీ ఆ తర్వాత రోజు చిన్నపిల్లాడిలా ఏడుస్తూ క్షమాపణలు కోరేవాడని, ఈ సైకిల్ నిరంతరం రిపీట్ అయ్యేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Related Articles

Related image1
Batwara 1947: మానవత్వం కంటే ఏదీ గొప్పది కాదు.. ‘బట్వారా 1947’ ఎందుకు చూడాలి?
Related image2
Konaseema: కేరళ కాదు గురూ.. మన ఏపీలోని ఈ రివర్ ప్యారడైజ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
35
కెరీర్‌పై ఆంక్షలు.. క్యారవాన్‌లో ఏడ్చిన రోజులు
Image Credit : youtube.com/@LycaProductions

కెరీర్‌పై ఆంక్షలు.. క్యారవాన్‌లో ఏడ్చిన రోజులు

ప్రేమ పేరుతో తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి, క్రమక్రమంగా తనను పూర్తిగా కంట్రోల్ చేయడం ప్రారంభించాడని అనుపమ తెలిపింది. తాను వేసుకునే దుస్తుల నుంచి, సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వరకు ప్రతీ విషయాన్ని ఆయనే నియంత్రించేవాడని పేర్కొంది.

ఆఖరికి తాను నటిస్తున్న సినిమాల ఎంపికలోనూ, ప్రమోషన్స్‌కు హాజరయ్యే విషయంలోనూ ఆంక్షలు విధించేవాడని చెప్పింది. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లకు కూడా ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే హాజరుకాలేకపోయానని స్పష్టం చేసింది. షూటింగ్ సెట్స్‌లో క్యారవాన్‌లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చేదాన్ని అని, పానిక్ ఎటాక్స్, తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడ్డానని ఆమె వెల్లడించింది.

45
మూడే నెలల్లో ఎంగేజ్‌మెంట్ డ్రామా.. గోల్డ్ డిగ్గర్ విమర్శలకు చెక్
Image Credit : our own

మూడే నెలల్లో ఎంగేజ్‌మెంట్ డ్రామా.. గోల్డ్ డిగ్గర్ విమర్శలకు చెక్

రిలేషన్‌షిప్ ప్రారంభమైన కేవలం మొదటి రెండు డేట్లకే అతడు తనను ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని, మూడు నెలలు తిరక్కుండానే నిశ్చితార్థం, పెళ్లి గురించి ఒత్తిడి తెచ్చారని అనుపమ చెప్పింది. అయితే ఆ తొందరపాటు సరికాదని, తనకు ఇంకా సమయం కావాలని కోరి ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపింది.

తనను గోల్డ్ డిగ్గర్ అని విమర్శించే వారికి సమాధానమిస్తూ.. తాను కనుక ఆ రోజు ఆ ప్రపోజల్‌కు ఓకే చెప్పి ఉంటే, ఈపాటికి తమ బంధం విడాకులతో ముగిసేదని బదులిచ్చింది. ఆ బంధంలో ప్రేమ కంటే తనను పూర్తిగా ఆధిపత్యం కిందకి తెచ్చుకోవాలనే ప్రయత్నమే ఎక్కువగా కనిపించిందని వివరించింది.

55
ఆ ‘అపరిచితుడు’ ఎవరు?
Image Credit : our own

ఆ ‘అపరిచితుడు’ ఎవరు?

ఇంటర్వ్యూలో తన బాధనంతా వెళ్లగక్కిన అనుపమ, ఆ మాజీ ప్రియుడు ఎవరనేది మాత్రం అధికారికంగా బయటపెట్టలేదు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫిలిం నగర్ సర్కిల్స్‌లో అసలు ఆ అపరిచితుడు ఎవరు అనే చర్చ ఊపందుకుంది. గతంలో తమిళ ప్రముఖ హీరో కుమారుడు, యంగ్ హీరోతో అనుపమ డేటింగ్‌లో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరి కాంబినేషన్‌లో కథనాలు కూడా వచ్చాయి.

ఈ క్రమంలో అనుపమ చేసిన వ్యాఖ్యలు ఆ హీరో కుమారుడి గురించేనంటూ నెటిజన్లు, సినీ విశ్లేషకులు ఊహాగానాలు చేస్తున్నారు. ఏది ఏమైనా, ప్రస్తుతం ఆ విషపూరిత బంధం నుంచి బయటపడి స్వేచ్ఛను పొందుతున్నానని, తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాలను బహిర్గతం చేశానని అనుపమ స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లోనైనా ఆ అపరిచితుడు ఎవరో అనుపమ చెబుతుందో లేదో చూడాలి మరి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
వినోదం
బాలీవుడ్
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్న సమంత.. రాజ్ నిడిమోరు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే?
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ కి ‘కామనర్స్’ అంటే అంత చులకనా? అప్పుడు శ్రీజ, ఇప్పుడు చరణ్..
Recommended image3
Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ.. సూరి హీరోగా సుహాస్‌ విలన్‌గా చేసిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Batwara 1947: మానవత్వం కంటే ఏదీ గొప్పది కాదు.. ‘బట్వారా 1947’ ఎందుకు చూడాలి?
Recommended image2
Konaseema: కేరళ కాదు గురూ.. మన ఏపీలోని ఈ రివర్ ప్యారడైజ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved