MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • Weather Update: బంగాళాఖాతంలో ఒక్కసారిగా మారిన సీన్.. ఏపీ, తెలంగాణకు తుపాను ముప్పు.. భారీ వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో ఒక్కసారిగా మారిన సీన్.. ఏపీ, తెలంగాణకు తుపాను ముప్పు.. భారీ వర్షాలు

Weather Update: తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో వాయుగుండంతో ఏపీ, తెలంగాణలో రాగల 6 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో పాటు ఈదురుగాలులు ఉంటాయనీ, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం ఉంటాయని అంచనా వేసింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 13 2026, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
IMD Rain Alert: ఏపీ, తెలంగాణలో వర్షాలు
Image Credit : Chatgpt

IMD Rain Alert: ఏపీ, తెలంగాణలో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి, ఆపై వాయుగుండంగా పరిణామం చెందింది. ఇది రాత్రి సమయంలో బెంగాల్ వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటిన ఈ వాయుగుండం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం సుడి ప్రభావం కొద్దిగా ఏపీ, తెలంగాణ సరిహద్దుల వరకు విస్తరించి ఉంది.

అయితే తెలుగు రాష్ట్రాలపై ఈ వాయుగుండం ప్రభావం నేరుగా ఉండదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, దీని వల్ల ఆగస్టు 13న ఇరు రాష్ట్రాల్లోనూ సుడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, వర్షాలు కురుస్తాయని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రాబోయే 6 రోజుల వాతావరణం పై ఐఎండీ కీలక అప్‌డేట్
Image Credit : GETTY

రాబోయే 6 రోజుల వాతావరణం పై ఐఎండీ కీలక అప్‌డేట్

భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సమాచారం ప్రకారం, ఆగస్టు 13 నుండి 18 వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే, కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

Related Articles

Related image1
iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
Related image2
Konaseema: కేరళ కాదు గురూ.. మన ఏపీలోని ఈ రివర్ ప్యారడైజ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
36
తీవ్ర గాలుల హెచ్చరికలు
Image Credit : Getty

తీవ్ర గాలుల హెచ్చరికలు

కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ: ఆగస్టు 13, 14 తేదీల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే ఆగస్టు 15, 16 తేదీల్లో గంటకు 30 నుండి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి.

తెలంగాణ: ఆగస్టు 13 నుండి 16 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఆగస్టు 12 నుండి 16 వరకు రెండు రాష్ట్రాల్లో ఉపరితల గాలులు చాలా బలంగా వీచే అవకాశం ఉందని ఇదివరకు హెచ్చరించింది.

46
తెలంగాణ వెదర్ ఎలా ఉంది?
Image Credit : GETTY

తెలంగాణ వెదర్ ఎలా ఉంది?

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు కొనసాగుతుండటంతో చాలా జిల్లాల్లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంది. హైదరాబాద్ లో కనిష్ఠ ఉష్ణోగ్రత 28°C కాగా, గరిష్ఠ ఉష్ణోగ్రత 38°C వరకు నమోదైంది. నగరంలో అక్కడక్కడా స్వల్పంగా వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి.

ఇక గత 24 గంటల గణాంకాలను పరిశీలిస్తే, కుమురం భీం జిల్లా ఎల్కపల్లిలో అత్యధికంగా 7.3 సెం.మీ, దహేగామ్‌లో 6 సెం.మీ, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో 5 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. అలాగే హైదరాబాద్ ముషీరాబాద్‌లో 2 సెం.మీ వర్షం పడింది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C వరకు ఉండనుంది. గాలిలో తేమ 50 శాతంగా ఉండటం వల్ల ప్రధానంగా ఉత్తర తెలంగాణలోనే జల్లులు పడేందుకు అనుకూల వాతావరణం ఉంది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉంది.

56
మత్స్యకారులకు అలర్ట్
Image Credit : Gemini AI

మత్స్యకారులకు అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 27°C నుండి 40°C వరకు నమోదయ్యాయి. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. ఉత్తర కోస్తా, రాయలసీమలో కూడా బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. ఏపీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36°C వరకు ఉండే అవకాశం ఉంది. తేమ శాతం ఉత్తరాంధ్రలో 58% కాగా, కోస్తాంధ్ర, రాయలసీమల్లో 42% గా ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలు, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 13 నుండి 15 వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు వెళ్లొద్దని ఐఎమ్‌డీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

66
పసిఫిక్ మహాసముద్రంలో తుపాను
Image Credit : Gemini

పసిఫిక్ మహాసముద్రంలో తుపాను

ఇక ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పులను చూస్తే.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన 8 అల్పపీడనాల్లో ఒకటి తుపానుగా మారి దానికి '01C' అని పేరు పెట్టారు. ఇది గంటకు 65 కిమీ వేగంతో తిరుగుతూ మరింత బలపడుతోంది. ఎల్ నినో ప్రభావం వల్ల వేడి తీవ్రత కూడా ఎక్కువే ఉంది. భారత్‌లో భారీ వర్షాలు పడాలంటే అరేబియా సముద్రంలో గానీ, బంగాళాఖాతంలో గానీ శక్తివంతమైన తుపాను లేదా వాయుగుండం ఏర్పడాల్సి ఉంది. ప్రస్తుతం మాల్దీవులకు దక్షిణంగా హిందూ మహాసముద్రంలో ఒక ఆవర్తనం తయారవుతోంది, ఇది కనుక తుపానుగా మారి మన దేశం వైపు వస్తే రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Recommended image2
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో డేంజర్ గాలులు
Related Stories
Recommended image1
iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
Recommended image2
Konaseema: కేరళ కాదు గురూ.. మన ఏపీలోని ఈ రివర్ ప్యారడైజ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved