MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఉచితంగా బైక్‌లు, స్కూటీలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఉచితంగా బైక్‌లు, స్కూటీలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే

Telangana: తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీల ఆర్థిక సాధికారతకు మరో కీలక అడుగు వేసింది. స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో బైక్‌లు, స్కూటీలు, ఈ-స్కూటీలు, కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్ల కోసం కొత్త ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 05 2026, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రిస్టియన్ మైనార్టీల కోసం కొత్త స్వయం ఉపాధి పథకం
Image Credit : Gemini AI

క్రిస్టియన్ మైనార్టీల కోసం కొత్త స్వయం ఉపాధి పథకం

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మహిళలు, యువత తమ సొంత ఉపాధిని ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కుట్టు మిషన్లు, మోటార్ బైక్‌లు, స్కూటీలు, ఈ-స్కూటీలు, చిన్న వ్యాపార యూనిట్లను అర్హులైన లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు స్వయం ఉపాధికి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆన్‌లైన్ దరఖాస్తులు ఎలా చేసుకోవాలి?
Image Credit : our own

ఆన్‌లైన్ దరఖాస్తులు ఎలా చేసుకోవాలి?

దరఖాస్తు ప్రక్రియ జూలై 3 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు జూలై 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ప్రారంభించిన TS OBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. సందేహాల నివృత్తి కోసం 040-23391067 హెల్ప్‌లైన్‌ను కూడా అందుబాటులో ఉంచారు.

Related Articles

Related image1
ఒకే రైల్వే స్టేషన్.. రెండు రాష్ట్రాలు.. ఒక బెంచ్‌పై కూర్చుంటే ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్టే!
Related image2
IT: ఇక హైద‌రాబాద్‌, చెన్నై వెళ్లాల్సిన ప‌నిలేదు.. సాఫ్ట్‌వేర్‌కి అడ్డాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌రో న‌గ‌రం
35
అర్హతలు ఏమిటి?
Image Credit : Gemini AI

అర్హతలు ఏమిటి?

పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిమితి రూ.1.50 లక్షలు. కుట్టు మిషన్, చిన్న వ్యాపార యూనిట్ల కోసం దరఖాస్తు చేసే వారి వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. బైక్, స్కూటీ, ఈ-స్కూటీ వంటి రవాణా యూనిట్ల కోసం దరఖాస్తు చేసే వారి వయస్సు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

45
పారదర్శక ఎంపిక.. యువతకు ప్రాధాన్యం
Image Credit : Meta AI

పారదర్శక ఎంపిక.. యువతకు ప్రాధాన్యం

లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. అర్హత ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే ఎంపిక చేపడతారు. ముఖ్యంగా స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందాలనుకునే యువత, మహిళలకు ఈ పథకం మంచి అవకాశంగా అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీ కుటుంబాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ సూచించింది.

55
ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం లక్ష్యం
Image Credit : Meta AI

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం లక్ష్యం

ఈ పథకం ద్వారా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బైక్‌లు, స్కూటీలు, చిన్న వ్యాపార యూనిట్లు, కుట్టు మిషన్ల ద్వారా ఆదాయ వనరులు పెంచుకుని ఆర్థికంగా బలోపేతం కావచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీల జీవనోపాధిని మెరుగుపరచడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
అనుముల రేవంత్ రెడ్డి

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. మరో రెండు భారీ ప్రాజెక్టులు.. ఈ ప్రాంతాల రూపురేఖలు మారబోతున్నాయి !
Recommended image2
కేసీఆర్ టీఆర్ఎస్, కేటీఆర్ బిఆర్ఎస్ vs కవిత టీఆర్ఎస్ .. రసవత్తరంగా కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ పంచాయితీ
Recommended image3
Telangana: తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ రోశ‌య్య స‌ల‌హాలిచ్చారు: మంత్రి వివేక్
Related Stories
Recommended image1
ఒకే రైల్వే స్టేషన్.. రెండు రాష్ట్రాలు.. ఒక బెంచ్‌పై కూర్చుంటే ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్టే!
Recommended image2
IT: ఇక హైద‌రాబాద్‌, చెన్నై వెళ్లాల్సిన ప‌నిలేదు.. సాఫ్ట్‌వేర్‌కి అడ్డాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌రో న‌గ‌రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved