- Home
- Telangana
- Telangana Bandh : అధికార పార్టీ కీలక నిర్ణయం... శనివారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు కన్ఫర్మ్?
Telangana Bandh : అధికార పార్టీ కీలక నిర్ణయం... శనివారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు కన్ఫర్మ్?
Telangana Bandh : బిసి జేఏసి చేపట్టిన తెలంగాణ బంద్ కు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో విద్యాసంస్థలకు శనివారం సెలవు కన్ఫర్మ్ అయినట్లే… అంటే రేపు ఒక్కరోజే విద్యాసంస్థలు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే.

తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ మద్దతు
Telangana Bandh : బిసి రిజర్వేషన్ల పెంపును అడ్డుకోడాన్ని నిరసిస్తూ బిసి జేఏసి తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. అక్టోబర్ 18న అంటే వచ్చే శనివారం బిసి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించాయి... దీనికి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపిలతో పాటు మావోయిస్ట్ పార్టీ కూడా బిసిలకు మద్దతుగా నిలుస్తూ బంద్ లో పాల్గొననున్నట్లు ప్రకటించాయి... ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపింది. బిసి జేఏసి చేపట్టనున్న బంద్ కు మద్దతిస్తున్నట్లు.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
సంపూర్ణ తెలంగాణ బంద్
అధికారపార్టీ బంద్ కు మద్దతివ్వడం అంటే ప్రభుత్వం కూడా బంద్ కు సహకరిస్తున్నట్లే. కాబట్టి కాంగ్రెస్ ప్రకటనతో తెలంగాణ బంద్ కు మరింత బలం వచ్చినట్లయ్యింది. అధికార పార్టీ మద్దతులో బంద్ జరగనున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలతో పాటు ఆఫీసులు మూతపడే అవకాశాలున్నాయి. ఆర్టిసి బస్సులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోయి రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. మొత్తంగా బిసి సంఘాల తెలంగాణ బంద్ రాజకీయ పార్టీలన్ని మద్దతుతో సక్సెస్ కానుందని అర్థమవుతోంది.
ఎందుకు తెలంగాణ బంద్?
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కులగణన చేపట్టి బిసి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించింది. విద్యా, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ బిసిలకు రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. అయితే ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఓ జీవోను తీసుకువచ్చింది. ఈ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ కూడా జారీచేసింది... కానీ బిసి రిజర్వేషన్ల పెంపు జీవో చెల్లదని హైకోర్ట్ తేల్చింది. దీంతో ఎన్నికలు ఆగిపోయాయి. సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకుండా పోయింది.
ఇలా బిసి రిజర్వేషన్ల పెంపుకు న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడుతుండటంతో బిసి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ హక్కులను కాపాడుకోడానికి ఎంత దూరమైన వెళతామని... ఏ వ్యవస్థతో అయినా పోరాడేందుకు సిద్దమని అంటున్నారు. ఇలా బిసి రిజర్వేషన్ల పెంపును అడ్డుకోడం తమ హక్కులను కాలరాయడమే అంటూ బిసి సంఘాలు ఆందోళనలకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగానే అక్టోబర్ 18న రాష్ట్రాన్ని స్తంభింపజేసేందుకు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది బిసి జేఏసి.
శనివారం సెలవు ప్రకటిస్తున్న విద్యాసంస్థలు
తెలంగాణ బంద్ నేపథ్యంలో ఈ శనివారం విద్యాసంస్థలను నడపడం కష్టమని కొన్ని విద్యాసంస్థల నిర్వహకులకు అర్థమయినట్లుంది... అందుకే అధికారికంగా సెలవు ప్రకటిస్తున్నారు. ఇలా హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల పేరెంట్స్ కు సెలవు సమాచారాన్ని అందిస్తున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు సెలవుపై రేపు(శుక్రవారం) నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
తెలంగాణ బంద్ ను పట్టించుకోకుండా స్కూళ్లు నడిపినా బిసి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మూసివేయించే అవకాశాలున్నాయి. అంతేకాదు ధర్నాలు, రాస్తారోకోల కారణంగా విద్యాసంస్థలకు వెళ్లరావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు. ఇలా గందరగోళ పరిస్థితుల మధ్య స్కూళ్లు, కాలేజీలు సజావుగా నడిచే అవకాశాలులేవు.
వరుసగా మూడ్రోజులు సెలవులు?
దీపావళి సెలవులకు ఈ తెలంగాణ బంద్, ఆదివారం సెలవులు కలిసివస్తున్నాయి. ఈ శనివారం నుండి సోమవారం వరకు విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. అక్టోబర్ 20న దీపావళి... ఆరోజు విద్యాసంస్థలు, ఆఫీసులకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. దీనికి ముందురోజు అక్టోబర్ 19 ఆదివారం సాధారణ సెలవుంది. ఈరోజు నరక చతుర్దని సందర్భంగా ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఇచ్చింది ప్రభుత్వం... కానీ దీని అవసరం లేకుండానే సెలవు వచ్చింది.
ఇక శనివారం (అక్టోబర్ 18న) తెలంగాణ బంద్ సందర్భంగా మరో సెలవు కలిసివస్తోంది. దీంతో దీపావళికి మొత్తం సెలవుల సంఖ్య మూడ్రోజులకు చేరింది. ఈ మూడురోజులు కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి పండగను ఉత్సాహంగా జరుపుకునేందుకు విద్యార్థులు సిద్దమవుతున్నారు... భారీగా టపాసులను రెడీ చేసుకుంటున్నారు.