- Home
- Telangana
- School Holidays : విద్యాసంస్థలకు ఏకంగా 12 రోజుల దీపావళి సెలవులు.. అక్టోబర్ 24న తిరిగిప్రారంభం
School Holidays : విద్యాసంస్థలకు ఏకంగా 12 రోజుల దీపావళి సెలవులు.. అక్టోబర్ 24న తిరిగిప్రారంభం
School Holidays : ఓ రాష్ట్రంలో దసరా పండక్కి మొదలైన సెలవులు దీపావళితో ముగియనున్నాయి. మరోరాష్ట్రంలో ఏకంగా 12 రోజులు దీపావళి సెలవులు ఇచ్చారు. ఇలా ఈ పండగల సీజన్ లో విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి.

దీపావళికి సెలవులే సెలవులు
School Holidays : ప్రస్తుతం భారతదేశంలో పండగల సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే వినాయక చవితి, దసరా పండగలు ముగియగా దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండగలు ఈ రెండుమూడు నెలల్లోనే ఉన్నాయి. ఈ పండగల నేపథ్యంలో విద్యాసంస్థలకే కాదు ఉద్యోగులకు వరుస సెలవులు వస్తున్నాయి. దసరా పండక్కి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు పదిపదిహేను రోజులు సెలవులు వచ్చాయి. ఇలా వివిధ పండగలు, మరికొన్ని ప్రత్యేక కారణాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో వరుస సెలవులు వస్తున్నాయి.
దీపావళికి 12 రోజుల సెలవులు... ఎక్కడో తెలుసా?
ప్రాచీన నగరాలు, పర్యాటక ప్రాంతాలకు నిలయం రాజస్ధాన్... ఇక్కడ దీపావళి పండగను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. రాజస్థాన్ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో పూజాకార్యక్రమాలు జరుపుకుంటారు... టపాసులు కాలుస్తూ చిన్నాపెద్ద ఆనందంగా గడుపుతారు. ఇలా దీపావళి వేడుకల నేపథ్యలో రాజస్థాన్ లో ఏకంగా పదిరోజులు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఇవాళ (అక్టోబర్ 13, సోమవారం) నుండి అక్టోబర్ 24 (శుక్రవారం) వరకు సెలవులు ఇచ్చారు. ఇలా దీపావళికి రాజస్థానీలకు 12 రోజులు సెలవులు రానున్నాయి.
దసరా నుండి దీపావళి వరకు... దాదాపు నెలరోజుల సెలవులు
కర్ణాటకలో దసరా చాలా పెద్దపండగ. దీంతో సెప్టెంబర్ 20 నుండి సెలవులు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అయితే అక్టోబర్ 2న దసరా పండగ ముగిసినా ఇంకా స్కూళ్లు ప్రారంభంకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'కుల గణన' నేపథ్యంలో అక్టోబర్ 8 నుండి నుండి 18 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది సిద్దరామయ్య ప్రభుత్వం. స్కూల్ టీచర్లను ఈ సర్వే కోసం ఉపయోగిస్తుండటంతో విద్యార్థులకు సెలవులు ఇచ్చారు.
ఇలా కర్ణాటకలో దసరా, దీపావళి పండగలకు దాదాపు నెలరోజులు సెలవులు వస్తున్నాయి. అక్టోబర్ 18 వరకు సెలవులే... 19న ఆదివారం, 20న దీపావళి సెలవులు... కాబట్టి తిరిగి 21 కర్ణాటకలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల మాదిరిగా విద్యార్థులకు నెల రోజులు సెలవు రావడంతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక్కడ దీపావళికి ఐద్రోజుల సెలవులు
ఉత్తర ప్రదేశ్ లో కూడా దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటారు... కాశీ, అయోధ్య వంటి నగరాల్లో ప్రభుత్వం ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తుంది. అందుకే యూపీలోని విద్యాసంస్థలకు నాలుగు రోజులు (అక్టోబర్ 20,21,22,23) సెలవు ప్రకటించింది యోగి సర్కారు. ఇక అక్టోబర్ వచ్చే సోమవారం నుండి గురువారం వరకు సెలవులున్నాయి... ఎలాగు అక్టోబర్ 19 ఆదివారమే కాబట్టి మరో సెలవు అదనం. ఇలా యూపీ విద్యాసంస్థలకు మొత్తం ఐదురోజులు దీపావళి సెలవులు వస్తున్నాయి.
తెలంగాణలో దీపావళి సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
తెలంగాణలో దీపావళికి అక్టోబర్ 20న అధికారిక సెలవు ఉంది. అయితే ముందురోజు అక్టోబర్ 19 ఆదివారమే కాబట్టి ఓ సెలవు కలిసివస్తోంది. ఇక అక్టోబర్ 19 తెలంగాణ బిసి సంఘాలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి... దీంతో విద్యాసంస్థలు మూతపడే అవకాశాలున్నాయి. అన్ని విద్యాసంస్థలు కాకున్నా కొన్నింటికైనా అక్టోబర్ 18న శనివారం సెలవు ఉండే అవకాశాలున్నాయి. ఇలా మరో సెలవు కలిసివస్తోంది. మొత్తంగా దీపావళికి తెలంగాణ విద్యార్థులకు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో దీపావళి సెలవులు
మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ దీపావళికి అక్టోబర్ 20న ఒక్కరోజే సెలవు. అక్టోబర్ 19 ఆదివారం కావడంతో మరో సెలవు కలిసివచ్చి పండక్కి రెండ్రోజులు వస్తున్నాయి. ఇలా చాలారాష్ట్రాల్లో దీపావళి కనీసం రెండ్రోజులే సెలవులున్నాయి... రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మాత్రం విద్యాసంస్థలకు భారీగా సెలవులు ఉన్నాయి.