MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana Elections 2023 : బిసి సీఎంను ప్రకటించేది ప్రధానేనా... ఆ ఇద్దరిలో ఒకరి పేరు కన్ఫర్మ్ అట?

Telangana Elections 2023 : బిసి సీఎంను ప్రకటించేది ప్రధానేనా... ఆ ఇద్దరిలో ఒకరి పేరు కన్ఫర్మ్ అట?

ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బిసిని సీఎం చేస్తామని ప్రకటించగా... బిజెపి బిసి సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించనున్నట్లు సమాచారం. 

Arun Kumar P | Updated : Nov 05 2023, 11:02 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Telangana Assembly

Telangana Assembly

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి బిసి నినాదం ఎత్తుకుంది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు బిజెపికి రాష్ట్రాన్ని పాలించే అవకాశమిస్తే బిసిని ముఖ్యమంత్రి చేస్తామని... బిసి సబ్ ప్లాన్ అమలుచేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బిసి సీఎం అభ్యర్థి ఎవరో కూడా ప్రకటించేందుకు బిజెపి సిద్దమైనట్లు తెలుస్తోంది.
 

26
Modi

Modi

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూర్యాపేట సభలో పాల్గొని బిసి సీఎం ప్రకటన చేసారు. ఈ బిసి సీఎం హామీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు బిజెపి మరో వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 7న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో బిజెపి తలపెట్టిన 'బిసి గర్జన' సభలో పాల్గొననున్నారు. ఈ వేదిక పైనుండే బిజెపి బిసి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రధాని ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై బిజెపి నాయకులెవరూ స్పందించకున్నా రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. 

36
PM Modi

PM Modi

తెలంగాణలో 50 శాతానికి పైగా వున్న బిసిలను తమవైపు తిప్పుకుంటే రాష్ట్ర రాజకీయాలను శాసించవచ్చని బిజెపి భావిస్తోంది. ఇందుకోసమే అసెంబ్లీ ఎన్నికల్లో బిసిలనే ప్రధానఅస్త్రంగా వాడుకుంటోంది. ఓ బిసిని దేశ ప్రధానిని చేసిన ఘనత బిజెపిదని... అవకాశమిస్తే తెలంగాణలో కూడా ఓ బిసి సీఎంను చేస్తామని చెబుతున్నారు.   

46
Eatala Rajender

Eatala Rajender

బిసి సీఎం ప్రకటన తర్వాత తెలంగాణ బిజెపిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అత్యధికంగా వున్న ముదిరాజ్ సామాజికవర్గం తమ వర్గానికి చెందిన ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. స్వయంగా రాజేందర్ భార్య జమున తన భర్తను ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారంటున్నారని అంటున్నారు. ఇటీవల హుజురాబాద్ లో భర్తకు మద్దతుగా ప్రచారం చేపట్టిన ఈటల జమున ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.  
 

56
KCR Eatala

KCR Eatala

అయితే బిజెపి అదిష్టానం కూడా రాజకీయ అనుభవం, కేసీఆర్ ను ఢీకొట్టే సత్తావున్న ఈటల రాజేందర్ కు వుందని నమ్ముతోందట. దీంతో బిసి సీఎం అభ్యర్థిగా ఆయనను ప్రకటించే అవకాశం వుందని ప్రజల్లోనూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటలను బరిలోకి దింపడంద్వారా బిజెపి బిసి సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై అదిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు. 
 

66
Bandi Sanjay

Bandi Sanjay


ఇక బిజెపి బిసి సీఎం అభ్యర్థుల జాబితాలో వినిపిస్తున్న పేరు బండి సంజయ్. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా పనిచేసి పార్టీకి ఊపు తీసుకువచ్చిన సంజయ్ కి సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే ఎలా వుంటుందన్నదానిపై అదిష్టానం ఆలోచిస్తోందట. అయితే ఆయనను వ్యతిరేకించే బిజెపి సీనియర్ల బ్యాచ్ దీన్ని వ్యతిరేకించే అవకాశాలు వుండటంతో ఈటల రాజేందర్ నే బిసి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
హైదరాబాద్
నరేంద్ర మోదీ
 
Recommended Stories
Revanth Reddy: కులం కాదు, విద్యనే గొప్పతనం తీసుకొస్తుంది.. సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కులం కాదు, విద్యనే గొప్పతనం తీసుకొస్తుంది.. సీఎం రేవంత్ రెడ్డి
Trump: ట్రంప్ నిర్ణ‌యంతో మారుతోన్న తెలుగు విద్యార్థుల ఆలోచ‌న‌.. అమెరికా వ‌ద్దంటే..
Trump: ట్రంప్ నిర్ణ‌యంతో మారుతోన్న తెలుగు విద్యార్థుల ఆలోచ‌న‌.. అమెరికా వ‌ద్దంటే..
కవితతో కొత్తపార్టీ పెట్టిస్తున్నదే కేసీఆరా..? ఇంతకూ ఆయన కొడుకుసైడా, కూతురుసైడా?
కవితతో కొత్తపార్టీ పెట్టిస్తున్నదే కేసీఆరా..? ఇంతకూ ఆయన కొడుకుసైడా, కూతురుసైడా?
Top Stories