MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్..

వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్..

Telangana, Andhra Pradesh Weather Update: భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం ఒడిశా తీర ప్రాంతానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   

2 Min read
Author : Rajesh K
Published : Aug 19 2025, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తడిసి ముద్దవుతున్న తెలంగాణ
Image Credit : Hyderabad Rains/X

తడిసి ముద్దవుతున్న తెలంగాణ

Weather Update: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం తెలిపినట్లే, కాసేపట్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం వాయుగుండం తీరాన్ని దాటేటప్పుడు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈ పాంత్రాల్లో భారీ వర్ష సూచన
Image Credit : X/Hyderabad Traffic Police

ఈ పాంత్రాల్లో భారీ వర్ష సూచన

వాతావరణ కేంద్రం ప్రకారం, మంగళవారం రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి. రెండు రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని, ఆగస్టు 21న చాలా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఆగస్టు 22-24 వరకు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, దాని పొరుగు జిల్లాలలో రాబోయే 24 నుండి 48 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది.

36
ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Image Credit : ANI

ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక రేపు ( బుధవారం) ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడి ఉంటాయి. గరిష్టంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

46
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
Image Credit : Getty

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

  • భారీ వర్షాల నేపథ్యంలో జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఐదు చోట్ల వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. 
  • జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
  • ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.
56
కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు
Image Credit : X/Hyderabad Police

కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ఈ రోజు( మంగళవారం) మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో నేడు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

66
మరో అల్పపీడనం
Image Credit : Getty

మరో అల్పపీడనం

ఇక 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో సముద్రం అలజడి ఉండటంతో మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లరాదని  విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం సూచించింది. 

కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 

పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వరద పెరుగుతున్నందున, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు, కాలువలు దాటేందుకు ప్రజలు ప్రయత్నించరాదని  సూచించారు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
తెలంగాణ
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు..
Recommended image2
Weather Update: ఐఎండీ అలర్ట్ .. మళ్లీ ముంచెత్తే వానలు! ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved