- Home
- Telangana
- Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు..
Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు..
Telangana, Andhra Pradesh Weather Report : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విజృంభిస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

పిడుగులతో కూడిన వర్షాలు
Weather Report : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడేందుకు అనుకూల వాతావరణం తయారైంది. నైరుతి రుతు ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ పుంజుకున్నాయి. ఆగస్టు మొదటి వారంలో తేలికపాటి వర్షాలు కురిసిన ఇప్పుడు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం, రాయలసీమ, తూర్పు తీర ప్రాంతాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతుండగా, తదుపరి రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే.. వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో గాలులు, మెరుపులు, పిడుగులు కనిపించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో పరిస్థితిలా..
తెలంగాణలో మళ్లీ వర్షాలు పడేందుకు అనుకూల వాతావరణం తయారైంది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న రెండు రోజుల్లో అంటే.. ఆగస్టు 6 నుండి 9వ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో తీవ్ర వర్షాలు 7 - 11 సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా. రాయలసీమ, కోస్తా ప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ వాయువ్య, దక్షిణ ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా బులిటిన్ ప్రకారం గత 24 గంటల్లో భువనగిరి జిల్లా 9 సెం.మీ, పోచంపల్లిలో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా తూర్పు తీరప్రాంతాలు, రాయలసీమపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా ప్రెస్ నోట్ ప్రకారం.. గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలోని రుందవరంలో 9 సెం.మీ, అళూరు, చిత్తూరులో 8 సెం.మీ, అనంతపురంలోని గుంటకల్ లో 7 సెం.మీ ల వర్షపాతం నమోదైంది. అలాగే..
తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మరో మూడు రోజులు అంటే.. ఆగస్టు 6 నుంచి 9 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే.. సముద్ర తీరం వెంబడి 40-50 కి.మీ/గంట వేగంతో గాలులు వీసే అవకాశం అవకాశముంది.
ఇతర రాష్ట్రాల్లోనూ
భారత వాతావరణ శాఖ ప్రకారం రానున్న 5 రోజుల పాటూ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీప్, కేరళ, యానాం, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే.. ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఆగస్టు 7న ( నేడు) తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9వ తేదీ వరకూ.. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.
వాతావరణ శాఖ హెచ్చరిక
ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో వాయు గుండం ఏర్పడటం, అరేబియా సముద్రంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం భూమధ్య రేఖ వైపు పయనిస్తోంది. ఐతే.. వీటి వల్ల గాలుల్లో కదలిక బాగా ఉంది. మేఘాలు పరుగులు పెడుతున్నాయి. అందువల్ల దక్షిణ భారత రాష్ట్రాల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం తయారైంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచే అవకాశం ఉందనీ, అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లమని సూచించింది. ఆగస్టు 11 వరకు సముద్రంలోకి వెళ్ళవద్దని మత్స్యకారులను హెచ్చరించింది.