MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • Telangana Weather : ఈ వారం తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? వర్షాల సంగతేంటి?

Telangana Weather : ఈ వారం తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? వర్షాల సంగతేంటి?

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో గతవారం వర్షాలు దంచికొట్టాయి. మరి ఈవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందా? వాతావరణం ఎలా ఉంటుంది? ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 28 2025, 08:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాాష్ట్రాల్లో ఈవారం వర్షాల పరిస్థితేంటి?
Image Credit : X/Cyberabad Traffic Police

తెలుగు రాాష్ట్రాల్లో ఈవారం వర్షాల పరిస్థితేంటి?

Andhra Pradesh and Telangana Weather Updates : ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురిశాయి. వారం పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు నేల తడిసింది. వర్షాకాలం మొదలైన నెల నెలన్నర రోజులు వానలు కురవకపోవడంతో ప్రజలు కంగారుపడ్డారు... ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వారికి ఊరటనిచ్చాయి. మరీముఖ్యంగా తెలుగు రైతుల ముఖాల్లో చిరునవ్వు నింపాయి ఈ వర్షాలు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో జులై 17 నుండి వర్షాలు జోరందుకున్న విషయం తెలిసిందే. ఇరురాష్ట్రాల్లోనూ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసి నదులు, వాగులువంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. చాలాప్రాంతాల్లో రోడ్లు, వంతెనపైనుండి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు మునగడం, వరదనీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు ఎదురయ్యాయి.

ఇలా గతవారం భారీ వర్షాలతో ముగిసింది... మరి ఈవారం వర్షాల పరిస్థితేంటి? తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణం ఎలా ఉంటుంది? ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లోని జలాశయాల పరిస్థితేంటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

DID YOU
KNOW
?
తెలంగాణలో వర్షాల లోటు తీరిపోయింది
తెలంగాణాలో ఇప్పటివరకు సగటున 324.4 మిల్లిమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఆదివారం వరకు 324.8 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. అంటే రాష్ట్రంలో లోటు వర్షపాతం లేదన్నమాట.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణలో ఈవారం (జులై 28 - ఆగస్ట్ 02) వాతావరణం :
Image Credit : Mudit Jain /X

తెలంగాణలో ఈవారం (జులై 28 - ఆగస్ట్ 02) వాతావరణం :

తెలంగాణలో గత వారమంతా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిశాయి. అయితే నిన్నటినుండి(జులై 27) వాతావరణ మారిపోయింది... వర్షాలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ తో సహా చాలా జిల్లాల్లో ఆదివారం వర్షాల జాడలేదు... కొన్నిచోట్ల మాత్రం చెదురుమదురు జల్లులు కురిశాయి. ఇదే పరిస్థితి ఇవాళ (సోమవారం) కూడా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో వారంరోజులు చిరుజల్లులు మినహా భారీ వర్షాలుండవని ప్రకటించారు.

ఇక జులైలో వర్షాలు ముగిసినట్లే... ఆగస్ట్ సెకండ్ వీక్ లో మళ్లీ భారీవర్షాలుంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఆగస్ట్ 9-12 తర్వాత తెలంగాణవ్యాప్తంగా మళ్ళీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. అప్పటివరకు చిరుజల్లులే ఉంటాయని వెల్లడించారు.

35
తెలంగాాణలో సహాయచర్యలకు నిధులు విడుదల
Image Credit : Sandeep/X

తెలంగాాణలో సహాయచర్యలకు నిధులు విడుదల

ఇదిలాఉంటే ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైన సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.33 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అత్యవసర పనుల కోసం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ నిధులను వినియోగించుకోవచ్చు.

45
నేడు ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం
Image Credit : Getty

నేడు ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇక జులైలో భారీవర్షాలు కురిసే అవకాశాలు లేవని… చిరుజల్లులే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇవాళ(సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. మిగతాజిల్లాల్లో పొడి వాతావరణమే ఉంటుందని వెల్లడించింది. ఈ నెలంతా ఇదే వాతావరణం ఉంటుందని... తిరిగి ఆగస్ట్ లో వర్షాలు మొదలవుతాయని తెలిపింది.

55
తెలుగు రాష్ట్రాల జలాశయాల పరిస్థితి ఇదే
Image Credit : Getty

తెలుగు రాష్ట్రాల జలాశయాల పరిస్థితి ఇదే

ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని జలాశయాలు నిండిపోయాయి... దీంతో గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరదనీరు చేరుతోంది... ఇన్‌ఫ్లో 10 వేల క్యూసెక్కులుగా ఉంది. నిజాంసాగర్, పోచారం, కళ్యాణి ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది.

ఆంధ్ర ప్రదేశ్ లోని ధవళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి వరద ప్రవాహం పెరిగింది. దీంతో 175 గేట్లు ఎత్తి 5.49 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం దగ్గర నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది.

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది... ప్రస్తుతం ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,18,274 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 93,115 క్యూసెక్కులుగా ఉంది.

జూరాల ప్రాజెక్టుకు కూడా వరద పెరుగుతోంది. దీంతో 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.08 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 93,962 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.650 మీటర్లకు చేరుకుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image2
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image3
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Related Stories
Recommended image1
Rain Alert: తీరం దాటిన వాయు గుండం.. వ‌చ్చే 4 రోజులు ఈ ప్రాంత వాసులు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. వాన‌లే వాన‌లు
Recommended image2
Rain Alert : తెలంగాణలో అప్పటివరకు వర్షాలు తగ్గేదేలే... ఈ జిల్లాల ప్రజలు బిఅలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved