Telangana Weather: కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఇక వర్షాలే వర్షాలు.. ఐఎండీ ఏం చెప్పిందంటే?
Andhra Pradesh,Telangana Weather Update: ఆగస్టు రెండో వారం నుండి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది

వాతావరణంలో భారీ మార్పు
ఒక్కసారిగా వాతావరణంలో భారీ మార్పు చోటు చేసుకుంది. భారీ వర్షాలు కురిసేలా వాతావరణం అత్యంత వేగంగా మారిపోయింది. అండమాన్ సముద్రంలో అల్పపీడనం, అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులపాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఉందట. దీనిపై భారత వాతావరణ శాఖ ఏం చెప్పిందో చూద్దాం.
5 రోజులపాటూ వర్షాలే వర్షాలు
వాతావరణ శాఖ ( IMD )అంచనా ప్రకారం.. రానున్న 5 రోజులపాటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 5వ తేదీన రాయలసీమలో అతి భారీ వర్షం పడుతుంది. అదే రోజున తమిళనాడులో అతి భారీ వర్షం కురుస్తుంది. ఇంక కర్ణాటక, తమిళనాడు, యానాం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట.
తెలంగాణలో వాతావరణం ఎలా ఉందంటే?
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆగస్టు 4 నుంచి 7 వరకు తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందట. తెలంగాణలో నేడు 33 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. ఉదయం పూట ఎండ, మేఘాలతో వాతావరణం ఉంటుంది. అలాగే ఉదయం గాలిలో 59 శాతం, రాత్రి 86 శాతం తేమ ఉంటుందట. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉండొచ్చని IMD హెచ్చరిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచన.
ఏపీలో ఇక వర్షాలే వర్షాలు
ఏపీలో కూడా ఇవాల్టీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశం మేఘాలలో నిండి ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉందట. ఏపీలో 35 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత నమోదు కాగా.. ఉదయం వేళ 51 శాతం , రాత్రివేళ 83 శాతం తేమ ఉంటుంది. ఇక రాయలసీమలో మోస్తరు వర్షం పడుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. . కోస్తాంధ్ర, విశాఖలో సాయంత్రం నుంచి రాత్రి వరకూ.. అక్కడక్కడా తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉంది.
తీర ప్రాంతం పై ఎఫెక్ట్
ఆంధ్రప్రదేశ్ లోని తీర పాంత్రాల్లో ఆగస్ట్ 05 నుంచి 7 వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్ సముద్రంలో అల్పపీడనం, అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం కారణంగా గాలి వేగం గంటకు 40–50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
మత్స్యకారులకు హెచ్చరిక: ఆగస్ట్ 4 నుంచి 7 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం లో అలలు బలంగా ఉండే అవకాశం ఉంది.
వాతావరణం మార్పుకు కారణమదేనా ?
సంక్షిప్తంగా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్లనే వాతావరణంలో ఒక్కసారిగా భారీ మార్పు జరిగింది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని IMD హెచ్చరించింది. మరోవైపు తూర్పు, ఈశాన్య, దక్షిణ, మధ్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.