MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • Summer Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే న్యూస్.. ఎక్స్ట్రాగా మరో వారం వేసవి సెలవులు, ఎప్పటినుండి ఎప్పటివరకు?

Summer Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే న్యూస్.. ఎక్స్ట్రాగా మరో వారం వేసవి సెలవులు, ఎప్పటినుండి ఎప్పటివరకు?

Summer Holidays 2026 : తెలుగు విద్యార్ధులకు వేసవి సెలవులు పెరిగాయి. మరో వారంరోజులు ఎక్స్ట్రాగా సెలవులు వస్తున్నాయి. ఏఏ విద్యాసంస్థలకు సెలవులు పెరిగాయో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 01 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు..
Image Credit : Getty

తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు..

Summer Holidays : తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు పెరిగాయి. జూన్ నెలలోకి ఎంటర్ అయినా ఇంకా ఎండల తీవ్రత తగ్గడంలేదు... వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వేసవి సెలవులను పొడిగించారు. ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా వారం రోజులు ఎక్ట్రా సెలవులు వస్తున్నాయి. ఏఏ విద్యాసంస్థలకు ఎప్పటివరకు సెలవులు..? పెరిగిన సెలవులెన్ని..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ విద్యాసంస్థలకు సెలవులే సెలవులు...
Image Credit : Getty

ఈ విద్యాసంస్థలకు సెలవులే సెలవులు...

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణలోని కొన్ని యూనివర్సిటీల విద్యార్థులకు తాజాగా సెలవులు ముగిశాయి... ఇవాళ్టి (జూన్ 1, సోమవారం) నుండి కాలేజీలు రీఓపెన్ కావాలి. అయితే ఎండల తీవ్రత తగ్గకపోవడంతో వేసవి సెలవులను మరో వారం పొడిగించారు. దీంతో 6 నుండి 8 రోజుల సెలవులు ఎక్స్ట్రాగా వస్తున్నాయి.

తెలంగాణలోకి ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ, పిజితో పాటు ఇతర కాలేజీలకు వేసవి సెలవులు జూన్ 6 వరకు పొడిగించారు. తెలంగాణ యూనివర్సిటీ కూడా సెలవులు పొడిగించారు. అయితే జూన్ 7 ఆదివారం... కాబట్టి ఈ యూనివర్సిటీ కాలేజీలు జూన్ 8న అంటే వచ్చే సోమవారం తెరుచుకోనున్నాయి.

కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలకు కూడా సెలవులు పొడిగించారు. అయితే ఈ యూనివర్సిటీ విద్యార్థులకు జూన్ 5 వరకే సెలవులిచ్చారు... జూన్ 6న (శనివారం) కాలేజీలు ఓపెన్ అవుతాయి. ఈ ఒక్కరోజే నడిచాక మళ్లీ ఆదివారం సెలవులు వస్తుంది. కాబట్టి ఈ కాలేజీ విద్యార్థులు కూడా జూన్ 8 (సోమవారం) నుండి కాలేజీలకు హాజరయ్యే అవకాశం ఉంది.

Related Articles

Related image1
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Related image2
June Holidays : విద్యార్థులే కాదు ఉద్యోగులూ ఎగిరిగంతేసే మ్యాటర్.. వచ్చేనెల సెలవులే సెలవులు
34
కేవలం విద్యార్థులు, టీచర్లకే సెలవు...
Image Credit : Getty

కేవలం విద్యార్థులు, టీచర్లకే సెలవు...

తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు పొడిగించిన వేసవి సెలవులు విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ కి మాత్రమే వర్తించనున్నాయి. మిగతా నాన్ టీచింగ్, యూనివర్సిటీ ఉద్యోగులకు ఎలాంటి సెలవులు ఉండవని... యధావిధిగా విధులకు హాజరుకావాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు స్ఫష్టం చేశారు. కాలేజీల ప్రిన్సిపల్స్ కు కూడా పొడిగించిన సెలవులు వర్తించవు. 

44
స్కూళ్లకి సెలవుల పొడిగింపు ఉంటుందా..?
Image Credit : Getty

స్కూళ్లకి సెలవుల పొడిగింపు ఉంటుందా..?

తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళకి ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. మే మొత్తం సెలవులే... జూన్ 11 వరకు కొనసాగనున్నాయి. అంటే జూన్ 12 నుండి తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి.

అయితే ఒక్కరోజు స్కూళ్లు నడుస్తాయో లేదో మళ్ళీ వరుస సెలవులు రానున్నాయి. జూన్ 13న రెండో శనివారం, మే 14న ఆదివారం... ఈ రెండ్రోజులు సెలవులే. అంటే తెలుగు విద్యార్థులు జూన్ 15 నుండి స్కూల్ బాట పట్టనున్నారు... ఆరోజే అందరూ హాజరయ్యే అవకాశాలు ఉంటాయి.

అయితే నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైనా జూన్ 2వ వారం వరకు వర్షాలు ప్రారంభం అవుతాయి. ఇలా వర్షాలు మొదలైతే ఎండల తీవ్రత తగ్గుతుంది... వడగాలులు, ఉక్కపోత నుండి ఉపశమనం లభించనుంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకి వేసవి సెలవుల పొడిగింపు ఉండకపోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మంత్రి పదవి నుంచి తొలగించండి.. కొండా సురేఖ విష‌యంలో షాకింగ్ నిర్ణ‌యం
Recommended image2
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
Recommended image3
అసలేంటీ జీవో 97.. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? దీంతో ఏం జ‌రుగుతుంది?
Related Stories
Recommended image1
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Recommended image2
June Holidays : విద్యార్థులే కాదు ఉద్యోగులూ ఎగిరిగంతేసే మ్యాటర్.. వచ్చేనెల సెలవులే సెలవులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved