MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Cheapest Alcohol: ఆ చిన్నదేశాల్లో బ్రాండెడ్ మద్యం బాటిల్ ధర రూ.50 లోపే

Cheapest Alcohol: ఆ చిన్నదేశాల్లో బ్రాండెడ్ మద్యం బాటిల్ ధర రూ.50 లోపే

Cheapest Alcohol: మద్యం ధరలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం మద్యం చవకగా దొరుకుతుంది. ఒక బ్రాండెడ్ మద్యం బాటిల్ కేవలం రూ.45 నుంచి రూ.75లోపే లభిస్తుంది. ఏ దేశాల్లో ఇంత తక్కువ ధరకు మద్యం లభిస్తుందో తెలసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 03 2026, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మద్యం ధరలు
Image Credit : Getty

మద్యం ధరలు

మనదేశంలో మద్యపాన ప్రియులు ఎక్కువ. ప్రతి రోజూ ఆల్కహాల్ తాగనిదే కనీసం నిద్రపోరు. అంతగా మద్యపానానికి బానిసలుగా మారిపోయారు. ఎంతో మంది మద్యం తాగడాన్ని ఆస్వాదిస్తారు. కానీ మద్యం ధరల పెరుగుదలతో దాని కోసం అప్పులు చేసే వారి సంఖ్య అధికంగా ఉంది. మనదేశంలో బ్రాండెడ్ మద్య బాటిల్ కొనాలంటో వందల్లో, కొన్నిసార్లు వేలల్లో ఖర్చుపెట్టాల్సి వస్తుంది. 

24
మద్యం ధరలు అధికంగా ఉండే దేశాలు
Image Credit : Getty

మద్యం ధరలు అధికంగా ఉండే దేశాలు

మద్యం బాటిల్ ధరలు దేశ పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో మద్యం చాలా ఖరీదైన పానీయం. కొన్ని దేశాల్లో మాత్రం చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ప్రభుత్వాలు మద్యంపై వేసే పన్నులు ఆధారంగా మద్యం ధరలు నిర్ణయిస్తారు. నార్వే, ఐస్లాండ్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో మద్యం ధరలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే ఆ దేశాల్లోని ప్రభుత్వాలు భారీగా పన్నులు వేశాయి. ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు ఇలా భారీ పన్నులు వేసినట్టు చెబుతారు. ఇప్పుడు మద్యం ప్రియుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మీ స్నేహితులలో కనీసం ఒక్కరైనా మద్యం తాగే వ్యక్తి ఉంటారు. 

Related Articles

Related image1
Lord Shiva: ఈ 3 రాశులపై శివుని కృప.. మహాశివరాత్రి నుంచి ఆదాయం, ఆనందం రెట్టింపు
Related image2
Idli Batter: మల్లెపువ్వులాంటి మెత్తటి ఇడ్లీ కోసం పిండి ఇలా కలపండి
34
చీప్ లిక్కర్ తాగుతూ
Image Credit : Pixabay

చీప్ లిక్కర్ తాగుతూ

కొన్ని యూరోపియన్ దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో మాత్రం మద్యం ధరలు మధ్యస్థంగా ఉంటాయి. మరీ తక్కువ కాకుండా, అలా అని మరీ ఎక్కువ కాకుండా ఉంటాయి. ఇక మనదేశంలో మద్యం ధరలు రాష్ట్రాల వారీగా మారుతాయి. మద్యంపై పన్నులు విధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. కాబట్టి మద్యం బాటిల్ ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో చాలా ఖరీదుగా కూడా ఉండవచ్చు. గోవాలో మాత్రం మద్యం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అదే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మద్యం ధరలు ఎక్కువగా ఉంటాయి.

కొంతమంది 100 రూపాయల కన్నా తక్కువ ధరకు లభించే మద్యాన్ని తాగుతారు. నిజానికి అది చీప్ లిక్కర్. దీన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరు ధనవంతులు మాత్రం లక్షల రూపాయల విలువైన బాటిల్‌ను కొని మద్యం తాగుతూ ఉంటారు. కానీ మనదేశంలో విపరీతంగా మద్యం ధరలు పెరిగిపోతున్నాయి. అయినా తాగే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

44
మద్యం చవకగా దొరికే దేశాలు
Image Credit : Getty

మద్యం చవకగా దొరికే దేశాలు

ప్రపంచంలో మద్యం చాలా చవకగా దొరికే కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో వియత్నాం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో కేవలం 45 రూపాయలకే మద్యం బాటిల్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ఆఫ్రికా దేశమైన జాంబియాలో కూడా మద్యం ధర చాలా చవగా దొరుకుతుంది.

ఇక జాంబియాలో మద్యం బాటిల్ ధర కేవలం 75 రూపాయలు. ఉక్రెయిన్, వెనిజులా వంటి దేశాల్లో కూడా మద్యం చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అక్కడ మద్యం తయారుచేసే పద్ధతి, ఖర్చు తక్కువగా ఉండటం వల్ల అక్కడ మద్యం తక్కువ ధరకే లభిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Stock Market: 20 ఏళ్ల క్రితం రూ. ల‌క్ష పెట్టుబ‌డి పెట్టుంటే.. ఈరోజు మీ ద‌గ్గ‌ర రూ. 47 ల‌క్షలు ఉండేవి
Recommended image2
Agarwood : కిలో రూ. 1 కోటి.. బంగారం కంటే విలువైన లిక్విడ్ గోల్డ్ ! ఈ కలప ప్రత్యేకత ఏంటో తెలుసా?
Recommended image3
దిమాక్ ఖరాబ్ చేసే క్రేజీ ఫోన్‌.. 9000 mAh బ్యాట‌రీ, ధ‌ర ఎంతంటే.. వివరాలు ఇవిగో
Related Stories
Recommended image1
Lord Shiva: ఈ 3 రాశులపై శివుని కృప.. మహాశివరాత్రి నుంచి ఆదాయం, ఆనందం రెట్టింపు
Recommended image2
Idli Batter: మల్లెపువ్వులాంటి మెత్తటి ఇడ్లీ కోసం పిండి ఇలా కలపండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved