MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తెలంగాణ సర్కార్ కఠిన ఆదేశాలు.. ఆ వివ‌రాలు క‌చ్చితంగా తెల‌పాల్సిందే

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తెలంగాణ సర్కార్ కఠిన ఆదేశాలు.. ఆ వివ‌రాలు క‌చ్చితంగా తెల‌పాల్సిందే

Schools: తెలంగాణ‌లోని ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజుల విషయంలో పారదర్శకత తీసుకురావడానికి తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు నిర్మాణాన్ని స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించింది.

1 Min read
Author : Narender Vaitla
Published : Aug 07 2026, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఫీజు వివరాలు మూడు చోట్ల తప్పనిసరిగా ప్రదర్శించాలి
Image Credit : Asianet News

ఫీజు వివరాలు మూడు చోట్ల తప్పనిసరిగా ప్రదర్శించాలి

కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ తరగతి వారీ ఫీజు వివరాలను పాఠశాల నోటీస్ బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించాలి. అంతేకాకుండా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అదే సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. వీటితో పాటు విద్యాశాఖ నిర్వహిస్తున్న schooledu.telangana.gov.in పోర్టల్‌లో కూడా పూర్తి ఫీజు వివరాలను నమోదు చేయడం తప్పనిసరిగా పేర్కొంది. దీంతో తల్లిదండ్రులు ఎప్పుడైనా అధికారికంగా ఫీజు నిర్మాణాన్ని పరిశీలించే అవకాశం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఫీజు నిర్ణయానికి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాలి
Image Credit : X

ఫీజు నిర్ణయానికి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాలి

ఫీజులను ఎలా నిర్ణయించారో తెలిపే ఆధార పత్రాలను కూడా పాఠశాలలు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. గవర్నింగ్ బాడీ సభ్యుల ఆమోదంతో, వారి సంతకాలతో కూడిన ఫీజు నిర్ణయ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం G.O.Ms.No.1లోని రూల్ 16, రూల్ 18 నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఫీజు నిర్ణయం పారదర్శకంగా జరిగిందనే విషయాన్ని నిర్ధారించేందుకు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.

Related Articles

Related image1
4 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్‌.. "సోల‌పురం" పాట‌లో ఎంత అర్థం ఉందో తెలుసా?
Related image2
హైద‌రాబాద్‌లో కొత్త బ‌స్ ట‌ర్మిన‌ల్‌.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌కు చెక్
33
నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
Image Credit : X

నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు

ఫీజు వివరాలను నోటీస్ బోర్డు, వెబ్‌సైట్ లేదా విద్యాశాఖ పోర్టల్‌లో ప్రదర్శించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. తొలుత ఆయా విద్యాసంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నట్లు తెలిపింది. అనంతరం G.O.Ms.No.1లోని రూల్ 11 ప్రకారం అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల అమలును జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంయుక్త విద్యాశాఖ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించి, నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఏపీలో రెండ్రోజులు, తెలంగాణలో మూడ్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
Recommended image2
Now Playing
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మొదలైన భారీ వర్షాలు | AP & Telangana Rain Alert Today
Recommended image3
Hyderabad Real Estate : 100 ఎకరాల్లో కొత్త బస్ టెర్మినల్, ఇక్కడ రియల్ బూమ్ ఖాయం.. ఇప్పుడే స్థలమో, ఇల్లో కొనిపెట్టుకొండి
Related Stories
Recommended image1
4 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్‌.. "సోల‌పురం" పాట‌లో ఎంత అర్థం ఉందో తెలుసా?
Recommended image2
హైద‌రాబాద్‌లో కొత్త బ‌స్ ట‌ర్మిన‌ల్‌.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌కు చెక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved