- Home
- Telangana
- School Holidays : అన్ని స్కూళ్ళు, కాలేజీలకు నెక్ట్స్ రెండ్రోజులు సెలవులే.. ఈ మూడు తెలుగు జిల్లాల్లో తప్ప..!
School Holidays : అన్ని స్కూళ్ళు, కాలేజీలకు నెక్ట్స్ రెండ్రోజులు సెలవులే.. ఈ మూడు తెలుగు జిల్లాల్లో తప్ప..!
School Holidays : తెలుగు రాష్ట్రాల్లోని ఓ మూడు జిల్లాలకు తప్ప మిగతా జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వరుసగా నెక్ట్స్ టూడేస్ హాలిడేలే. ఈ మూడు జిల్లాలకే ఎందుకు సెలవులు క్యాన్సిల్ చేశారు? ఇంతకూ ఆ జిల్లాలేవి?

రేపు, ఎల్లుండి రెండ్రోజులు సెలవులే...
School Holidays : దేశవ్యాప్తంగా ప్రతి నెలలో రెండో శనివారం విద్యాసంస్థలు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే రేపు ఈ నెలలో (అక్టోబర్ 11) రెండో శనివారం వస్తోంది... కాబట్టి దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. సాధారణంగా అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ఉండాలి... కానీ తెలంగాణలోని ఓ మూడు జిల్లాలకు మాత్రం ఈసారి రెండో శనివారం సెలవు వర్తించడంలేదు. రేపు కేవలం మూడుజిల్లాల విద్యార్థులు, ఉద్యోగులకే ఎందుకు అధికారికంగా సెలవు ఇవ్వడంలేదో తెలుసుకుందాం.
రెండో శనివారం సెలవు క్యాన్సిల్
తెలంగాణ అత్యధికంగా విద్యాసంస్థలు ఉన్నది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోనే. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా ఈ జిల్లాల్లోనే చాలా ఎక్కువగా ఉంటారు. అలాంటి ఈ మూడు జిల్లాల్లోనే అక్టోబర్ 11న రెండో శనివారం సెలవును క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. దీంతో దసరా సెలవుల తర్వాత వచ్చిన ఈవారంలో వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తాయనుకున్న విద్యార్థులు, ఉద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి.
గత సెప్టెంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సెప్టెంబర్ 06న వినాయక నిమజ్జనం జరిగింది... ఈ వేడుకల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ సెలవును అక్టోబర్ లో వచ్చే రెండో శనివారం సెలవుతో భర్తీ చేస్తామని అప్పుడే ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే తెలంగాణవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, ఆఫీసులకు రేపు(శనివారం) సెలవున్నా ఈ మూడు జిల్లాల్లో మాత్రం లేదు.
అక్టోబర్ లో ఇంకెన్ని సెలవులున్నాయో తెలుసా?
ఈ నెలలో ఇవాళ్టితో సరిగ్గా పదిరోజులు పూర్తికావస్తున్నాయి... కానీ ఇందులో నాలుగైదురోజులు సెలవులకే పోయాయి. అక్టోబర్ 1,2,3 దసరా పండగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు కొనసాగాయి... తర్వాత శనివారం ఒక్కరోజు స్కూళ్లు నడిచాయో లేవో మళ్ళీ ఆదివారం సెలవు వచ్చింది. ఇలా మొదటివారంలోనే నాల్రోజులు సెలవులు వచ్చేశాయి.
ఇక ఈ వారంలో ఐద్రోజులు విద్యాసంస్థలు నడిచాయో లేవో మరో రెండ్రోజులు (రెండో శనివారం, ఆదివారం) సెలవులు వస్తున్నాయి. వచ్చేవారం కూడా దీపావళి నేపథ్యంలో మరో రెండ్రోజులు వీకెండ్ సెలవులు వస్తున్నాయి... అక్టోబర్ 19న ఆదివారం, అక్టోబర్ 20న దీపావళి హాలిడేస్ ఉన్నాయి. చివరగా అక్టోబర్ 26 సాధారణ సండే సెలవుతో అక్టోబర్ లో హాలిడేస్ ముగుస్తాయి.
ఉద్యోగులకు కూడా వరుస సెలవులు
తెలంగాణ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం దసరాకి వరుసగా మూడ్రోజులు సెలవులు ఇచ్చింది... అక్టోబర్ 1న మహర్నవమి ఆప్షనల్ హాలిడే కాగా... అక్టోబర్ 2 దసరా, అక్టోబర్ 3 పండగ తర్వాతిరోజు సాధారణ సెలవులు ఇచ్చింది... ఇక అక్టోబర్ 5న ఎలాగూ ఆదివారం కాబట్టి సాధారణ సెలవు.
రేపు, ఎల్లుండి (రెండో శనివారం, ఆదివారం) ప్రభుత్వ ఉద్యోగులకు సెలవే. కొన్ని మల్లీ నేషనల్, కార్పోరేట్, ఐటీ కంపెనీలు ప్రతి శని, ఆదివారం తమ ఉద్యోగులకు వీకెండ్ సెలవులు ఇస్తాయి.. కాబట్టి ఇలాంటి ప్రైవేట్ ఉద్యోగులకు కూడా రెండ్రోజులు సెలవే. ఇక దీపావళి, రాబోయే సండేలకు సెలవే... కాబట్టి విద్యార్థులతో సమానంగా ఉద్యోగులకు కూడా అక్టోబర్ నెలలో సెలవులు వచ్చాయి... వస్తున్నాయి.
నవంబర్ లో కూడా రెండో శనివారం సెలవు రద్దు
అక్టోబర్ లో కొన్ని తెలంగాణ జిల్లాలకు రెండో శనివారం సెలవు రద్దు చేసినట్లే నవంబర్ లో మరికొన్ని జిల్లాలకు రద్దుచేసింది ప్రభుత్వం. అక్టోబర్ 7న తెలంగాణ పోరాటయోధుడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఆయన పుట్టిపెరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చింది. ఈ క్రమంలోనే నవంబర్ 8న వచ్చే రెండో శనివారం ఈ జిల్లాలోని విద్యాసంస్థలు, కార్యాలయాలు పనిచేస్తాయని (వర్కింగ్ డే) తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.