School Holidays : మరో నాల్రోజులే స్కూళ్ళు నడిచేది... మళ్లీ వరుస సెలవులు వస్తున్నాయ్
School Holidays : దసరా సెలవులు ముగిసినా అక్టోబర్ లో సెలవుల పరంపర కొనసాగనుంది. ఈ వారంలో మరో రెండు, మొత్తంగా ఈ నెలలో 9 రోజుల సెలవులు ఉన్నాయి. ఏరోజు ఎందుకు సెలవో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ వారం కూడా వరుస సెలవులు
School Holidays : దసరా సెలవులు ముగిశాయి... దీంతో విద్యార్థులంతా బడిబాట పట్టారు. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో గతవారమే (అక్టోబర్ మొదటివారం) విద్యాసంస్థలు తెరుచుకున్నాయి... కానీ ఇవాళ్టి(సోమవారం) నుండే చాలామంది విద్యార్థులు హాజరవుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులయితే ఇవాళ స్వస్థలాలను వీడారు... అందుకే పల్లెలు ఖాళీగా, పట్నాల్లోని రోడ్లన్ని రద్దీగా మారాయి. అంటే సోమవారం కూడా కొందరు విద్యార్థులు డుమ్మానే... రేపటినుండి పూర్తిస్థాయిలో విద్యార్థుల హాజరు ఉండే అవకాశాలున్నాయి. అయితే ఇలా ఓ నాల్రోజులు గడుస్తాయో లేవో మళ్లీ వరుస సెలవులు రానున్నాయి. ఇది దసరా సెలవుల తర్వాత ఉసూరుమంటూ స్కూళ్ళకు వెళుతున్న విద్యార్థులకు ఊరటనిచ్చే సమాచారం.
ఈవారంలో వచ్చే సెలవులివే
తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ లో ప్రారంభమైన దసరా సెలవులు అక్టోబర్ లో ముగిశాయి. అంటే గత రెండు వారాలుగా సెలవులే ఉన్నాయి... దీంతో చాలామంది సొంతూళ్లకు వెళ్ళిపోయారు. దసరా సెలవులను ఎంజాయ్ చేసినవారంతా తిరిగి వర్క్ ప్లేసేస్ కు చేరుకున్నారు. ఇన్నిరోజులు పండగ సెలవులను ఎంజాయ్ చేసిన చిన్నారులకు ఒక్కసారిగా స్కూలుకి వెళ్లాల్సి రావడం కాస్త బాధించే విషయం... ఇలాంటివారు భారంగా ఫీల్ అవుతుంటారు. ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఈ వారాంతంలో వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.
ఈ శనివారం (అక్టోబర్ 11) రెండో శనివారం కాబట్టి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇక తర్వాత ఆదివారం ఎలాగూ సాధారణ సెలవే. ఇలా వరుసగా రెండ్రోజులు సెలవులు రావడం విద్యార్థుల దసరా సెలవులు ముగిశాయన్న బాధను కాస్తయినా తగ్గిస్తాయి. రెండ్రోజులు ఇంటివద్దే సరదాగా గడిపే అవకాశం వస్తుంది.
కేవలం ఈ విద్యార్థులకే సెలవులు
ఈ వారంలో ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని, తెలంగాణలోని కొన్ని విద్యాసంస్థలకు మాత్రమే రెండో శనివారం సెలవు ఉంటుంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని విద్యాసంస్థలకు ఈ రెండో శనివారం సెలవు వర్తించదు... ఈ మేరకు ప్రభుత్వం గతంలోనే క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 06న వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ మూడు జిల్లాల్లో సెలవు ప్రకటించారు... అందుకే ఈ రెండో శనివారం సెలవును రద్దుచేసి వర్కింగ్ డే గా ప్రకటించారు. ఈ మూడు జిల్లాలు మినహా తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలన్నింటికి ఈ శని, ఆదివారం రెండ్రోజులు సెలవులే.
దీపావళి సెలవులు
దసరా పండగ స్థాయిలో సెలవులు కావాలంటే వచ్చేఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఈ మధ్యలో కొన్ని పండగలకు వరుస సెలవులు రానున్నాయి. ఈ నెల(అక్టోబర్) లో దీపావళి పండక్కి వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. అక్టోబర్ 20న అంటే సోమవారం దీపావళి వస్తోంది... ఆరోజు ఇరు తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ హాలిడే. ముందురోజు ఆదివారం కాబట్టి ఈ దీపావళికి మరో సెలవు కలిసివస్తోంది.
ఈ అక్టోబర్ లో మొత్తం సెలవులెన్ని?
ఈ అక్టోబర్ నెల సెలవుతోనే ప్రారంభమయ్యింది. తెలంగాణలో అక్టోబర్ 1,2,3 తేదీల్లో సెలవులున్నాయి... ఏపీలో మాత్రం 1,2 తేదీల్లోనే సెలవులున్నాయి. అయితే కొన్నిచోట్ల భారీ వర్షాలు, వరద పరిస్థితుల కారణంగా ఏపీలో అక్టోబర్ 3న కూడా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 4 శనివారం స్కూళ్లు నడిచాయి... మళ్లీ అక్టోబర్ 5న ఆదివారం సెలవే.
ఇక ఈ వారంలో అక్టోబర్ 11 (రెండో శనివారం), అక్టోబర్ 12 (ఆదివారం) రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. తర్వాత దీపావళికి కూడా రెండ్రోజులు సెలవులు (అక్టోబర్ 19, 20) కలిసివస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు, కొందరు ఉద్యోగులకు అక్టోబర్ 18 (శనివారం) ధన త్రయోదశికి కూడా సెలవులుండే అవకాశాలున్నాయి. తర్వాత అక్టోబర్ 26 ఆదివారం సెలవు వస్తోంది. ఇలా మొత్తంగా అక్టోబర్ లో తొమ్మిది పదిరొజులు సెలవులు వస్తున్నాయి.