MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ

RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ

RTC: దసరా పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 07 2026, 08:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కరీంనగర్ జోన్ నుంచి 3,533 ప్రత్యేక బస్సులు
Image Credit : TGSRTC

కరీంనగర్ జోన్ నుంచి 3,533 ప్రత్యేక బస్సులు

కరీంనగర్ జోన్ పరిధిలోని ప్రాంతాలకు మొత్తం 3,533 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఆదిలాబాద్ రీజియన్‌కు 431, నిజామాబాద్‌కు 719, కరీంనగర్‌కు 1,175, వరంగల్‌కు 530, ఖమ్మం రీజియన్‌కు 678 బస్సులు కేటాయించారు. పండుగకు ముందు సొంతూళ్లకు వెళ్లే వారి రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఈ సర్వీసులను నడపనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హైదరాబాద్ జోన్ నుంచి 2,155.. గ్రేటర్‌లో 1,312 సర్వీసులు
Image Credit : TGSRTC@X

హైదరాబాద్ జోన్ నుంచి 2,155.. గ్రేటర్‌లో 1,312 సర్వీసులు

హైదరాబాద్ జోన్ పరిధిలో మొత్తం 2,155 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. మహబూబ్‌నగర్‌కు 645, మెదక్‌కు 255, నల్గొండకు 815, రంగారెడ్డికి 440 బస్సులు కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో మరో 1,312 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి వంటి రద్దీ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి.

35
9, 10, 16, 17 తేదీల్లో అదనపు దృష్టి
Image Credit : TGSRTC@X

9, 10, 16, 17 తేదీల్లో అదనపు దృష్టి

దసరా ముందు ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఆయా రోజుల్లో అదనపు బస్సులను సిద్ధంగా ఉంచనుంది. అలాగే పండుగ అనంతరం సొంతూళ్ల నుంచి హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం 25, 26 తేదీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీ లేని మార్గాల్లో ఖాళీగా ఉన్న బస్సులను త్వరగా వెనక్కి తీసుకొచ్చి అవసరమున్న రూట్లలో నడపనున్నారు.

45
స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలు సవరింపు
Image Credit : TGSRTC @ X

స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలు సవరింపు

దసరా సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం టీజీఎస్‌ఆర్టీసీ టికెట్ ధరలను సవరించింది. గరిష్ఠంగా 1.5 రెట్లు వరకు చార్జీలను పెంచుకునే వెసులుబాటు ప్రత్యేక సర్వీసులకు మాత్రమే ఉంటుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే స్పెషల్ బస్సుల్లో ఈ సవరించిన ధరలు వర్తిస్తాయి. ఈ నెల 9, 10, 16, 17 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఉండే 25, 26 తేదీల్లో మాత్రమే ఈ చార్జీలు అమల్లో ఉంటాయి. సాధారణ రెగ్యులర్ బస్సుల్లో మాత్రం ప్రస్తుత టికెట్ ధరలే కొనసాగుతాయి. ప్రత్యేక బస్సులకు అయ్యే అదనపు డీజిల్, నిర్వహణ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 2003లో జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారం ఈ విధానం అమలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

55
మహిళలకు ఉచిత ప్రయాణం.. రిజర్వేషన్‌కు అవకాశం
Image Credit : TGSRTC@X

మహిళలకు ఉచిత ప్రయాణం.. రిజర్వేషన్‌కు అవకాశం

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అందుతున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం దసరా ప్రత్యేక సర్వీసుల్లోనూ కొనసాగుతుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్, ప్రత్యేక బస్సులకు ఈ సౌకర్యం వర్తిస్తుందని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రధాన బస్ పాయింట్ల వద్ద ప్రయాణికుల కోసం పందిళ్లు, షామియానాలు, కుర్చీలు, తాగునీరు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారు TGSRTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక బస్సుల సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?
Recommended image2
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వెదర్.. అక్కడ ఉరుములతో వానలు, ఇక్కడ ఊపేస్తున్న ఉక్కపోత
Recommended image3
తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
Related Stories
Recommended image1
తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
Recommended image2
భార‌తీయ రైల్వేకు రోజుకు ఎంత ఖ‌ర్చ‌వుతుంది.? ఆదాయం ఎంత వ‌స్తుందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved