MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Rain Alert: ఇది క‌దా కూల్ న్యూస్ అంటే.. వ‌చ్చే వారం రోజులు వ‌ర్షాలు, ఎండ నుంచి బిగ్ రిలీఫ్

Rain Alert: ఇది క‌దా కూల్ న్యూస్ అంటే.. వ‌చ్చే వారం రోజులు వ‌ర్షాలు, ఎండ నుంచి బిగ్ రిలీఫ్

Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ ప్రజలకు కొంత ఊరట కలిగించే వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలతో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 19 2026, 08:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీగా పెరిగిన ఎండ‌ల తీవ్ర‌త
Image Credit : Gemini AI

భారీగా పెరిగిన ఎండ‌ల తీవ్ర‌త

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌ వంటి ప్రాంతాల్లో భానుడు తీవ్రంగా మండిపోవడంతో ప్రజలు బయటకు రావడానికే వెనుకంజ వేస్తున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోత తగ్గకపోవడం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోంది.

25
వడగాల్పుల ప్రభావం
Image Credit : our own

వడగాల్పుల ప్రభావం

వడగాల్పులు తీవ్రంగా ఉండటంతో చిన్నారులు, వృద్ధులు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, తగినంత నీరు తాగాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప సూర్యరశ్మికి నేరుగా గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Related Articles

Related image1
Free Train: హైద‌రాబాదీల‌కు ఉచితంగా రైలు ప్ర‌యాణం.. దెబ్బ‌కు ట్రాఫిక్ స‌మ‌స్య మాయం
Related image2
ఉద్యోగం పోతుందేమో అని భ‌యంగా ఉందా? ఈరోజే ఈ ప‌ని మొద‌లు పెట్టండి, బిందాస్‌గా బ‌త‌కొచ్చు
35
వాతావ‌ర‌ణంలో ఊహించ‌ని మార్పులు
Image Credit : Getty

వాతావ‌ర‌ణంలో ఊహించ‌ని మార్పులు

ఉపరితల గాలుల మార్పులు, మేఘాల ఏర్పాటుతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి జల్లులు కురిశాయి. ఇదే ధోరణి కొనసాగుతూ వచ్చే రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. 

45
ఏప్రిల్ 26 వరకు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం
Image Credit : Gemini AI

ఏప్రిల్ 26 వరకు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 26వ తేదీ వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని తెలిపారు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.

55
ఉదయం యథావిధిగా ఎండలు
Image Credit : Getty

ఉదయం యథావిధిగా ఎండలు

అయితే ఓవైపు వర్షాలు కురుసినా గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని అధికారులు చెబుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎండలు అలాగే కొనసాగుతాయి. అయితే సాయంత్రం సమయంలో జల్లులు పడటం వల్ల చల్లదనం ఏర్పడి ప్రజలకు ఉపశమనం లభించనుంది. మొత్తానికి మండుటెండల మధ్య వర్షాలు కాస్త ఊరటనిచ్చేలా ఉన్నప్పటికీ ఎండ‌ల నుంచి జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Free Train: హైద‌రాబాదీల‌కు ఉచితంగా రైలు ప్ర‌యాణం.. దెబ్బ‌కు ట్రాఫిక్ స‌మ‌స్య మాయం
Recommended image2
Now Playing
KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Recommended image3
Now Playing
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu
Related Stories
Recommended image1
Free Train: హైద‌రాబాదీల‌కు ఉచితంగా రైలు ప్ర‌యాణం.. దెబ్బ‌కు ట్రాఫిక్ స‌మ‌స్య మాయం
Recommended image2
ఉద్యోగం పోతుందేమో అని భ‌యంగా ఉందా? ఈరోజే ఈ ప‌ని మొద‌లు పెట్టండి, బిందాస్‌గా బ‌త‌కొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved