MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఆ రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాణాల‌తో ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు.? కొండ‌గ‌ట్టు పున‌ర్జ‌న్మ ఇచ్చింద‌ని ఎందుక‌న్నారు

ఆ రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాణాల‌తో ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు.? కొండ‌గ‌ట్టు పున‌ర్జ‌న్మ ఇచ్చింద‌ని ఎందుక‌న్నారు

Pawan kalyan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ‌నివారం తెలంగాణ‌లోని కొండ‌గ‌ట్టు అంజ‌న్న ఆల‌యాన్ని సంద‌ర్శించారు. గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు అభివృద్ధి ప‌నుల శ్రీకారం చుట్టారు. కాగా ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jan 03 2026, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొండగట్టులో పవన్ కళ్యాణ్
Image Credit : Janasena party/YT

కొండగట్టులో పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా నాచుపల్లి జేఎన్టీయూ హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయనకు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం తెలిపారు. అనంతరం అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

25
‘కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది’ అంటూ భావోద్వేగం
Image Credit : Janasena party/YT

‘కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది’ అంటూ భావోద్వేగం

దర్శనం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. కొండగట్టు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థలమని చెప్పారు. ఒక సందర్భంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. ఈ క్షేత్రం తనకు పునర్జన్మ ఇచ్చింద‌ని అన్నారు. అంజన్నపై తనకు అపారమైన భక్తి ఉందని, అందుకే ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకోవడం తనకు ఎంతో ముఖ్యమని తెలిపారు.

Related Articles

Related image1
Post Office: రూ. ల‌క్ష పెడితే రూ. 2 ల‌క్ష‌లు.. మాయా లేదు మంత్రం లేదు. ప్ర‌భుత్వ హామీ కూడా
Related image2
Business Idea: రూ. 2 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో నెల‌కు రూ. 50 వేల సంపాద‌న‌.. ఈ ఆలోచ‌న ఎవ‌రికీ వ‌చ్చి ఉండ‌దు
35
పవన్ కళ్యాణ్‌కు జరిగిన ప్రమాదం.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ క్షణాలు
Image Credit : Janasena party/YT

పవన్ కళ్యాణ్‌కు జరిగిన ప్రమాదం.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ క్షణాలు

సుమారు రెండు దశాబ్దాల క్రితం ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి తీవ్రమైన ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడటం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ప్రమాద ప్రాంతం కొండగట్టుకు సమీపంలో ఉండటంతో.. అంజన్న కృప వల్లే తనకు ప్రాణదానం లభించిందని పవన్ కళ్యాణ్ నమ్మకం. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి ఆయన జీవితంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది.

45
రూ. 35.19 కోట్లతో ధర్మశాల నిర్మాణానికి భూమిపూజ
Image Credit : Janasena party/YT

రూ. 35.19 కోట్లతో ధర్మశాల నిర్మాణానికి భూమిపూజ

భక్తుల సౌకర్యాల కోసం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించిన రూ. 35.19 కోట్ల నిధులతో కొండగట్టులో 96 గదుల ధర్మశాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. దీక్ష చేపట్టే భక్తుల కోసం ప్రత్యేక దీక్షా విరమణ మండపం కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ వాస్తు నిపుణుడు ఆనంద్ సాయి ఈ పనులను పర్యవేక్షించనున్నారు.

55
జనసేన కార్యకర్తలతో సమావేశం..
Image Credit : Janasena party/YT

జనసేన కార్యకర్తలతో సమావేశం..

అంజన్న దర్శనం తర్వాత పవన్ కళ్యాణ్ నాచుపల్లి శివారులోని ఒక రిసార్ట్‌లో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయగా.. ఆయనను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
తెలంగాణ
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Deputy CM Pawan Kalyan Visits Kondagattu Anjaneya Swamy Temple at Telangana | Asianet News Telugu
Recommended image2
Vande Bharat Sleeper Train : హైదరాబాద్ టు డిల్లీ లగ్జరీ ట్రైన్ జర్నీ.. వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలివే
Recommended image3
IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా
Related Stories
Recommended image1
Post Office: రూ. ల‌క్ష పెడితే రూ. 2 ల‌క్ష‌లు.. మాయా లేదు మంత్రం లేదు. ప్ర‌భుత్వ హామీ కూడా
Recommended image2
Business Idea: రూ. 2 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో నెల‌కు రూ. 50 వేల సంపాద‌న‌.. ఈ ఆలోచ‌న ఎవ‌రికీ వ‌చ్చి ఉండ‌దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved