- Home
- Business
- Business Idea: రూ. 2 లక్షల పెట్టుబడితో నెలకు రూ. 50 వేల సంపాదన.. ఈ ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదు
Business Idea: రూ. 2 లక్షల పెట్టుబడితో నెలకు రూ. 50 వేల సంపాదన.. ఈ ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదు
Business Idea: ఉన్న ఊర్లో ఉంటూనే వ్యాపారం చేయాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అయితే సరైన అవగాహన లేక, పోటీ తట్టుకోలేక భయపడుతుంటారు. కానీ వినూత్నంగా ఆలోచిస్తే మంచి లాభాలు పొందే ఐడియాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్లాన్ గురించి తెలుసుకుందాం.

షాపింగ్ మాల్స్‌కే పరిమితం అయిన మసాజ్ చెయిర్లు
ఇప్పటి వరకు మసాజ్ చెయిర్లు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కే పరిమితం అయ్యాయి. నగరాల బయట, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఇవి చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. నిజానికి అక్కడ కూడా మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు, వృద్ధులు, యువత ఒత్తిడి తగ్గించుకునేందుకు మసాజ్ సేవలను కోరుకుంటున్నారు. ఈ ఖాళీని బిజినెస్ అవకాశంగా మార్చుకోవచ్చు.
అమెజాన్‌లో అందుబాటులో ఉన్న మసాజ్ చెయిర్లు
అమెజాన్‌లో మసాజ్ చెయిర్లు సుమారు రూ. లక్ష ధరలో లభిస్తున్నాయి. వ్యాపారం మొదలు పెట్టిన తొలి రోజుల్లో.. ఒకటి లేదా రెండు చెయిర్లు కొనుగోలు చేస్తే సరిపోతుంది. అంటే దాదాపు రూ. 2 లక్షల పెట్టుబడితో ఈ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. భారీ యంత్రాలు అవసరం లేదు. టెక్నికల్ నాలెడ్జ్ కూడా పెద్దగా అవసరం ఉండదు.
షాపు అద్దె, కరెంట్ ఖర్చు ఎంత?
ఈ బిజినెస్‌కు పెద్ద షోరూమ్ అవసరం లేదు. ఒక సాధారణ షటర్ సరిపోతుంది. జిల్లా కేంద్రాల్లో షటర్ అద్దె సుమారు రూ. 6 వేల వరకూ ఉంటుంది. కరెంట్ బిల్లు నెలకు సగటున రూ. 600 వరకు వస్తుంది. ప్రారంభ దశలో మీరు స్వయంగా షాప్ నిర్వహించవచ్చు. తర్వాత అవసరమైతే ఒక వర్కర్‌ను పెట్టుకోవచ్చు.
గంటకు రూ. 200 వసూలు చేస్తే ఆదాయం ఎంత?
ఒక మసాజ్ చెయిర్‌ను గంటకు రూ. 200 చొప్పున ఉపయోగించేందుకు ఇవ్వవచ్చు. రోజుకు కనీసం 10 మంది కస్టమర్లు వచ్చినా రోజువారీ ఆదాయం రూ. 2,000 అవుతుంది. నెలకు దాదాపు రూ. 60 వేల గ్రాస్ ఇన్‌కమ్ వస్తుంది. అద్దె, కరెంట్ బిల్ కలిపి సుమారు రూ. 10 వేల ఖర్చు పోయినా మిగిలేది నెలకు రూ. 50 వేల నికర ఆదాయం.
డిమాండ్ పెరిగితే ఆదాయం లక్షకు చేరే ఛాన్స్
ఈ బిజినెస్‌లో డిమాండ్ పెరిగే కొద్దీ మరిన్ని మసాజ్ చెయిర్లు జోడించవచ్చు. రెండు చెయిర్ల నుంచి నాలుగు చెయిర్లకు పెంచితే ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. మంచి లొకేషన్, సరైన ప్రచారం ఉంటే నెలకు రూ. లక్ష వరకూ సంపాదించే అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడి, తక్కువ నిర్వహణ ఖర్చు, రోజువారీ నగదు ప్రవాహం ఉండటమే ఈ బిజినెస్ ప్రత్యేకత.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. వ్యాపారం మొదలు పెట్టే ముందు ఈ రంగంలో అప్పటికే ఉన్న వారిని నేరుగా కలిసి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

