Hyderabad: ఈ ఏరియా మరో హైటెక్ సిటీ కావడం ఖాయం.. ఇప్పుడే కొంటే కోట్లు కురుస్తాయి.
భారతీయులు పెట్టుబడులు పెట్టే ప్రధాన రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. సొంత భూమి, సొంత ఇంటి కోసం కొందరు ఇన్వెస్ట్ చేస్తే మరికొందరు ఫ్యూచర్ కోసం భూములు కొనుగోలు చేస్తుంటారు. మీరు కూడా ఇలాంటి ఆలోచనతో ఉన్నారా.? అయితే ఈ కథనం మీ కోసమే.

శరవేగంగా విస్తరిస్తోన్న భాగ్య నగరం
హైదరాబాద్ మహా నగరం శర వేగంగా విస్తరిస్తోంది. 500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చారిత్రాత్మక నగరం ఐటీ రాకతో సరికొత్త పుంతలు తొక్కింది. ఒకప్పుడు నగర శివారు ప్రాంతాలు ఇప్పుడు నగరంలో కీలక ప్రాంతాలుగా మారాయి. ఒకప్పుడు అబిడ్స్ నగరం మధ్యలో ఉండేది. ఇప్పుడు జూబ్లిహిల్స్, బంజారహిల్స్ వంటి ప్రాంతాలు ఓ రేంజ్‌లో అభివృద్ధి చెందాయి.
విపరీతంగా పెరిగిన ధరలు
శివారు ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా సంగారెడ్డి, మెదక్ వంటి కొన్ని జిల్లాలల్లో కూడా రియల్ బూమ్ పెరిగింది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో భూముల ధరలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం ఇందులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
ఉత్తర హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో వేగం
ఇప్పటి వరకు పశ్చిమ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను శాసించగా, ఇప్పుడు దానికి సవాల్ విసురుతూ ఉత్తర హైదరాబాద్ నిలుస్తోంది. ముఖ్యంగా మేడ్చల్, కల్లకల్, తూప్రాన్ వంటి ప్రాంతాల్లో రియల్టీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.
మౌలిక సదుపాయాల పెరుగుదల, రహదారి అభివృద్ధి, ఆర్ఆర్ఆర్ (ORR), జాతీయ రహదారి NH-44 అనుసంధానంతో ఈ ప్రాంతాలకు పెట్టుబడిదారులు భారీగా మొగ్గు చూపుతున్నారు. గతంలో గ్రామీణ హోదాలో ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు నగరశైలికి మార్పు చెందుతున్నాయి.
ఐటీ పార్కులు
ఉత్తర హైదరాబాద్ అభివృద్ధికి వెన్నెముకగా గేట్‌వే ఐటీ పార్క్ నిలుస్తోంది. కండ్లకోయలో నిర్మాణంలో ఉన్న ఈ పార్క్ ప్రాంతంలోని స్థలాలకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. అలాగే, కొంపల్లిలోని ఐటీ పార్క్, మేడ్చల్‌లోని జీనోమ్ వ్యాలీ 3.0 విస్తరణలు కూడా ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి.
ఈ అభివృద్ధి పనులు భూముల ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. ఒకప్పుడు గజం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు పలికిన ప్రాంతాల్లో ఇప్పుడు అదే గజం ఏకంగా రూ. 30 వేల వరకు చేరడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
ఇండస్ట్రియల్ బెల్ట్‌గా మారుతున్న మేడ్చల్
మేడ్చల్-కండ్లకోయా ప్రాంతం ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతోంది. లైట్ మ్యానుఫాక్చరింగ్, గిడ్డంగులు, మౌలిక పరిశ్రమలు ఈ ప్రాంతంలో స్థిరపడుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ స్థలం లభిస్తున్న కారణంగా పరిశ్రమల దృష్టి ఈ ప్రాంతాలపైనే ఉంది.
దీనితో పాటు గ్రీన్ డెవలప్‌మెంట్‌పై డెవలపర్లు దృష్టిసారిస్తున్నారు. సాధారణ మధ్య తరగతి కుటుంబాలు కూడా ఇక్కడ స్థలాలు కొనుగోలు చేయాలనే ఆసక్తి చూపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే 3-5 సంవత్సరాల్లో ఈ ప్రాంత భూముల ధరలు నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది.
నోట్: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. రియల్ ఎస్టేట్ కానీ మరే రంగంలో కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవడం ఉత్తమం.